Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అది అంతఃకలహాలతో, విదేశీయుల దండయాత్రలతో విచ్ఛిన్నమయ్యెను. 16 వ శతాబ్దములో ఇథోపియారాజు మహమ్మదీయులనుండి తమ్ము రక్షింపుమని పోర్చుగల్ రాజును కోరెను. కోరిన సహాయము లభించెను, ఇడో పియా మహమ్మదీయుల హస్తగతము కాకుండ రక్షింప బడెను. అదే కాలములో రోమన్ క్యాథలిక్కు ప్రచార కులు ఇథోపియాలో ప్రవేశించి ఇథోపియా రాజును క్యాథలిక్కు మతమును స్వీకరింపుమని బలవంతము చేసిరి. కాని ప్రజలు వారిని ప్రతిఘటించిరి. చివరకు కావైక్ క్రైస్తవమే నిలిచిపోయెను. విదేశీయులందరు బహిష్క రింప బడిరి. అయినమ “జేమ్సు బ్రూస్" వంటి పరిశోధ కులు ఇథోపియాకు వచ్చుచునే యుండిరి. ఆపైని రెండు శతా బ్దముల దనుక దేశము అంతఃక లహములకు గురి యయ్యెను. ఈ అంత ర్యుధ్ధములవల్ల అ నేక ప్రాచీనభవనములు నాళన మైనవి. 19 వ శతాబ్దములో కాసా' అను నొక సరదారు శత్రువులపై విజయముపొంది రెండవ థియోడోర్" అను బిరుద ముతో రాజయ్యెను. క్రీ. శ. 1818-1888 మధ్య ఇథోపియా ఇతనికి స్వాధీన మయ్యెను. 2వ ధియో ఎఱ్ఱసముద్రము గండర్ కెన్ యా. డోర్ ప్రాచీన ఇథోపియా సామ్రాజ్యమును పునరుద్ధ రింప వలెనని ప్రయత్నము చేసెను. కాని విఫలుడయ్యెను. థియోడోర్ నిరంకుశుడు, అతనికి బ్రిటిష్ వారితో తగాదా వచ్చెను. 1884 లో ఇథోపియాలోని బ్రిటిష్ రాయగారిని, అతని అనుచరులను బంధించెను. 1887 లో బొంథాయినుండి రాబర్టు సేపియర్ ఆధిపత్యమున బ్రిటిష్ సైన్యము ఇథోపియా పైబడి రాజధానియైన మాన్డలాడును 1888 లో స్వాధీనపరచు కొనెను. 219 అబిసీనియా (ఇథోపియా) రెండవ థియోడోర్ ఆత్మహత్య చేసికొనెను, కొంక కాలమునకు బ్రిటిష్ సైన్యము దేశమును విడిచి పోయెను. 88 తరువాత టైగర్ రాష్ట్ర గవర్నరు ఇథోపియా రాజయ్యెను. కాని 'షోవా' రాష్ట్ర పాలకుడు ' మెనిలిక్ ' అనువాడు ఇటలీ సహాయముతో ఇథోపియాను మించుకొనెను. 1889 వరకు మెనిలిక్ ్కు ఆథోపియా అంతయు స్వాధీన మయ్యెను. ఇటలీకి మెనిలిక్కు సహాయము చేయుటలో స్వార్థము లేకపోలేదు. మెనిలిక్ విజయము తరువాత ఇటలీవారు తాము ఇథోపియా (అప్పటికే అబిసీనియా అని పిలువబడు చుండెడిది. అబిసీనియా అనునది అరబీ పదము) సంరక్షకులమని అబిసీనియా (ఇతియోపియా) అరేబియా ఎడన్ ఎడన్ సిం: శాఖ బ్రిటిష్ సోమాలిలాండ్ ఇటా లియన్ సోమాలిలాండ్ ఉద్ఘాటించిరి. దానితో నిను వైరము ప్రాప్తించెను. 1895 లో ఇటాలియన్ సైన్యములు అబిసీనియా పై దాడిచేసెను. కాని అపజయమునే పొందెను. కొంతకాలము యుద్ధము జరిగిన తరువాత ఇటలీ అబిసీనియా స్వాతంత్ర్య మును అంగీకరించెను. ఎఱ్ఱ సముద్ర తీరప్రాంతమును (నేడు ఎరిట్రియా అనబడు చున్నది) కోల్పోయెను. మెనిలిక్ ప్రాన్స్, బ్రిటన్ దేశాలతో స్నేహము చేసెను. ఇతని కాలములో అబిసీనియా అభివృద్ధి చెందెను. దేశములో రైలుమార్గము నిర్మింపబడెను. న్యాయ శాస్త్రము రూపొందింప బడెను. మెనిలిక్కు తర్వాత వచ్చిన 'లిజ్ యాస్' అనురాజు ఇస్లాంమత ప్రచారము చేయబూని తత్ఫలితముగా సింహాసనమును కోల్పో యెను. అతని అనంతరము మెనిలిక్ కుమార్తె 'జుడిత్ ' రాణి అయ్యెను. 'రాస్ తఫారిమాకొ నెవ్' అనునతడు సంరక్షకుడయ్యెను.