Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అపభ్రంశము స్వరూపమును కల్పించి, తరువాతి పధక ర్తలకు అన్న మయ్య ఒక చక్కని పథమును తీర్చి దిద్దినాడు. రాయలసీమలో వ్యవహారముననున్న ఎన్నో రుచిగల పలుకుబళ్ళు అన్నమయ్య పదములలోనికి ఎక్కినవి. అతని పదముల మండి ఆ పలుకుబళ్ళు రాయలనాటి కవీశ్వరుల రచనములలోనికిని ఎక్కినవి. వ్యావహారిక భాషను విశృంఖలముగా వాడి అన్నమయ్య తనకుగల స్వాతంత్ర్య రసికతను వెల్లడించినాడు. ఆపదముల ప్రయోగముతో రచనము సహజముగా, సజీవముగా నుండి భావతీవ్రతను చక్కగా వ్యక్తము చేయజాలినది. ఆధి భౌతి కానుభవములలో అన్నమాచార్యులు ఎక్కు వగా భావించినది శృంగారము. ఆ శృంగారమును గూడ ఆధ్యాత్మికపు మట్టమునకు ఎక్కించిన మహా పురుషు డాయన. ఆ పదములను వాడుకొని ఆనందింప గలవారు అదృష్టవంతులు. అట్లు పాడలేనివారును పద్యములుగా చదువుకొని ఆనందింప గలిగినంత స్వతంత్ర మయిన అర్ధభావ రచనల యందచందములతో నిండిన నిధు లాయన పదములు. సంగీత సాహిత్యనిధియగు అన్నమయ్యలోని సాహిత్యాంశము క్షేత్రయ్యగాను, సంగీతాంశము త్యాగయ్యగాను అవతరించెనని శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారి అభిప్రాయము. వారి అభిప్రాయ ములో అతిశయోక్తి ఆవంతయు లేదు. తి. కో. రా. అపభ్రంశము :- మనకు తెలిసినంత వరకు అవ' భ్రంశ శబ్దమును ప్రయోగించిన ప్రాచీనుడు భగవంతు డైన పతంజలియే (భూయాంసో2 పశబ్దాః అల్పియాంస శ్శబ్దాః, ఏకైకస్యహి శబ్దస్య బహవో ఒపభ్రంశాః. కద్యథా- గౌరిత్య స్య శబ్దన్య గావీ గోణి గోశా గో పోతలికా 'ఇత్యేవ మాదయో అపభ్రంశాః' - మహా భాష్యము), ఆ సందర్భముననే 'అపశబ్ద'మనెడు మాటయు నాతడు వాడినాడు. అనగా, అతని దృష్టిలో ఈ రెండును పర్యాయపదము అన్నమాట. మహాభాష్య కాలము నాటికి “అపభ్రంశము" ఒక భాషగా తయారైనదని చెప్ప వీలులేదు. సంస్కృత భిన్నములైన పదముల నన్నిటిని అపభ్రంశములని భాష్యకారులు తలచినట్లు మన మూహింపవచ్చును. కనుకనే సంస్కృత భిన్నములన్నియు 208 అపశబ్దములే అని దండి అనెను. (శాస్త్రేతు సంస్కృ దన్య దపభ్రంశతయోదితం కావ్యాదర్శము) పతంజలి 'గో' శబ్దమున కొసగిన రూపాంతరములు ప్రాకృత భాషలలో-ముఖ్యముగ 'మహారాష్ట్రి'లో కనబడుచున్నవి. శ్వేతాంబరులు భాషయైన యర్ధమాగధిలో గూడ ఈ ప్రయోగములున్నవి. సంస్కృతేతరముల నన్నిటిని కలిపి అపభ్రంశములనుటలో నే.ఆ నాటివారికి- సంస్కృతము పై నున్న అభిమానమును ఇతరములపై నున్న అసమ్మతియు స్పష్టమగును. ప్రాకృతములు అనుమాటతో ప్రాచీనులు వేటిని వేరు పరచిరో చెప్పుట చాల కష్టము, అట్లే, అపభ్రంశ శబ్దమున కును వాగొసగిన వ్యాఖ్యలు ఒక తీరుగలేవు. (ప్రాకృత మేవాఒపభ్రంశః అని రుద్రటుడు అనెను.) నాట్య శాస్త్ర కారుడు సప్తభాషలను విభాగించెను. (మాగధ్య వంతి జా ప్రాచ్యా కూర సేవ్యర్ధ మాగధీ, వాహ్లి కాదాక్షి ణా త్యాశ్చ సప్తభాషా ః ప్రకీర్తితాః - నాట్యశాస్త్రే) వాటిలో ఆయన అపభ్రంశమును జేర్చియుండలేదు. కాని అర్ధ మాగధిని మాత్రము చేర్చియున్నాడు. (చేటీనాం రాజు పుత్రాణాం శ్రేష్ఠీనాం చార్ధ మాగధీ) భరతుని నాట్య శాస్త్రమందు అపభ్రంశ శబ్దప్రయోగమున్నది. ఆతడు దీనిని 'విభ్రష్ట' మనెను. 'ఆభీర భాష' యని పల్కెను. దండియు భరతుని మతమునే అనుసరించి, కావ్యము నందలి అభీరాది భాషలు అపభ్రంశములని పలికెను. (ఆఖిరాదిగిరః కావ్యే స్వపభ్రంశ ఇతీరిశాః - కావ్యా దర్శము) ఈ అభిరాది భాషలేవో ? 'ప్రాకృత లక్షణము, నందు భాషలు ఆరనిచెప్పబడినది. (సంస్కృతం ప్రాకృతం చై వాఒపభ్రంశః పిశాచిని, మాగధీ శారసైనీచ షడ్భా షాళ్ళ ప్రకీ ర్తితాః - ప్రాకృత లక్షణే వాటిలో అవ భ్రంశమునకును స్థానమబ్బెను. కాని అర్ధమాగధి, చూళిక మొదలైనవాటిని అత డెగురగొట్టెను. భరతుని లక్షణ ములో చోటు దొరకిన అర్ధమాగధికి, ఇందులో పుర స్కృతి కలుగలేదు. కొందరు ప్రాకృతములు పదు నెనిమిది అనిరి. కువలయమాలా కథాకారుడైన ఉద్యో తనుడు పదునెనిమిది ప్రాకృతములను చూచాయగా చూపుటకు ప్రయత్నించెను. నాటి ఆంధ్ర దేశమునందును గర్ణాటకము నందును దేశ భేదము లుండెనట. ఇంత లెక్క