Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆప్పయదీక్షితులు యందును మిక్కిలి యాదరముకలవాడని తెలియుచున్నది. శబ్దార్థ సంబంధములను వివేచించు వృత్తి వార్తికమును దీక్షితులు రచియించినాడు. భట్టోజీ దీక్షితులు వేదాంత శాస్త్రమును అప్పయ దీక్షితులవద్ద అభ్యసించెను. భట్టోజీ సిద్ధాంత కౌముది మొదలగు వ్యాకరణ గ్రంథములను రచించిన తర్వాత వేదాంతము చదువవలెనని అప్పయ్య దీక్షితుల ఇంటికి చేరినపుడు, ఆతడు తన కౌముదిని శిష్యులకు పాఠము చెప్పుచుండెనట! పాఠమైన తరువాత తన పేరు, వచ్చిన పని, భట్టోజీ విన్నవించుకొనెను, కాని తన పేరు చెప్పక, శిష్యులతోపాటు కౌముదీ పాఠమును వినినందులకు సేతుస్నానము చేసిరానిదే భట్టోజీతో ఇతర విషయము లను ప్రస్తావించ వీలులేదని అప్పయ్యదీక్షితు అన్నారట! యథావిధిగా సేతుస్నానము చేసివచ్చి, భట్టోజీ వేదాంత మును చదువసాగె నట. అప్పయ్య దీక్షితులు ధర్మశాస్త్రములలో ప్రవీణుడు, బాల వితంతువైన తన పుత్రికకు పునర్వివాహము చేయ సంకల్పించియు ఆతడు ధర్మశాస్త్రములకు, సంఘమునకు. ఆచారమునకు వెరచి, ఊరకుండెనని చెప్పుదురు. అప్పయ దీక్షితులు ఖండదేవునిచే మీమాంసక మూర్ధన్యుడని ప్రశంసింపబడినాడు. అతిదేశ లక్షణ పునరాక్షేపము, పూర్వమీమాంసా విషయసంగ్రహదీపిక, ధర్మ మీమాంసా పరిభాష, విధిరసాయనము, ఉపక్రమ పరాక్రమము, నాద నక్షత్రమాల, మయూఖావలి, చిత్ర పటము అను పూర్వ మీమాంసా గ్రంథములు ఇతడు వ్రాసినవి. ఖాట్ట మీమాంసకుడైనను అప్పయ దీక్షితులు ఇచటగూడ క్రొత్త సిద్ధాంతములను తెచ్చెను. ప్రకర ణాంతరము గూడ కర్మభేద ప్రమాణమేయని బ్రహ్మ సూత్ర శాంకరభాష్య వేదాధికరణమున తన పరిమళ వ్యాఖ్యలో నిరూపించినాడు. వాద నక్షత్రమాలలో నవ్యన్యాయభాష గలదు. వాక్యార్థ విచారమైన ఈ గ్రంథమున ముఖ్యమైన పూర్వోత్తర మీమాంసాధి కరణములు వివేచింపబడినవి, శాస్త్రదీపిక పై వ్యాఖ్య మయూఖావళి, శ్లోక వార్షిక దృష్ట్యా లఘువార్తిక మన బడిన చిత్రపటమున పూర్వ మీమాంసా శాస్త్రములోని అధికరణములు సండి ప్తముగా ప్రతిపాదితములు. పూర్వ మీమాంసాశాస్త్ర విషయములను పూర్తిగా వేదాంత గ్రంథములలో గూడ చొప్పించిన అప్పయ దీక్షితులకు స్మార్త వైష్ణవములు రెండును ప్రేమా స్పదములే. అనేక విశిష్టాద్వైత గ్రంథములను వ్యాఖ్యా నించినను, మహేశ్వరే వా జగతా జగతామధీశ్వరే జనార్దనే వా జగదంత రాత్మని నవస్తుభేద ప్రతిపత్తి రస్తుమే తథాపి భక్తి స్తరుణేందు శేఖ రే” అని కాంచీపురములో నొక పండితసభలో అప్పయ్య దీక్షితులు పల్కెనట ! శివునకును, విష్ణువునకును వస్తుభేద ప్రవృత్తి లేకున్నను తనకు శివుని పైననే చిత్తము నిలిచి యున్నదట. శ్రీకంఠుని శైవ వేదాంతమును సుప్రతిష్ఠితము చేయుటకు శ్రీకంఠ భాష్యమునకు శివార్కమణిదీపిక అను వ్యాఖ్యను, శివాద్వైత నిర్ణయము అను గ్రంథమును రచించి ఇతడు శైవ విశిష్టాద్వైతమును ప్రవచించి నాడు. విశిష్టాద్వైత వ్యాప్తికై రామానుజుడువ లె ఈయన శైవ వేదాంత వ్యాప్తికై నిరంతర కృషి సలిపెను. అనేక మీమాంసా న్యాయములకు విశిష్ట తాత్పర్యము ప్రాముఖ్యము ఇతనిచే చూపబడినవి. న్యాయ రక్షామణి, పరిమళ, సిద్ధాంతలేశ సంగ్ర హము అను దీక్షితుల వేదాంత గ్రంథములు అతి ముఖ్య మైనవి. శంకరభాష్య వ్యాఖ్యయగు భామతిపైగల కల్పతరు వ్యాఖ్యకు టీకగా వ్రాయబడిన పరిమళ వ్యాఖ్యలో దీక్షితులు అవచ్ఛేద వాదము, నానాజీవ వాదము, క్రమము క్తి, సర్వముక్తి మొదలగు విశిష్ట సిద్ధాంతములను సోపపత్తికముగా నిరూపించినారు. అద్వైత వేదాంతమున గల భిన్న భిన్న సిద్ధాంతములను సమగ్రముగా నొకచో చేర్పబడిన మహాగ్రంథము సిద్ధాంతలేశ సంగ్రహము. వ్యవహారమున కాట్టమీమాంస కుడు, వేదాంత మార్గమున భామతి ప్రస్థానావలంబి, భ క్తిమార్గమున శివాద్వైతీయు నగు అప్పయ దీక్షితులు సర్వతోముఖ పాండిత్యము, అద్వితీయ ప్రతిభ గల మహా వ్యక్తి. &'. K. 216