Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అబిసీనియా (ఇథోపియా) వందలమంది నాట్యక త్తెలు, బంగారు జీనులుకల గుఱ్ఱ ములపై నెక్కిన మున్నూర్గురు ఆశ్వికులు, నూరు వానర ములు, ఇతర పరివారమును నడచుచుండుట కాననగును. అన్నిటిని మించి ఒక పవిత్ర క్షేత్రములోని బుద్ధ దేవుని మహా దేవాలయము ఈ విదేశీయ యాత్రికుని ముగ్ధుని చేసెను. "బుద్ధ దేవాలయము చాల పెద్దది. విశాలమైనది. ఆ దేవాలయము రష్యా దేశములోని ఆ త్వెర్ నగరమంత విశాలమైనది. ఆ దేవళము శిలా నిర్మితమైనది. ఆ శిలలపై బుద్ధదేవుని పవిత్ర కథలన్నియు చెక్కబడి యున్నవి. ఆ మహాత్ముడు ఎన్ని జన్మ లెత్తెనో, ఏయే అవతారములను దాల్చెనో, ఎన్నేన్ని అద్భుత మాహాత్మ్యములను కావించెనో, ఆ వివరము లన్నియు శిలలపై చిత్రించబడినవి. ఒకప్పుడు మానవా కారము తోను, ఇంకొకప్పుడు గజాననాకారముతోను, మరొక ప్పుడు వానరాకారముతోను, మరికొన్ని సందర్భము లలో భయంకరమైన మృగ శిరస్సుతోను, ఏడడుగుల వాలముతోడను— ప్లే ఎన్నెన్నో రూపములతో ఆ దేవుడు ఈ శిలా శిల్పములలో కన్పించును. బుద్ధ దేవుని అద్భుత జన్మవిశేషములను సందర్శించుటకు, హిందూదేశ మంతటినుండియు అసంఖ్యాక జనులు ఈ దేవాలయము నకు వత్తురు. రాతిలో చెక్కబడిన ఒక మహోన్నత మైన బుద్ధ విగ్రహ మిచ్చట కలదు. ఆ శిలామూర్తి చేయియె తి నిలచియుండును. ఆయన తోక శరీరమును చుట్టబెట్టు కొని యున్నది. ఆయన ముఖము వానర ముఖమువలె నున్నది. బుద్ధుని ఎదుట నల్లరాతిలో మలచిన మహోన్నత మగు వృషథమొకటి కలదు. ఈ వృషభముపై బంగారు నీటితో చక్కని అలంకారములు చిత్రింపబడి యున్నవి. ఎంద రెందరోవచ్చి, ఈ వృషభ రాజము యొక్క కాలి గిట్టను ముద్దిడుకొని, దానిని, బుద్ధుని పుష్పములతో పూజించి, పోపుదురు.” ఈ విదేశీయుడు హనుమంతుని విగ్రహమునుచూచి బుద్ధ విగ్రహమని పొరబడియుండును. హిందూదేశము లోని వివిధ దేవతా విగ్రహములను గుర్తించుటలో విదే శీయులు పలువురు ఇళ్లే తికమకలు పడుచుందురు. ఏది యెట్లున్నను అఫనాశీ నికితిన్ యొక్క దినచర్య గ్రంథము నేటికి అయిదు శతాబ్దములనాటి భారతీయ దృశ్యములను మనముందుంచి ఎంతయో చారిత్రక ప్రాముఖ్యమును వహించుచున్నదనుటలో సందేహము లేదు. మ. జ. రా. అబిసీనియా (ఇథోపియా): చరిత్ర : తూర్పు ఆఫ్రికాలోని ఈ రాజ్యము ఎప్పుడు స్థాపింపబడ్డదో తెలిసికొనుటకు సరియైన ఆధారములు లేవు. కాని అచటి గాథలనుబట్టి నేటికిని అధికారములో ఉన్న రాజవంశము క్రీ. పూ. 1000 ప్రాంతము నాటిదనియు ఆ రాజవంశము వారు సాలమన్ రాజుకుమారుడైన మెనివెక్ యొక్కయు, 218 రాణి యొక్కయు వంశీయు అనియు చెప్పబడు చున్నది. షేబారాణి జ్యేష్ఠ పుత్రుడు ఈ రాజ్యమును సంపాదించినాడట ! "షేడా" అనగా ఇథోపియా అనియు, తన తల్లి పేరనే ఈ రాజ్యమునకు "ఆథోపియా" అని పేరు పెట్టినాడనియు వాడుక. క్రీ. శ. మొదటి శతాబ్దమునాటికి ఇథోపియనులు 'వేగనులు' అనబడెడివారు. అనగా రకరకాలైన దేవతా పూజలను చేసెడివారని అర్థము. క్రీ. శ. నాల్గవ శతాబ్ద ములో ఇథోపియారాజు “కావైక్” క్రైస్తవ మతమును స్వీకరించెను. కావైక్ క్రైస్తవులు క్రైస్తవులం దొక తెగవారు. వీరెక్కువగా ఈజిప్టు, ఇథోపియా మున్నగు ఆఫ్రికా దేశములలోనే వ్యాపించి ఉండిరి. కావైక్ చర్చికి సర్వాధికారి ఈజిప్టు రాజ్యములోని అలెగ్జాం డ్రియాయం దుండువాడు. ఆరవ శతాబ్దములో ఇథో పియారాజు ఎఱ్ఱసముద్ర ప్రాంతమును స్వాధీన పరచు కొని ఆమార్గముగా అరేబియానై దండయాత్ర సలిపి "యమన్" అనెడు సారవంతమైన రాష్ట్రమును చెను. నాటినుండి 50 ఏండ్లదనుక "యమన్" ఇథోపియా రాజ్యభాగముగా ఉండెను. ఈ కాలములో నే ఆథోపియా ప్రపంచములోని వివిధ దేశములతో సంబంధములు కలిగి అభివృద్ధి నొందెను. జయం క్రీ. శ. ఏడవ శతాబ్దములో మహమ్మదీయులు ప్రజలి ఈజిప్టును జయించిరి. ఎఱ్ఱసముద్ర తీరప్రాంతము వారి స్వాధీనమయ్యెను. ఇథోపియా తన పూర్వోన్నతిని కోల్పోయి ఏకాక్ యైనది. ఆతరువాత కొన్ని శతాబ్ద ముల వరకు ఇథోపియా కల్లోల పరిస్థితులలో నుండేను.