Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కును ఇచ్చట అవసరమైన నీటి సదుపాయము ఉన్నది. ఎట్టి పరిశ్రమలు లేవనియే చెప్పవలసియుండును. అడవులు విశేషముగా కలవు. ఇనుము, రాగి, బొగ్గు, సల్ఫరు గనులు ఈ దేశములో ఎక్కువగా నున్నవి. చెప్పదగిన ఖనిజ సంపదయు, వ్యవసాయ సంపదయు ఉన్నప్పటికిని ఈ దేశము ఆర్థికముగా ఉన్నత స్థితిలో లేదు. దీనికి ముఖ్యకారణములు దేశమంతయు పర్వతమయమ గుట, రైలు మీద గాని, నీటి మీద గాని ప్రయాణమున కెంత మాత్రము తగిన సౌకర్యములు లేకపోవుట. ఈ దేశము నకు అడ్డిస్ అబాబా ముఖ్య పట్టణము. అడోవా, గండక్ అనునవి ఈ దేశములోని ముఖ్య వ్యాపార కేంద్రములు. బి. రా.రా. అబుల్ ఫజల్ :- అబుల్ ఫజల్ క్రీ. శ. 1551 జనవరి 14 వ తేది యందు ఆగ్రాలో జన్మించెను. ఖురానుపై వ్యాఖ్యాతయును, సర్వజ్ఞాన సంపన్నుడును అగు షేక్ ముబారక్ నాగోరీ అను నాతనికి ఇతడు రెండవకుమారుడుగా జన్మించెను. అక్బరు ఆస్థానములో సుప్రసిద్ధ కవి యగు ఫయిజీకి ఇతడు తమ్ముడు. తండ్రి వైపు విచారించినచో, ఇతడు భారతదేశమునకు వలస వచ్చిన ఒక అరేబియా కుటుంబమునకు చెందినవాడు. ఈ కుటుంబము తొలుత సింధులోను, తరువాత జోధ్ పూరు నందలి నాగోరులోను స్థిరనివాస మేర్పరచుకొనెను. అందుచేత ప్రజలు అబుల్ ఫజల్ తండ్రియగు షేక్ ముచారకును నాగోరీ యని పిలుచుచుండిరి. అబుల్ ఫజల్ పుట్టుకకు కొన్ని సంవత్సరములకు ముందు షేక్ ముబారక్' పెండ్లి చేసికొని ఆగ్రాలో స్థిరావాస మేర్ప రచు కొనెను. ఐనను నాగోరీ యను పేరుతోనే ప్రజ లీతనిని పేర్కొను చుండెడివారు. తల్లి పక్షమున పార సీక దేశమునందు షిరాజ్ దగ్గర మన్న ఇడిజ్ లో నివ పించుచుండెడి రఫీయాల్దీన్ సఫాలీతో అబుల్ ఫజల్ బంధుత్వము కలిగి యుండెను. ఈ సఫాలీ, సిద్దపురుషు డుగా, మహాత్ముడుగా ప్రసిద్ధికెక్కి యుండెను. అందుచే సమ్రాట్టు హుమాయూను ఆతని విరోధియగు షేర్షా సూరి ఇరువురును ఆ మహాత్ముని సలహాలను పొందు చుండిరి. 221 అబుల్ ఫజల్ అబుల్ ఫజల్ బాల్యమున పఠనాసక్తి గలవాడె తండ్రి రక్షణమున అత్యుత్సాహముతో చదువుకొనుచు వృద్ధినొందెను. మహదవీ సంప్రదాయము నెడ అభిమాన మును కలిగియున్న కారణముచేత ఇతని తండ్రియగు షేక్ ముబారక్ పెక్కు క్లేశములకు గురి కావలసివచ్చెను. ఆ క్లేశములు అబుల్ ఫజల్ లేతమనస్సుపై శాశ్వతముద్రను గావించెను. తన్మూలముననే అబుల్ ఫజల్కు సహనగుణ మజ్బెను. ఈ సహన గుణాభ్యాసము ఇతనికి ఉ త్తరకాలము నందు అక్బరుతో స్నేహమేర్పడుటకు మూలమయ్యెను. అబుల్ ఫజల్, తన మానసిక వికాసమును గూర్చి ఇష్ట యను గ్రంథమున వ్రాసికొనెను. ఆ వ్రాతను బట్టి ఇట్లు తెలియు చున్నది: ఐదవ సంవత్సరమున ఇతడు చదువ నారంభించి పదునేనవ సంవత్సరము నాటికి ఆనాడు వ్యాప్తిలో నున్న విజ్ఞానశాఖలన్నిటియందును ప్రజ్ఞా వంతు డయ్యెను. అటు తర్వాత పది సంవత్సరముల పాటు విద్యార్థులకు విద్యగరపుచు సమకాలికులగు పండి తులతో మతవిషయక చర్చలయందు పాల్గొనుటలో కుతూహలుడగుచు ఇతడు కాలము గడపెను. కాని వైజ్ఞానిక వ్యాసంగములవలన ఇతనికి అంతశ్శాంతి లభింపలేదు. అందుచేత సన్యసింపవలయునను కోరిక ఇత నికి కలుగుచుండెడిది. అబుల్ ఫజల్ అన్నయగు ఫయిజీని ఆస్థానములో చేరవలసినదిగా అక్బరు ఆహ్వానించెను. అది మొదలుకొని అబుల్ ఫజల్ యొక్క మనమున ఉజ్జ్వల తరమైన తన భవిష్యత్తును గూర్చి ఆళలు పొడమెను. అక్బరు ఆస్థానములో తన తండ్రి అయిన షేక్ ముజా రక్ను ద్వేషించినవారు అనేకులుండిరి. ఐవను అక్బరు తన కొసగు ప్రోత్సాహమునుబట్టి ఓరిమితోడను రాజ భక్తితోడను తాను సేవచేసినచో అది నిష్ఫలము కాజాల దని అబుల్ ఫజల్కు విశ్వాస మేర్పడెను. ఈ లోపుగా ఫయిజీ అక్బరు యొక్క స్నేహమును సంపాదించుకొని దానిని నిలుపుకొనుటలో గొప్ప నేర్పును చూపెను. ఆనేర్పు అబుల్ ఫజల్ యొక్క శ్రేయస్సునకు సాధన మయ్యెను. 1574 ప్రారంభములో అబుల్ ఫజల్ ఫయిజీ యొక్క సోదరుడుగా అక్బరునకు పరిచయము కావింప బడెను. అక్బరు ఇతనిని మిక్కిలి ఆదరముతో స్వీకరించెను. అందుచేత ఇతడు ప్రపంచ పరిత్యాగబుద్ధిని త్యజించెను.