Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అపభ్రంశము 1 “శౌర సేని” “మాగధి” లేక “మహారాష్ట్రి” అను నీరెంటి కలయికతో అపభ్రంశము రూపొందుచుండెనేమో! లేక, ఆ భాషలకు పరస్పర వినిమయమైన నుండియుండును. నిమిసాధువు ఈ భాషల కన్నిటికిని ప్రాకృతము అనునది సామాన్య నామ మనెను. ( పాణిన్యాది వ్యాకరణోదిత శబ్ద లక్షణేన సంస్కరణా సంస్కృత ముచ్యతే | తథా ప్రాకృత భాషైన కించిద్విశేష లక్షణాత్ మాగధికా భణ్యతే | తథా ప్రాకృత మేవ కించి ద్వి శేషాలై ఎశాచికం | శౌర సేన్యపి ప్రాకృత భాషైన, తథా ప్రాకృతమేవా౭ పభ్రంశః-నిమిసాధు కృత కావ్యాలంకార టిప్పణి). అవ భ్రంశమునకు ఒక ప్రత్యేకత నంగీకరించినట్టి ఉదారులలో దండిగూడ నొక్కడు. (శబ్దార్థసహితం కావ్యం గద్యం పద్యం చ తద్ద్విధా | సంస్కృతం ప్రాకృతం చాన్య దవ భ్రంశ ఇతి త్రిధా - కావ్యాదర్శము). . మమ్మటుడు, వాగ్భటుడు, రామచంద్రుడు, గుణ చంద్రుడు, కావ్యకల్ప లతావృత్తికారుడు, అమర చంద్రుడు మొదలగు వైయాకరణులందరు అధునాతనులు, ఈ వైయాకరణులు అపభ్రంశము అన్ని ప్రాంతము అందును సమానమైన గౌరవముగల భాష అనిరి. ఈ వైయాకరణులందరును అపభ్రంశ శబ్దమునకు “అన్ని దేశములందున్న వ్యావహారికము" అని అర్ధము చేసు కొన్నట్లున్నది. ఈ అభిప్రాయమునే వాగ్భటుడు "అప భ్రంశస్తు యచ్ఛుద్ధం తత్తద్దే శేషు భాషితం.” (2-8) అని స్పష్టముగ అనెను. ఇట్లే విష్ణుధర్మోత్తర కారుడు కూడ అది అనంతమనెను. (అపభ్రంశం తృతీయంచ తద సంతం నరాధిప ! దేశ భాషా విశేషేణ తస్యాంతో నేహ విద్యతే). హేమచంద్రుని నాటికి అది సంస్కృత ప్రాకృత ములవలె సాహిత్య భాషగా పరిణమించెను. అందుచేత దానినాతడు వ్యావహారికము కంటె వేరు అనెను. హేమచంద్రుని తరువాతి వైయాకరణులు. ఆభాషా స్వరూప నిరూపణములో చాల తారుమారు పడిరి. అట్లే ఈ భాష ప్రచారముననున్న ప్రాంతమును గురించియు, వారికొక నిలుకడయైన నిర్ణయములేదు. దాక్షిణాత్య దేశములందు కొన్ని భాగములలో ప్రచారమున నున్న భాష ‘అపభ్రంశ” మని వారియూహ. ఇక త్రివిక్రముడు సింహరాజు, రామచంద్రుడు మొదలైనవారికి కేవల సాహిత్యదృష్టి. అందుచే వారి అభిప్రాయములు ఈ విషయమున అంతగా ప్రమాణము లనుటకు వీలులేదు. పాణిని సాధించిన రూపములకంటే భిన్నము లై న వన్నియు అపభ్రంశములుగా వారు వ్యవహరించిరి. “సకల జగజ్జంతూనాం వ్యాకరణాదిభి రనాహత సంస్థా రస్సహజో వచన వ్యాపారః ప్రకృతిః, తత్ప్రభవం, సైవవా ప్రాకృతం" (నిమిసాధు) — మూడవ శతాబ్దినాటికి అపభ్రంశము విభ్రష్టభాష. ఆరవ శతాబ్దినాటి కది ఆభీరభాష. అప్పటికి దానికి 'అవహంస-అవహట్ట' అను పదములు పర్యాయములుగ నుండెడివి. ఆ నాటి కే- దానిని కొందరు సాహితీ భాషగా నంగీకరించిరి. ఇది యొక్క "ప్రాంతీయభాష”' అని వారి అభిప్రాయము. ఈ వాదమునకు నాంది యొనర్చినది 'చండు' డను వైయాకరణుడు. వలభిరాజగు ధారా నేనుని తామ్రశాసనము ఈ భాషలో మొదటిది. క్రీ. శ. 1100 వరకు అది శిష్టభాషగా నుండెను. పండ్రెండవ శతాబ్దియందు-గ్రామ్య భాషకంటే ఇది భిన్న మై-సాహితీ భాషగా పరిణమించెను. ఈ కాలము "అపభ్రంశ” భాషకు 210 వసంతము. అ అ తొమ్మిదవ శతాబ్దినుండి అపభ్రంశ శబ్దమును ప్రాంతీయ భాషలకు వాడుచు వచ్చిరిగదా ! “దేశి”, “దేశ్య”, “దేశిమత" "దేశీ ప్రసిద్ధ" ఇత్యాది శబ్దములను కూడ వ్యావహారికముల నుద్దేశించియే వాడిరి. మరి "అపభ్రంశము” వీటికన్న భిన్నమా? లేక - వాటిలో చేరినదేనా ? భరతాచార్యుడు దేశ భాషా శబ్ద మును- “అపభ్రంశ”మును కొంచెము తక్కువగ జూచి నను దానిని ప్రాకృతములకు అన్నిటికిని సామాన్య నామముగ వాడెను. ఆయన దేశిమతశబ్దములకు ఉదా హరణము లేవియు నియ్యలేదు. తరువాత పాదలి ప్తుడు.

  • దేశివయన' శబ్దముతో అపభ్రంశమునుగాక మహారాష్ట్రిని

నిర్దేశించెను. చండుడు దేశీప్రసిద్ధ శబ్దమును-సంస్కృత ప్రాకృతభిన్నముల నన్నిటిని తెలుపుటకై ఉపయోగించెను. అంతేకాని ఒక నిర్దిష్టమైన వ్యావహారిక భాషను సూచిం చుటకు కాదు. అపభ్రంశ కవులు మాత్రము తొమ్మిదవ శతాబ్దినుండి “దేశి” పదమును తమ గ్రంథములలో నుపయోగించిరి. కామశాస్త్ర కర్తయైన వాత్స్యా