Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అఫనాశీ నికితిన్ :- రష్యా దేశములోని క్వెర్ నగరనివాసియైన అఫనాశీ నికితిన్ అను వర్తకుడు, హిందూదేశమునకు యాత్ర ఆఫవాశీ కితిన్ కావించిన ఐరోపీయులలో నొకడు. హిందూ దేశమును గూర్చియు, ఇచ్చటి జనులను గూర్చియు ఆ కాలములోని రష్యా ప్రజలలో చిత్ర విచిత్ర మైన అభిప్రాయము లు వ్యాపించి ఉండెడివి. అనేక నదులను దాటి, సముద్రము లను తరించి, పర్వతములను అధిగమించి, ఎన్నో కష్టముల కోర్చి హిందూ దేశమునకు అఫవాళీ వచ్చెను. ఇచ్చట తాను కనులార గాంచిన వింత అను విశేషములను ఆత ఆ డొక గ్రంథముగ వ్రాసెను. ఆతని దినచర్యాత్మక మైన మూడు సముద్రములు దాటి నేను కావించిన యాత్రలు " అనునది. గ్రంథము పేరు $ అఫనాశీ 1469 మొదలు 1472 వరకు హిందూదేశ ములో ఉండెను. ఆనాలు గేండ్లలో ఆతడు తాను గాంచిన విశేషములను వ్రాసియుంచిన దినచర్యగ్రంథము చరిత్ర కారులకు అత్యంతోపయుక్తమైనది. ఆకాలమునాటి ఐరోపీయు లెందరో వ్రాసిన విషయములకంటె అనవాళీ వ్రాసిన యంళము లెంతో సానుభూతిని, సూక్ష్మ గ్రహణ శక్తిని, వివేచనను వ్యక్తీకరించుచున్నవి. రష్యను చారణులు, అనాడు తమ దేశములో వ్యాపారాదులు కావించు విదేశీయులందరి పేర్లు, ఊర్లు, కీర్తి ఉగ్గడించుచు, పాటలు వ్రాసి, గానము చేయుచుండెడి వారు. వాటిలో అనేక హిందూ వర్తకుల పేర్లు కనబడు చున్నవి. వోల్గానదిమీద పడవ ప్రయాణముచేసి, కాస్పియను సముద్రము చేరుకొని, అచ్చటినుండి డెర్మెంట్, బకూ రేవులమీదుగా పర్షియా దేశమునకును, అచ్చటినుండి 28 217 అఫనాశీ నికితిన్ నాలు హిందూదేశమునకును అఫనాశీ ప్రయాణము చేసెను. హిందూ దేశములో దేశములో పర్యటన కావించుచు గేండ్లుండి, తిరుగు ప్రయాణములో క్రిప్టోజోంద్ మీదుగ, నల్ల సముద్ర తీరముననున్న జెనోవా వర్తకస్థావరముల కును, అచ్చటినుండి త్వెర్ నగరమునకును అరడు పో దలచెను. కాని తన జన్మస్థానము చేరకుండగనే, మార్గ మద్యములో అఫనాశీ మృత్యువుపాల బడెను. అఫనా§ పారసీక దేశములో గుఱ్ఱములనుకొని వాటిని హిందూదేశమునకు తీసికొని వచ్చెను. వాటి కిచట మంచి గిరాకీ కలదని యాతడు తెలిసికొనెను. హిందూదేశము నుండి రంగు దినుసులను, సుగంధద్రవ్యములను తీసికొని పోవలెనని ఆతని ఉద్దేశము. కాని స్థలమార్గమున ప్రయా ణముచేసిన యెడల త్రోవపొడుగునను పన్నులు చెల్లింప వలసి వచ్చుననియు, సముద్రమార్గమున పోయిన యెడల పన్నుల బాధ లేకున్నను ఓడదొంగల చేతులలో పడి సర్వనాశనమగుట తప్పదనియుతాను ఆకుల పడియున్నట్లు అఫనాశీ తన దినచర్యాగ్రంథములో వ్రాసికొనెను. తన దీర్ఘమగు యాత్రా సందర్భములో ఆశ్చర్య కరములయిన విషయముల నన్నిటిని అతడు వ్రాసి యుంచెను. హిందూదేశములోని జంతువులు, పడులు, జనులు, దేవాలయములు, రాజభవనములు, ఆచార వ్యవ హారములు, వాతావరణము మున్నగు విషయముల నన్నిటినిగూర్చి అఫనాశీ తన దినచర్యలో వ్రాసియుంచెను. శిలలపై నగిషీ ఉ త్తర హిందూస్థానములోని ఒక స్థానిక ప్రభువును గూర్చి ఆతడిట్లు వ్రాసెను : “ఈ రోజు భవనమున కేడు ద్వారములున్నవి. ఒక్కొక్క ద్వారముకడ నూర్గురు కటులు కావలియుందురు. రాజభవనము అద్భుతముగను, మహావై భవో పేతముగను ఉన్నది. భవనపు లోపలి భాగ మంతయు బంగారునీటి మలామా చేయబడి యున్నది. కుడ్యములనిండ చిత్రములు కలవు. పని కలిగిన బంగారు రేకులు పొదిగి యున్నారు. రాజు లోభికాడు. ఆయన కెందరో భార్యలు కలరు ఆతని సైన్యములో పదివేలమంది ఆశ్వికులు, ఏబది వేల కాల్బలము బంగారు అలంకారములుగల ఇన్నూరు ఏను గులు కలవు. రాజు ఏనుగు పై ఊరేగుచున్నప్పుడు ఆయన ముందు నూర్గురు కాహళముల నూదువారు, రెండు