Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అపభ్రంశము లందును నటి 'మొదలైన పాత్రలు గానావసరములందు ప్రాకృతమును వాడుచుండుట మన మెరిగిన దే. కువలయ మాలా కారుడు అపభ్రంశము “సంస్కృత ప్రాకృత - ఉభయ శుద్ధాశుద్ధపదసమతరంగ రంగదవల్గు” వన్నాడు. ఆ భాష "నవప్రావృడ్జలద ప్రవాహ పరిప్లవిత గిరి నదీసదృశముగ” సమవిషమమైనదట. "ప్రణయ కుపిత ప్రియ ప్రణయినీ సముల్లాప సదృశ "మట! "కాని, పైశాచి సదృశమట అంతకంటెను మధురమైనదని అతని యూహ. 'ఛవిసృతకహొ' అనునది అపూర్వమైన కావ్యము. దీనిని “జకోబీ” మహాశయుడు క్రీ. శ. 1918 లో తొట్ట తొలుత ప్రకటించెను. ఇది సాహిత్యమున కాతడు చేసిన గొప్ప పుష్పదంతుడు అపభ్రంశ కవులలో రత్నమువంటి వాడు. అతని పేరెంత సుందరమో పలుకు కూడ నంత సుందర మే. 'మహా పురాణము' 'ణాయకుమార చరివు' 'జసహర చరివు' అనునవి ఈతడు రచించిన గ్రంథములు. ఈ మూటి యందును బోధింపబడినది జైనధర్మమే. కాని ఆ ధర్మమును బోధించుటకు అత డెన్నుకొన్న పద్ధతి చాల మనోహరమైనది. ఆయన వాడిన వృత్తములు ప్రజా జీవితముల నుండి ఏరికొన్నవి. ఆ ఛందస్సునకు పేరులు కూడ మన మీనా డెరుగము. పుష్పదంతుని కావ్యములు చదువునప్పుడు పచ్చని చేలనడుమ, సువాసితములై నతోటల నడుమ నడచిపోయినట్లుండును. ఆ కవులకు ప్రజాజీవిత మే జీవగఱ్ఱ, వా రెంత యుత్ప్రేక్షించినను ఆ యలంకారములు సామాన్య ప్రజల హృదయములలో తోచు నుత్ప్రేక్షలే. నేలవిడిచిన సాము వారెన్నడును చేయరు. క్లిష్టములైన విపరీత కల్పనలు, స్వభావముతో సంబంధములేని ఊహలు సంస్కృత కవుల కే చెల్లినవి. పుష్పదంతుడు చెప్పిన మారి దేవళము, పోతులరాజు, బలులొసగుట- ఇట్టి దృశ్యము లను నేటికిని మనము పల్లెలలో చూడవచ్చును. ప్రాకృత కావ్యము వ్రాయగలవానికిని, దానిని చదువగలవానికిని కూడ ఆకవులు నమస్కారము పెట్టినారు. ఈ ఇరువురి అదృష్ట మంత గొప్పదట! కుంద ప్రసూనములను మాలగా గ్రుచ్చుటకును, కుపితయైన ప్రియురాలి నోచార్చుటకును, ప్రాకృత కావ్యమును చదువుటకును తెలిసిన అదృష్టవం తులు కొంద రే అని 'వజ్ఞలగ్గ' కారుని సవాలు. 212 రాగ రాగ ప్రాకృతములను జక్కగా చదువు సంప్ర దాయమే పోయినది. సంస్కృత నాటక కారులు శాస్త్రము కొరకై ప్రాకృతములను వ్రాసిరే కాని వాటిపై సాను భూతి సామర్థ్యములు కలిగి కాదు. అందునను వారు వాడుకొన్నవి మహారాష్ట్రి, మాగధి వంటివే. నీచపాత్ర ములు అరుదుగ పైశాచివంటి భాషలను అక్కడక్కడ వాడును. ఒకరీతిగ వీరందరిలో మృచ్ఛకటికాకారుడు మిగుల సాహసి. ఈనాడు ఈ భాషలలో కృషి యొనర్ప వలసిన భారము పరిశోధకులు, పండితులు, రసజ్ఞులు మున్నగువారిపై నున్నది. పు. నా. అపేక్ష - సరఫరా :- ఈ ప్రపంచమున ఎల్లెడలను ప్రజలు ఏదో సమయమందు ఏదోకొంత శ్రమపడు చుందురు. రిక్షావాడు ఉదయమునుండి సాయంత్రము వరకు ఎండలో వానలో రిక్షా లాగుచుండును. కూలి వాడు సామానులు మోయుచునో, పొలములో నాట్లు వేయుచునో ఉండును. పదిగంటలగుసరికి పట్టణములలో కందిరీగల పుట్టరీతిగా కారులమీద, సైకిళ్ళమీద, కాలి నడకను పిన్నలు పెద్దలు మహాప్రవాహముగ కార్యా లయములకు పోవుచుందురు. ప్రపంచమున ప్రతి మాన వుడు ఏదో ఒక పనిలో నిమగ్నుడై ధనార్జనకై కష్టించు చున్నాడు గదా! ఎందులకు మానవుడింత కష్టించును ? ఈ ఆర్థిక వ్యాపారము వలన మానవునకు కలుగునదేమి? అనంత మైన ఈ ఆర్థిక వ్యాపారమునకు మూల కారణము మానవుని వాంఛలు. ఈ వాంఛలను సంతృప్తి పరచుటకై వస్తువులను ఉత్పత్తి చేయవలెను. వస్తూత్పత్తి సాధనములు పరిమితములు. పరిమితములైన వస్తూత్పత్తి సాధనములతో బహుళమగు మానవ వాంఛలను సంతృప్తి పరచు సమస్యయే ఆర్ధిక శాస్త్రమందలి ముఖ్య వస్తువు. ఆ పేక్ష (Demand) :- అ పేద అనగా ఒకనికి ఒక వస్తువును కొనుటయందు గల వాంఛ. ఒక్క వాంఛ మాత్రమేగాక దానితోపాటు కొనుగోలుశక్తి యుండి ననే అది 'ఆపేక్ష' అనబడును. ఒక వస్తువునుండి తాను పొందు ప్రయోజనము (Utility) ను బట్టి అతడు ఎక్కువ గాని, తక్కువగాని మూల్యము (Price) ను ఇచ్చుటకు ఇష్టపడును. ఇది ఆ వస్తువునకై అతనియందుగల 'అ పేడ '