Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అబుల్ ఫజల్ అక్బరునామాలో ఇత డిట్లు తన్ను గూర్చి వ్రాసికొనెను. "కాలము మొదట నాకు అనుకూలపడలేదు. అందుచేత నేను దాదాపు స్వార్ధపరుడను, గర్వితుడను అయి సర్వ సంగ పరిత్యాగిని కావలయు నని నిశ్చయించుకొంటిని. నా చుట్టును అనేక శిష్యులు చేరిన కొలదియు నా విద్యా డంబరము అతిశయింప దొడగెను. నిజమునకు విద్యా గర్వముచే ఏ కాంతవాసమునకై ఆతురపడితిని. నా అదృష్టవశమున ఏకాంత ప్రదేశములలో నిజమైన సత్యా న్వేషకుల సాంగత్యములో కొన్ని రాత్రులు గడపుట సంభవించెను. నిర్ధనులయ్యు జ్ఞానధనులైన పెద్దల సాంగ త్యము నా కానందమును చేకూర్చెను. అందువలన నేను నేత్రములను తెరచితిని. అంతట పండితంమన్యుల స్వార్థ పరత్వము నాకు గోచరించెను. నా తండ్రియొక్క ఉప దేశములు అజ్ఞానోపద్రవమున బడకుండ ఎట్టకేలకు నన్ను రక్షింపగలుగు చుండెను. నా మనస్సునకు శాంతి లేదాయెను. మంగోలియా యందలి యతుల దెసకును, లెబనాన్ లోని మునుల వైపునకును నా హృదయము ఆకర్షిం బడ సాగెను. టిబెట్ దేశపు లామాలతోడను, పోర్చుగలులోని మత గురువులతోడను, పార్శీ మత గురువులతోడను, “జెండా ఎవస్తా" పండితులతోడను సమా వేళములకొరకు ఉవ్విళ్ళూరుచుంటిని. నా స్వంత దేశపు పండితుల విషయమున నా కసహ్యభావ మేర్పడెను. ఉదారవిషయ విచారమార్గమున సమ్రాట్టు నాకు నేత కాగలడను నాశతో ఆతని యాస్థానములో చేరుమని నా సోదరులును తక్కిన బంధువులును నాకు సలహా నొసగిరి. వారి హెచ్చరికలను తిరస్కరించుటకు నేను వ్యర్థప్రయత్నమును చేసితిని. ఇప్పుడు నేను ఆనందినై యున్నాను. ఏమనగా సమ్రాట్టు కర్మప్రపంచమున మార్గ దర్శకుడుగను, ఏకాంతవాసమున ఆశ్వాసకుడుగను నాకు ఉపకరించెను, నా ధార్మిక వాంఛయు నా నిర్దిష్ట కృత్య నిర్వహణ వాంఛయు అతనిలో సాఫల్యము వొందెను.” అబుల్ ఫజల్ తొందరగా ఉన్నతపదవి కెక్క లేదు. షదునొకండు సంవత్సరములు భక్తి తత్పరమైన సేవచేసిన తర్వాత మాత్రమే ఇతడు వేయిమంది భటులకు నాయకు డయ్యెను. 1588 లో అమభవవృద్ధుడైన షాఆలీ మహ్రమ్ తోకలసి ఇతడు ఢిల్లీ యొక్క సంయుక్త పరిపాలనలో 222 పాల్గొనెను. 1592 లో ఇతడు రెండువేల మంది భటులకు నాయకుడయ్యెను. 1800లో నాలుగు వేలమంది భటులకు నాయకుడుగా ఇతడు నియుక్తుడయ్యెను. 'ఇబాదత్ ఖానా' లో ప్రతి గురువారము సాయం కాలమున జరుగు సమావేశములలో చర్చలు జరుగుచుం డెను. వీటియందు అక్బరునకు అభిరుచి మెండుగనుండెను. అట్టి తరుణములందు పూర్వాచార పరాయణులగు పండి తుల వివాదములను రెచ్చగొట్టుటలో అబుల్ ఫజల్ కృత కృత్యుడయ్యెను. పూర్వాచార పండితులలో అంతకు ముందుండెడి ఐకమత్యము లోపించెను. అక్బరునకు గల మతవిషయక సంశయములు తొలగలేదు. అవి పెంపొంద జొచ్చెను. అక్బరు తన సభ్యపక్షమునకు అబుల్ ఫజల్ ను నాయకునిగా నిర్ణయించెను. తుదకు అబుల్ ఫజల్ ఉలేమా మత పండితులను చర్చలలో ఓడింపగలిగేను. ఐహిక విషయములలో మాత్రమే కాక, ఆధ్యాత్మిక విష యములలో గూడ పరిపాలిత ప్రజలు తమ సమ్రాట్టును నాయకునిగా అంగీకరించుట ధర్మము అనుమాటకు అక్బరు సమ్మతించునట్లుగా అబుల్ ఫజల్ బోధించెను. ఈ నూతన మత సిద్ధాంతము రాజుచే ప్రకటింపబడుట అబుల్ ఫజల్ యొక్క అదృష్టమునకు నాందియయ్యెను. పూర్వాచార పరాయణులగు పండితులు తమ పదవులకు ప్రమాదము వాటిల్లుట చూచి లోబడుటకు సంసిద్ధతను సూచించిరి. కాని ప్రయోజనము లేకపోయెను. షేక్ ముబారక్, ఆతని పుత్రులు కలిసి తయారు చేసిన విశిష్టమైన పత్రముపై ఆ పండితులు సంతకములను కూడ చేసిరి. ఈ పత్రము నందు సమ్రాట్టునకు ధర్మపాలకుడనియు "ముజ్ తాహిద్” (అనగా ఇస్లామునకు సంబంధించిన అన్ని వ్యవహారము అందును) అందును) అప్రమాధశీలుడగు అధికారి అనియును రూఢి చేయబడెను. “సత్యవ్రతుడగు రాజు యొక్క విజ్ఞానము” అనునది ఒకటే ఇట్లు శాసననిర్మాణమునకు మూలాధార మయ్యెను. సమస్త పండితులును, న్యాయవాదులును మత విషయములలో అక్బరు విధించు శాసనములకు బద్ధు అగుటకు అంగీకరించిరి. పండితులు తా మింతకు ముందు అనుభవించుచున్న సమున్నత స్థానమును కోల్పోయిరి. అక్బరునకును వారి యెడగల అనుమానములు అధికతరము అయ్యెను.