Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బెట్టినను, ఆ భాషలు ముగిసినవికావు. అందుకే ఆతడు 'పారిస బర్బరాదులు' అని ఆది శబ్దము యొక్క మరుగు జొచ్చెను. మృచ్ఛకటిక ముద్రారాక్షసకారులు కూడ ఉద్యోతనుని అభిప్రాయమునే అంగీకరించినట్లున్నది. (బహువిధ దేశ వేష భాషాచార సంచారవేదినో, నానా వ్యంజనాః ప్రణీధయః. ముద్రారాక్ష భరతుడు అపభ్రంశమునకు కొన్ని ఉదాహరణము లిచ్చెను. వీటికి పోలికలు అపభ్రంశ వ్యాకరణములలో నున్నవి. ఈ భాష యొక్క ప్రకృతి ప్రత్యయ విభాగ నియమములు కొన్ని శాసన కాలికములైన బౌద్ధ ప్రాకృతములలో కలవు. కొన్ని అపభ్రంశ రూపములు ప్రాచీనులైన 'విమలసూరి' 'సౌమ చరియ' (క్రీ. శ. 1800) లో కనపడును. అవి పాలిభాషలో గూడ నున్నవి. అనగా క్రీ. శ. 800 నాటికే అపభ్రంశము వాడుక భాషగా నుండియుండును. భరతుడు దీనిని అనాగరక భాషయనియు, గొల్లల పలుకుబడి అనియు అవహేళన జేసెను. ఆయన శాబరికిని, అపభ్రంశమునకును, భేద మంతగా గమనించి నట్లు లేదు. కాని, ద్రావిడికన్న ఇది భిన్నమనెను. తరువాత మూడు శతాబ్దులకు అనగా భామహుని నాటి కిది కావ్యభాష అయ్యెనని ఊహింప వచ్చును. వలభిరాజగు ధారాసేనుడు మహా ప్రసిద్ధుడు. (* సంస్కృత ప్రాకృతాపభ్రంశ భాషాత్రయ ప్రతిబద్ధ ప్రబంధ రచనా నిపుణ తరాంతః కరణః') అతడొక వైయాకరణుడు (క్రీ. శ. 600). చండుడు గూడ వ్యాకరణ కర్తయే. వీరుఇరువురును అపభ్రంశమును ఒక భిన్న భాషగా గమనించిరి. ఈగమనింపుగూడ భామహుని నాటికి ఇది కావ్యభాషయను నిర్ణయమునే బలపరచును. మరి రెండు శతాబ్దములకు ఉద్యోతనుడు తన "కువలయ మాల" యందు అపభ్రంశ భాగములు కొన్ని వ్రానెను. అనగా అప్పటికి అపభ్రంశములో సం్కృత సం్కృత ప్రాకృత ములు చేరి —— ఆ భాషకు కావ్యత్వమును కల్పించిన వన్నమాట. అపభ్రంశము మనో హరమని ఉద్యోతనుని అభిప్రాయము. కొందరు ప్రాకృత వైయాకరణులు సంస్కృతము దేవభాష అనెడు వాదముపై దండెత్తిరి. శ్వేతాంబరులు అర్ధమాగధీ దేవభాష యనిరి. అర్ధమాగధి రానివాడు ఆర్యుడేకాడట! కొందరు మాగధీ భాషయే, 27 - - 209 అపభ్రంశము నికరముగ, దేవతలు భాషించున దని చెప్పిరి. పార్టీ దేవ భాషయన్న లేకపోలేదు. శివానుచరులు పైశాచిని భాషింతురని యొక వాదము. వీరి గడబిడలో అపభ్రంశముగూడ దేవభాషయై కూర్చున్నది. పైవారంద రును సంస్కృతమును ద్వేషించినవారే. కువలయమాలా కథాకారుడు, సంస్కృతము “దుర్జన హృదయము వంటిది" అని (దుర్జన హృదయ మివ విషమం) నిస్సంకో చముగ వచించెను. తొమ్మిదవశతాబ్దిలో రుద్రటుడు అపభ్రంశమనుట- కొన్ని భాషలకు సామూహిక మైన పేరు 'షØఒత్ర భూరి భేదో భూరివి శేషాదపభ్రంశ ' (2-12) అనెను. రాజ శేఖర మహాకవి పదవశతాబ్దివాడు. ఆయన దానికి సంస్కృత ప్రాకృతములతో సమానమైన గౌరవ మొ న గెను. (శ్లో. గిరశ వ్యాది వ్యాః ప్రకృతి మధురాః ప్రాకృత ధురః | సుభవ్యో౬ పభ్రంశస్సరస రచనం భూతవచనం- రాజ శేఖరుని బాలరామాయణము). 'సరస్వతీ కంఠా భరణ ' కర్తయగు భోజుడును, దశరూపక కర్తయగు ధనంజయుడును ఇచ్చిన ఉదాహరణములను జూచినప్పుడు అపభ్రంశమందు అప్పటికే పెద్ద సాహితి యున్నట్లు తోచును. అందుచే రాజ శేఖరుడు న్యాయమే చేసినాడని పించును. పురుషో త్తము డొక బౌద్ధప్రాకృతమైయాకరణుడు. అతడు తూర్పుదేశపు వాడు. ఆతని నాటికే అపభ్రంశము శిష్టభాష. అత డా భాషకు కొన్ని లక్షణములను వచిం చెను. తాను చెప్పక పదలినవి శిష్ట ప్రయోగముతో ఊహించికొనవలేన నెను. (శేషం శిష్ట ప్రయోగాత్). నిమి సాధువు రుద్రటుని కావ్యాలం కారము పై వ్యాఖ్యానిం చుచు, కొన్ని సూత్రములను ఒకానొక ప్రాకృత వ్యాకర ణము నుండి ఉదాహరించెను. ఆ వ్యాకరణము వేరేమో ఆ నిమిసాధువు చెప్ప లేదు. కాని ఆ ఉదాహరణములను చూచినపుడు అపభ్రంశములో చాలమట్టుకు తూర్పునాట వ్యవహారములో నున్న మహారాష్ట్ర చేరియుండును అనిపించును. నిమిసాధు వొసగిన వ్యాకరణమునే హేమ చంద్రుడు విపులీకరించి ద్రా "నె నేమో ! నిమిసాధువు "అపభ్రంశమందు ' చాలమట్టుకు కౌర సేని మాగధి అను రెండు భాషలలక్షణములు చేరియుండును" అనెను. ఆనాడు