Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాంచీపుర మునకుదగ్గర నున్న అడయప్పలం అనుగ్రామ మున ఈయన కన్యామాసమున 4654వ కలివత్స రమున జన్మించెనందురు. అప్పయ దీషి కేంద్ర విజయ ములో దీక్షితులు క్రీ. శ. 1558 లో జులై 15వ తేదీన జన్మించెనని శివానంద యోగీంద్రుడు వ్రాసెను. ఈ రెండు తేదీలకు ఆరేండ్ల వ్యవధి కన్పించుచున్నది. పదునేడవ శతాబ్ది చివరిభాగములో నున్న జగన్నాథ పండితుడు ఇతని సమకాలికుడను కథ లున్నవి. కాని ఠేశ్వరుని ఆలయము అప్పయదీక్షితుల ఆధ్వర్యవమున క్రీ. శ. 1582 లో నిర్మింపబడెనని అడయప్పల పు శాసనములు తెలుపుచున్నవి. క్రీ. శ. 1549, 1566, 1801 లకు చెందిన అడయప్పలపు శాసనములలో అప్పయ దీక్షితుల ప్రసక్తి గలదు. చినబొమ్మ భూపాలుని ఆస్థా నమున వేలూరులో చాల కాల మీతడు వసించెనని, అచట కనకాభి షేకముతో గౌరవింపబడెనని చారిత్ర కాధా రముల వలన తెలియవచ్చుచున్నది. దీక్షితులు యాదవా భ్యుదయ వ్యాఖ్యారంభమున రామరాయ, తిమ్మరాజ చినతిమ్మరాజులను పేర్కొనినాడు. చిన తిమ్మరాజు క్రీ. శ. 1542 నుండి 1550 వరకు సేనాపతిగా నుండెను. ఆతర్వాత అప్పయదీక్షితులను చేరదీసినవాడు వేలూరు వాడగు చినబొమ్మనాయకుడు (1 549 - 1578). మొదటి వేంకటపతి (క్రీ. శ. 1585) కాలమున కువలయానంద విధి రసాయనములు రచింపబడినవి. క్రీ. శ. 1580 నాటికే సేవప్ప శాసనములు ఈతని కీర్తిని కొనియాడ సాగినవి. తంజావూరి నేలిన నరసింహుని ఆస్థానమున గూడ అప్పయదీక్షితులు కొంతకాలము గడపెను. పాండ్యదేశమున వసంతమండపములో ఏక పాదమూ ర్తి ప్రతిష్ఠావిషయమున, శైవులకు, వైష్ణవులకు వివాదములు బయలుదేరగా, తిరుమల నాయకు డీతనిని మ ధు ర కు తీసికొనిపోయెననియు అచట దీ ఉతులమూలమున ఆ ప్రతిష్ఠ నిర్విఘ్నముగా జరిగెననియు తెలియుచున్నది. "చిదంబర మిదం పురం ప్రథితమేవ పుణ్యస్థలం సతాశ్చ విన యోజ్జ్వలాః సుకృతయళ్ళ కాశ్చి కృతాః వయాంసి మమ సప్తతే రుపరినైవ భోగే స్పృహా నకించి దహ మర్థయే శివవదం దిదృశే పరమ్" అను శ్లోకమును దీక్షితులు అంత్య సమయమున చెప్పిరి. 215 అప్పయదీక్షితులు డెబ్బది రెండేండ్లు నిండిన తరువాత చిదంబరమున మరణిం చిరి. దీనిని బట్టి అప్పయదీక్షితులు క్రీ. శ. 1525 ప్రాంత మున జన్మించిరనియు, క్రీ. శ. 1598 ప్రాంతమున మర ణించిరనియు చెప్పవీలగుచున్నది. అప్పయ దీక్షితులు నూటనాలుగు గ్రంథములను రచించెనని నీలకంఠదీక్షితులు శివలీలార్ణవమునచెప్పి నాడు. వీటిలో ఆత్మార్పణ స్తుతి యనబడు శివపంచాశిక, ఆర్యా శతకము, దశకుమార చరిత సంగ్రహము, పంచరత్న స్తవము, శివకర్ణామృతము, వైరాగ్య శతకము, 'ఆనంద లహరి, భక్తామర స్తవము, శాంతి స్తవము, రామాయణ తాత్పర్య నిర్ణయము, రామాయణ తాత్పర్య సంగ్ర హము, రామాయణ సార స్తవము, రామాయణ సొర సంగ్రహము, భారత స్తవము, వరదరాజాష్టకము, ఆదిత్య స్తోత్రరత్నము, శివ కామి స్తవ రత్నము, శివమహిమా కలిక స్తవము అనునవి కావ్యములు. వసుమతీ చిత్రసేన విలాసమను నాటకము కూడ ఒకటి ఇతడు రచించినది కలదు. ఇతడు వేదాంత దేశికుని కావ్యములను, గోవింద దీక్షితుని హరివంశసార చరితను, కృష్ణమిశ్రుని ప్రబోధ చంద్రోదయమును వ్యాఖ్యానించెను. దీక్షితులు వేంకటపతిరాయల అనుజ్ఞ ననుసరించి, కువలయానంద కారికలు అను అలంకార గ్రంథమును రచించితినని చెప్పికొనినాడు. రంగరాజాధ్వరియే ఈయనను వేంకటపతివద్దకు వం వెనని ఆశాధరు డనినాడు, ఈ కారికలను తన చంద్రాలోకము నుండి దొంగిలించినా డని జయదేవు డీతనిని తన ప్రసన్న రాఘవమున ఎత్తి పొడిచినాడు. కాని చంద్రాలోక ములోని అలంకార ప్రక రణమున కీకారిక లు వార్తికములవంటివి. చిత్రమీమాంస యను మరియొక అలంకార శాస్త్ర గ్రంథమును ఇతడు రచియించివాడు. ఈ గ్రంథము అతిశయోక్తి (అలంకా రము) తో ఆగిపోయినది. దీనిని ఖండించుటకు జగన్నాథ వండితుడు చిత్రమీమాంసా ఖండనమును రచించి, అంత టితో నాగకి, తన రసగంగాధరమున మాటిమాటికి దీని తులను ఎ త్తిపొడుపు మాటలతో నిందించుచు విమర్శించి నాడు. కాని అప్పయదీక్షిత రచితమని చెప్పబడు 'ఆంధ్రత్వ మాంధ్ర భాషాచ నాల్పస్య తపసఃఫలమ్ ' అను శ్లోకమును బట్టి దీక్షితులు తెలుగు దేశము నందుము. తెలుగు భాష