Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అన్నమాచార్యులు - తాళ్లపాక పేరు. చార్యుని కాలమున రాగి రేకులపై చెక్కింపబడి, ఆపియెల్ల తిరుమల పై శ్రీ స్వామి వారి సన్నిధిలో శ్రీ భాష్య కారుల సన్నిధిని ప్రక్కగా నొక అరలో భద్రపరచబడినవి. దానికి ఆఅర కిరుప్రక్కలను 'తాళ్ళపాక' అనయని అన్నమా చార్యులయు, తిరుమలాచార్యులయు విగ్రహ ములు శిలలపై చెక్కింపబడి యున్నవి. తెలుగు కవులు భౌతిక స్వరూపములను తెలుపు నిట్టి శిల్పములలో ఇవియే మొట్టమొదటివి. తరువాత రాగిరేకులపై చెక్కిన అట్టి విగ్రహములే అరలోపలను కానవచ్చినవి, వీటిని పట్టి వీటినిపట్టి అన్నమాచార్యులయు, పెదతిరుమలాచార్యులయు భౌతిక స్వరూపములు తెలియ వీలగుచున్నది. అన్నమయ్య తన ఇష్టదైవమగు శ్రీ వేంక టేశ్వర స్వామిపై ఇట్లు శృంగారాధ్యాత్మ సంకీర్తనము లను రచించుటమాత్ర మేకాక, సంస్కృతమునను, తెనుగునను ఇంకను అనేక రచనలు చేసినట్లు తెలియుచున్నది. సంస్కృతములో అతడు వేంకటాచలమాహాత్మ్యము, సంకీర్తనలక్షణము అను రెండు గ్రంథములను రచించినట్లు ఊహింపబడుచున్నది. చిన్నన్న రచించిన అన్నమాచార్య చరిత్రములో ఆతడు సంస్కృతభాషయందు వేంకటాచల మాహాత్మ్యమును రచించినట్లు చెప్పబడినది. వరాహపురా ణాదులలోనిదిగా సంఘటితమయి నేడు నాగరాంధ్రా క్షరములతో ముద్రితమై వ్యాప్తిగాంచియున్న వేంకటాచల మాహాత్మ్యము తాళ్ళపాక అన్నమయ్య రచించినదే అని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రులవారు అభిప్రాయపడుచున్నారు. అంతకుపూర్వమే ఆ "స్థల మాహాత్మ్య" మొకటి కలదని నిరూపింపబడునంత దాక అది యన్నమాచార్య రచితమనియే తలంచుట అసంగ తము కాజాలదు. అతడు సంస్కృతములో రచించిన మరొక గ్రంథము 'సంకీ ర్తన లక్షణము'. అన్నమాచార్యుని మనుమడగు చిన తిరుమలయ్య తన 'సంకీర్తన లక్షణము' అను గ్రంథము (తెలుగు) న, అన్నమాచార్యుడు సంస్కృతమున, సంకీర్తన లక్షణమను ఒక గ్రంథమును రచించెననియు, తన తండ్రియగు పెద తిరుమలాచార్యుడు వ్యాఖ్యానించెననియు, ఆ రెండు గ్రంథములను అనుస రించి తాను తెలుగున 'సంకీర్తన లక్షణము'ను వెలయింతు 206 ననియు చెప్పియున్నాడు. దానిని బట్టి అన్నమాచార్యుడు సంస్కృతమున 'సంకీర్తన లక్షణము'ను రచించినట్లు తెలియుచున్నది. కాని ఆ గ్రంథ మిప్పుడు లభించుట లేదు. అన్నమయ్య రచించిన తెలుగు గ్రంథములలో ఆతని ద్విపద రామాయణము తొలుత పేర్కొనదగియున్నది. అతని జీవిత చరిత్రములో ఆతడు, వాల్మీకి రామాయణ మును సంకీర్తనాత్మకముగా తెలుగున రచించినట్లు పేర్కొనబడి యున్నది. ఇది దానికంటే భిన్నమయినది. ఆతని ఈ ద్విపద రామాయణము నేడు లభ్యమగుట లేదు. అతని మరొక గ్రంథము "శృంగార మంజరి". ఇది మంజరీచ్ఛందోమయమయిన శృంగారగ్రంథము. శృంగార మంజరిని రచించి అతడు దానిని తిరువేంగళ నాథ దేవునికి విన్నపము చేయగా ఆతడు ఆతనిని అనుగ్రహించెనట ! అన్నమాచార్యుడు ఇవికాక పండ్రెండు శతకములను, వివిధ భాషలలోను ఇంకను ఎన్నో ప్రబంధము లను రచించెనట! కాని వాటిలో నేడు 'వేంకటేశ్వరళతకము' మాత్రము ఉపలభ్యమగుచున్నది. ఇది అన్నమయ్య తిరుపతికొండ నెక్కుచు నిదురలో తనకు ప్రత్యక్షమయిన అలమేలుమంగమ్మను గూర్చి ఆశువుగా చెప్పిన శతకము. 'వేంక టేశ్వరా' యను మకుట మున్నను ఇందు ప్రతి పద్యమునను అలమేలుమంగా ప్రస్తుతియే కలదు. ఇది ముద్రితము. ఇందలి పద్యములు కొన్ని ప్రబంధ రత్నావళియను సంకలన గ్రంథమున ఉదాహరింపబడినవి. తక్కిన పదునొకండు శతకములును ఏయే వేల్పులమీద రచింపబడెనో, వారి వేళ్ళేవో ఎరుగరావు. 'జో అచ్యుతానంద జోజో ముకుంద రావె పరమానంద రామ గోవింద అని తెలుగుదేశములో బహుళ ప్రచారము నందియున్న జోలపాట అన్నమయ్య రచించినదే. ఈ జోలపాటలో తుది చరణమునందు ఇట్లు కలదు. 'అంగుగా దాళ్ళపాకాన్నయ్య చాల నీ శృంగార రచనగా జెప్పె నీ జోల" శ్రీ వెంక టేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవ సమయము లందు డోలోత్సవ సందర్భమున అన్నమయ్య తాను