Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యొక్క బలమును నిర్ణయించును. ఏదైనను ఒక వస్తువు నకై ఒక వ్యక్తికిగల అపేక్ష వేర్వేరు మూల్యములున్నపు డెట్లు మారునో తెలిపెడు దానిని 'అపేక్ష పట్టీ' అందురు. ఒకడు అరటిపండ్లు ఒక్కొక్కపండు ఒక పైసయగుచో ఒక డజను పండ్లను కొనును, కాని పండు రెండుపైన లగుచో అరడజను మాత్రమే కొనును. మూడు పైస లగునచో నాలుగింటిని మాత్రమే కొనును, దీనికి కారణ మేమన అతని పరిమిత ఆదాయములో అరటిపండ్లు అతని కొసగు ప్రయోజనమునుబట్టి కేటాయింపబడిన వాటా 12 పైసలు మాత్రమే. అంతకుమించి అరటిపండ్ల కొరకు అతడు ఖర్చు పెట్టినచో తదితరములగు వస్తువులలో ఎంతో కొంత భాగము త్యాగము చేయవలసి యుండును. ఈ 12 పైసలలో మూల్యము హెచ్చుగనున్న తక్కువ పండ్లను, తక్కువగనున్న ఎక్కువ వండ్లను కొనగల్గును. ఇంతియేగాక ఇతర వాంఛలను తీర్చుకొను అవసరము ఎక్కువగ నున్నచో అసలు అరటిపండ్లను కొనుటయే మానివేయవచ్చును. వేర్వేరు వాంఛలు తమతమ ప్రాబల్యమునుబట్టి అతని ఎన్నికలో ప్రాముఖ్యమును పొందును. ఆ ప్రాబల్యమే అత డేయే వస్తువులను యెంతెంత కొనవలయునో నిర్ణయించును. ప్రతివ్యక్తి ఇట్లు వివిధ వాంఛల సంతృప్తివల్ల కలిగెడు ప్రయోజన మును తూచితూచి తన ఆదాయమునుండి సాధ్యమైనంత ప్రయోజనము లభించు విధముగ తన వాంఛలను సంతృప్తి పరచుకొనుచుండును. ఒక వ్యక్తి యొక్క ఈ ప్రవర్తన మానవ సమాజములందు కొనువారందరికి వర్తించును. ఈ ప్రవర్తనము ననుసరించియే 'అవే సిద్ధాంతము' ప్రవచింపబడినది, ఇదియే మన "మూల్యము హెచ్చిన అనేక తగ్గును. మూల్యము తగ్గిన అపేక హెచ్చును." అనెడి సూత్రము. సరఫరా (Supplies) :- ఒక వస్తువు యొక్క నిల్వల నుండి వేరువేరు మూల్యములకు వర్తకులు అమ్మజూవు వస్తు పరిమాణమును 'సరఫరా' అందురు. ఒక వస్తువునకు కొనువారు ఇచ్చుమూల్యమునుబట్టి వివణియందు సరఫరా మారుచుండును. విషణి యందు మూల్యము హెచ్చినచో వర్తకులు అధికలాభములు పొందుటకై ఎక్కువ సరకును అమ్మజూపుదురు. మూల్యము తగ్గినచో తక్కువ సరకును 213 ఆపేక్ష సరఫరా - అమ్మజూపుదురు, దీని నే 'సరఫరా' సిద్ధాంతమందురు. ఇది అపేక్షా సిద్ధాంతమునకు వ్యతిరేకముగ నడచు మండును. ఏలయనగా కొనువారు సాధ్యమైనంత చవుకగ కొనుటకు ప్రయత్నింతురు. వర్తకులు సాధ్యమైనంత ప్రియమగు మూల్యమునకు అమ్మజూతురు. వర్తకులు వేర్వేరు మూల్యములకు ఎంతెంత పరిమాణముగల సరకును సరఫరా చేయుదురో తెలియజేయునది 'సరఫరా పట్టీ' అనబడును. మూల్యము (Price) :- విపణియందు ఏ వస్తువు యొక్క మూల్యమైనను ఆ వస్తువు యొక్క అపేక్ష, సరఫరాలపై ఆధారపడియుండును. ఒక విపణి యందలి ఆ పేక పట్టీని సరఫరాపట్టీతో పోల్చిచూచిన యెడల ఏదోఒక మూల్యము వద్ద విపణియం దా వస్తువునకు గల అపేక్ష, సరఫరాలు సరిసమానముగ నుండును. ఇట్లు సరఫరా, అ పేడలను సరిసమానము చేయగల మూల్యమే ఆ విపణియం దా వస్తువు యొక్క 'నిశ్చలమూల్యము' (Equilibrium Price) తరచు విపణి యందలి అపేక్ష యొక్కము, సరఫరా యొక్కయు పరిస్థితులనుబట్టి మారుచుండు మూల్యమును 'విపణి మూల్యము' (Market value) అందురు. గడియా రములోని లోలకము ఏవిధముగ ఒక మధ్య బిందువును ఆధారముగ జేసికొని అటునిటు ఊగునో అట్లే 'విపణి మూల్యము' నిశ్చల మూల్యము నాధారముగ చేసికొని హెచ్చుచు, తగ్గుచు ఉండును. తాత్కాలిక ముగ విపణి మూల్యము హెచ్చినను, తగ్గినను తుదకు నిశ్చల మూల్య ముతో సమానమగును. నిశ్చల మూల్యముకంటే విపణి మూల్యము హెచ్చుగా నున్నచో వర్తకులు ఎక్కువ నరకును సరఫరా చేయుదురు. 'అపేక్ష' తక్కువగా నుండును. కావున విపణిమూల్యము నిశ్చలమూల్యముతో సమానమగును. నిశ్చలమూల్యముకంటె విపణిమూల్యము తక్కు వగానున్నచో అపేత హెచ్చును. సరఫరా తక్కువగా నుండును. అప్పుడును విపణిమూల్యము నిశ్చల మూల్య ముతో సమానము కాక తప్పదు. ఉత్పత్తి వ్యయము (cost of production);- ఆర్థిక శాస్త్ర వేత్తలు వివణియందు ఒక వస్తువు యొక్క మూల్యము ఎట్లు నిర్ణయింపబడునను ప్రధాన సమస్యను ప్రథమమునుండియు చర్చించుచునేయున్నారు. ఈసమస్య