Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అప్పయదీక్షితులు పైన ఆనేక వాదోపవాదములు చెలరేగినవి. అయినను కొన్ని ముఖ్యాంశములపై ఏకాభిప్రాయము కలదు. మూల్యము విపణియందలి సరఫరా, అపేక్షల స్థితిగతులను బట్టి నిర్ణయింపబడును. ఇంకను సునిశితముగ పరీక్షించి నచో సరఫరా పక్షమున ఉత్పత్తి వ్యయమును, అపేక్షా పక్షమున ప్రయోజనమును మూల్యమును నిర్ణయించునని తేలుచున్నది. సరఫరా స్థితిగతులను నిర్ణయించునదిగా ఉత్పత్తి,వ్యయము మన దృష్టిలో ముఖ్యాంశమగు చున్నది. ఉత్పత్తివ్యయ మనగా నేమి ? ఒక ఉత్పత్తి దారుడు ఒక వస్తువును ఉత్పత్తిచేయుటకు అవసరమైన ఉత్పత్తి సాధనములను సంతరించుకొనుటకు కొంత ధన రూపమైన వ్యయమగును. దానినే ఉత్పత్తి వ్యయమం దురు. ఇందులో అనేక రకములగు ఖర్చులు చేరును. (అ) ముడిసరకులను కొనుటకుగు వ్యయము (ఆ) కూలి ఖర్చులు, జీతములు. (ఇ) వ్యాపారమం దుంచిన పెట్టు బడిపై వడ్డీ. (ఈ) మరమ్మతు ఖర్చులు (ఉ) నిర్వహణకై సామాన్యముగ ఇవ్వబడు ప్రతిఫలము (ఊ) వ్యాపార ఖర్చులు. ఉదా : ప్రకటన ఖర్చులు, అమ్మకపు ఖర్చులు ఉత్పత్తి వ్యయము - మొదలైన ఖర్చులతో కూడియుం డును. పరోక్షముగ కూడ వ్యాపారమున కొంత వస్తు సముదాయము, కొందరి శ్రమ ఉపయోగింపబడి యుండ వచ్చును. ఉత్పత్తిదారు తానే నిర్వాహకుడు, ఆసామి లేదా సొంతదారుడు అగుచో అతనికి చెందిన యంత్రాగార స్థలముపై అదై, పెట్టుబడిపై వడ్డీ, నిర్వహణము చేసినందు లకు అతనికిచెందు ప్రతిఫలము-వీటిని అతడు ధనరూపమున చెల్లింపకున్నను వాటిని ఉత్పత్తి వ్యయములో యథార్థ వ్యయభాగములు (Real cost) గా పరిగణింపవలెను. వస్తువులు విలువలను గూర్చిన చర్చలలో ఇటీవలి వరకు ఉత్పత్తి వ్యయము ధనరూపమైన వ్యయమని యే భావింపబడుచు వచ్చెను. ఇట్టి భావనపై ఆధారపడి చేయ బడిన వాదనల సారాంశము మూల్యము వల్లనే మూల్యము నిర్ణయమగునని చెప్పుట మాత్రమే. ఎందు వలన అనగా . ధనరూపమైన ఉత్ప త్తివ్యయము కూడా మూల్యమే. ఒక వస్తువు యొక్క మూల్యము ఉత్పత్తి దారునిచేత చెల్లింపబడినపుడు అదియే అతని ఉత్పత్తి వ్యయములో ఒక భాగము అగును. అట్లయిన ఉత్పత్తి . 214 గింపబడు నెడల వినియోగించు వ్యయము యొక యథార్థ స్వరూపమేమి ? ధనరూపమైన ఉత్పత్తి వ్యయములు నిజస్వభావమును కనుగొనుటకు అనేకులు యత్నించిరి, ఉత్పత్తి సాధనములు పరిమిత ములు. ఈ పరిమితమైన ఉత్ప త్తిసాధనము లొక్కొక్కటి కొంత పరిమాణములో ఒక ఉత్పత్తి శాఖలో వినియో మరి యొక ఉత్పత్తిశాఖ వాటిని అవకాశము కోల్పోయిన దన్నమాట. మొదటి ఉత్పత్తి శాఖలోనికి ఆయా ఉత్పత్తి సాధనము లను ఆకర్షించుటకు అధమము అది రెండవ శాఖలో గడింపగలిగినంతటి ప్రతిఫలమైనను ఇవ్వజూపవ లెను. కావున ఒక వస్తువును ఉత్పత్తి చేయుటక గు వ్యయము, అందు ఉప యోగింపబడిన సాధనములతో మరి యొక వస్తువును ఉత్ప త్తిచేసిన దానికుండెడి విలువనుబట్టి నిర్ణయ మగును. తుట్టతుదకు తేలునదేమనగా ఒక వస్తువు యొక్క యథార్థ వ్యయము ఆ వస్తువును ఉత్పత్తి చేయుటకు ఉపయోగింపబడిన మరొక సాధనములు ఉపయోగింపబడనందువలన తా విధముగ చేయబడిన ్యగ ము ప్రయోజనమునకు సమానము. పరిమితమైన సాధనము లతో బహుళములగు వాంఛలను సంతృప్తి పరచుట అసాధ్యముగాన కొన్ని వాంఛలను త్యాగము చేయుట తప్పనిసరియగును. అందువలననే యథార్థ వ్యయము త్యాగము చేయబడిన ప్రయోజన పరిమాణమును తెలియ జేయును. ఈ కె. పు. అప్పయదీక్షితులు :- ఆచార్యదీక్షితు లనబడిన నరసింహ దీక్షితులు విజయనగరాధీశుడగు కృష్ణరాయల (క్రీ. శ. 1509-1580) ఆస్థానకవి. ఈయన మొదటి భార్య స్మార్తకుటుంబమునకు చెందినది. రెండవ భార్య యగు తోటరాంబ శ్రీ వైకుంఠాచార్య వంళజ. ఈ మెకు జన్మించిన నలుగురు కుమారులలో పెద్దవాడు రంగ రాజాధ్వరి. ఈయన 'అద్వైతముకురము', 'వివరణ దర్పణము' అను గ్రంథములను రచించెను. ఈయనబొమ్మ మహీపాలుని (క్రీ. శ. 1528) ఆస్థానకవిగా నుండెను. అద్వైతము, విశిష్టాద్వైతము, పూర్వమీమాంస ఈ వంశములో పూర్తిగా ప్రవేశించినవి. ఈ రంగరాజా ధ్వరి కుమారుడే అప్పయదీక్షితులు. భారద్వాజసగోత్రుడు.