Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ లోపల “దీన్ -ఇ-ల్లాహీ” లేక దివ్యమతము అనబడు నూతన మతమును అక్బరు స్థాపించెను. ఈ నూతన మత పరిణామములు అబుల్ ఫజులు అక్బరుపై గల పలుకు ఐడిని ఇంకను అతిశయింపజేయుటకు కారణముల య్యెను. అక్బరు ఆస్థానమునందలి ఉన్నత వంశీయులగు ఉద్యోగులు త అబుల్ ఫజల్ యెడల అసూయను వహించిరి. ఇతనిని దక్కనుకు పంపుట మంచిదని వారు అక్బరునకు సలహా చెప్పిరి. అక్కడ పొసగిన ఏదైన ఒక యుద్ధములో గాని, నిర్వహింపవలసిన పరిపాలనములో గాని లోటు వచ్చిన యెడల సమ్రాట్టునకు అబుల్ ఫజల్ యందు గల గౌరవ మునకు న్యూనత వాటిల్లునని వా రూహించుటయే దీనికి కారణము. యువరాజగు సలీమున (జహంగీరు)కు కూడ అబుల్ ఫజల్ ఎడల అనిష్టము ఏర్పడియుండెను. తనకును తన తండ్రికిని వైమనస్యము ఏర్పడుటకు అబుల్ ఫజలే ముఖ్యముగా కారణభూతుడని గూడ అతడు నిశ్చయిం చెను. 1801 లో యువరాజగు సలీము యొక్కయు, తదితరుల యొక్కయు ప్రేరణచే అబుల్ ఫజల్ దక్కను నకు సైనిక కార్యనిర్వహణమునకై పంపబడెను. అబుల్ ఫజల్ దక్కనులో అపజయమునొందునని ఇతని విరోధులు ఊహించియుండుట సరికాదు. ఎందుచేతననగా ఇతడు తన సర్వ కృత్యములను అచ్చట సమర్థతతో నిర్వహించెను. పై నికచర్యను నిర్వహించు విషయములో గూడ అత్యంత సమర్థుడు అను కీర్తిని ఇతడు పొందెను. కీ ఇంతలో యువరాజగు సలీము తండ్రితో కలహింప దొడగెను. అక్బరు యొక్క ఉన్నతోద్యోగులు కొందరు సలీము పదమును అభిమానించుచున్నట్లు సమ్రాట్టునకు స్ఫురించెను. అబుల్ ఫజల్ ఒక్కడే అక్బరునకు నమ్మ దగిన బంటు అయియుండెను, ఆస్థానములో ఇతని ఉనికి అత్యవసరమై యుండెను. ఆ కారణములచేత ఉత్తర 'హిందూదేశమునకు తత్ క్షణమే బయలు దేరి రావలయునని అక్బరు అబుల్ ఫజల్కు ఉత్తరువులు పంపెను. రాజాజ్ఞ చొప్పున తన కుమారుడగు అబ్దుల్ రహమానునకు తన దశాధిపత్యమును అప్పగించి, కొలదిమంది అనుచరులతో మాత్రమే అబుల్ ఫజల్ 'ఆగ్రాకు బయలు దేరెను. బుందేలా నాయకుడగు రాజా బీర్ సింగు యొక్క రాజ్యభాగము 'గుండ అబుల్ ఫజల్' ప్రయాణము చేయవలసివచ్చెను. 223 అబుల్ ఫజల్ ఈ అవకాశమును పురస్కరించుకొని ఇతనిని హత్య చేయుటకు సలీము రాజాబీర్ సింగును ప్రేరేపించెను. ఆస్థాన ములో అగౌరవమును పొందియున్న బీర్ సింగు, యువ రాజును సంతోష పెట్టుటకై దొరికిన అవకాశమును ఆసక్తితో పరిగ్రహించెను. రాజ్యాభిషిక్తుడైన తర్వాత, సలీము వలన తప్పక తనకు గొప్ప బహుమానము లభింపగల దని విశ్వసించి, ఆశ్వికుల యొక్కయు, పదాతులయొకయు ఒక పెద్ద దళమును బీర్ సింగు నార్వారువద్ద నిలిపెను. అబుల్ ఫజలు, ఇరని ఆశ్వికులును బీర్ సింగు యొక్క సంఖ్యా బలమునకు లోబడిరి. అబుల్ ఫజల్ ఇట్లు 1802 ఆగస్టు 12 వ తేదినాడు హత్య గావింపబడెను. ఇతని తల అలహాబాదులో నున్న యువరాజు నొద్దకు పంపబడెను. శత్రువగుటచే అబుల్ ఫజల్ను తానే హత్యకు పాల్పర చితినని సంపూర్ణమైన నిర్లక్ష్య భావముతో సలీము తన 'జీవన స్మృతులు ' అను గ్రంథములో బహిరంగముగా ఒప్పుకొనెను. 'నేను పితృభక్తి గల కుమారుడను, అబుల్ ఫజల్ మొదలగువారు తమ దు సంత్రములచేత నాతండ్రి నన్ను ప్రేమింపకుండ జేసిరి' అని సలీము వ్రాసికొనెను. అక్బరు అబుల్ ఫజల్ యొక్క మరణమునకు మిక్కిలి దుఃఖించెను. కొంతకాలము ఎవ్వరికిని దర్శన మొసగుట కాతడు ఇష్టపడలేదు. అబుల్ ఫజల్ దుర్మరణమునొందిన పరిస్థితులను గూర్చి విని "సలీము సమ్రాట్టు కాగోరిన యెడల నన్నే చంపి అబుల్ ఫజల్ ప్రాణములను కాపాడి నచో బాగుండెడిది" అనుచు అక్బరు వాపోయెను. అబుల్ ఫజల్ గొప్ప కార్యళూరుడు. అక్బరు నామా అను నాతని గ్రంథము అతని గొప్ప కృషికి ఒక స్మారక చిహ్నము. దాని తర్వాత మిక్కిలి విలువగలది అతని (గ్రంథ భాగమగు) మూడవ సంపుటము. దీనికి 'ఆయిన్ ఇ-అక్బరీ లేక అక్బరు యొక్క నియమావళి అను పేరు కలదు. అక్బరు యొక్క పరిపాలనమునకు చెందిన విషయ 'ములు తెలిసికొనుటకు ఇది అన్నిటికంటె సాధికారమైన ఆధారముగా నున్నది. అబుల్ ఫజల్ ఇతర గ్రంథములను పెక్కింటిని రచించెను. " ఆయార్ -ఎ- దానిష్ " అనునది “అన్వర్ -ఇ-సుహైలీ" అను గ్రంథము యొక్క సంక్షిప్త రవనా రూపము, "మక్తుజర్-ఇ-అల్లామీ' లేక 'అన్నాయీ అబుల్ ఫజల్ ' అను శీర్షికతో ఇతని లేఖలు అనేకముకు