Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒక వేయించి ఆతనిని చెరసాలలో పెట్టించేను. అప్పు డన్న మయ్య 'ఆకలివేళల నలపైన వేళలను' ఇత్యాదిగా గల సంకీర్తనమునుపాడి శ్రీ వేంక టేశ్వరస్వామిని స్తుతించెను. వెంటనే అతని చేతులకు తగిల్చియుండిన సం కేలలూడి క్రిందపడెను. చెరసాల కావలి కాయుచున్న సేవకులవలన ఆ వృత్తాంతము విని నరసింగరాయడు మరింత ఆగ్రహపరవశుడై అతని కడకు వచ్చి తిరిగి అతని చేతులయందు తానే స్వయముగా సంకెలలు తగిలించి “ఇప్పుడు విడిపించుకొనుము, చూత" మనెను. అంత అన్నమయ్య తిరిగి అదే పాటను భక్తి పారవశ్యముతో పాడగా మునుపటివలెనే ఆతని చేతులకు తగిల్చియుండిన శృంఖలలూడి క్రిందపడెను. అతని మాహాత్మ్యమున కాశ్చర్యమంది నరసింగరాయ డాతని పాదములకు సాష్టాంగముగా నమస్కరించి ఆతని అనుగ్రహమును వేడెను. అన్నమయ్యయు ఆతని శయతో ననుగ్రహించెను. అతడు పెనుగొండనుండి తిరుమలకు వచ్చెను. అచ్చట స్వామివారి సన్నిధిని సంకీర్తన గానముచేయుచు కాలము గడుపుచుండెను. ఆ కాలమున నత డెన్నో మహిమలు చూపెను. అప్పటి ఒక ముచ్చట వింతగానుండును. అదే మనగా : అన్నమయ్య మహిమవిని ఒకప్పు డొక పేద యువకుడు ఆతని దగ్గరకువచ్చి "అయ్యా ! నేను బ్రహ్మ చారిని. నేను పెండ్లి చేసికొన దలచుచున్నాడను. కాని నాకడ ధనములేదు. కనుక నాయందు దయతలచి నాకు కాసువీసము కలుగునటుల అనుగ్రహింపుడు" అని వేడు కొనెను. అతడు 'అట్లే' యని దీవించి పంపెను. పిదప ఆతడెందరికడకుబోయి వివాహార్థమై యాచించినను వారాతనికి 'కాసువీనము'నే కానీ ఒక్కరును ఒక్క 'రూకనైన నీయరైరి. ఇట్టి అనుభవమునకు అన్నమయ్య మహిమయే కారణమని గ్రహించి తిరిగి ఆతనికడకు వచ్చి “అయ్యా ! నా పెండ్లికి కావలసినంత ధనము వచ్చు నట్లనుగ్రహింపుము" అని వేడుకొనగా నాతడు ఆతని పై దయబూని 'అట్లే' అని పలికెను. అతనికడ దీవనబొంది ఆతడు వీథిలోనికి రాగానే ఒక రాజాతనిని పిలిచి, అత డడిగిన ధనమును ఒసగి సత్కరించెను. అది విని జనులు మిక్కిలి యాశ్చర్యమందిరి. ఇట్టి మహిమల నెన్నిటినో అన్నమయ్య ప్రదర్శించి చూపుచు తాను దివ్యధామ 205 అన్నమాచార్యులు - తాళ్లపాక మందుదాక అందే సివసించియుండెను. అతడు వృద్ధుడై కర్ణాట భాషలో వేలకొలది సంకీర్తనములను యుండగా రచించి గొప్ప ప్రఖ్యాతినొందెను. శ్రీ పురందరదాస స్వాములవారు అన్నమాచార్యుల సంకీ ర్తనరచనా ప్రసిద్ధినివిని, ఆతనిని దర్శించుటకై తిరుమలకు వచ్చెను. అచ్చట నాతని ప్రార్థించి సంకీర్తనములు పాడించుకొవి వేసి ఆకందించి యాతడు “నీవు శ్రీ వేంకటేశ్వరుని యవతారమవే" అని సన్నతింపగా అన్నమాచార్యుడు పురందరదాసుల వారి సంకీర్తనములను పొడించుకొని విని 'నీవు శ్రీ పాండురంగ విఠలుని అవతారమ‘వని సన్నుతించెనట ! ఇట్లు భ క్తి మయముగా దెబ్బది తొంబదేండ్ల నిండు జీవితమును గడిపి అన్నమయ్య క్రీ.శ.1508వ సంవత్స రమునకు సరియగు దుందుభి సంవత్సరమున ఫాల్గుణ బహుళ ద్వాదశినాడు దివ్యధామము నలంకరించెను. మహాభక్తుడును, గాయకుడును, కవీశ్వరుడును అయిన అన్నమయ్య యోగవైరాగ్యశృంగార సూర్గములలో ముప్పది రెండువేల సంకీర్తనములను రచించెనని ఆతని మనుమడుగు చిన్నన్న రచించిన 'అన్నమాచార్య చరి త్రము'లో కలదు. పదునారవ సంవత్సరమున శ్రీ వేంక టేశ్వరస్వామివారు తనకు ప్రత్యక్షమయినపుడు ప్రారం భించి, డెబ్బది తొమ్మిదవయేట తాను దివ్యధామము నందుదాక దినమున కొక సంకీర్తనము చొప్పున సంకీర్తవ ములు రచించినట్లు ఈతడు రచించిన శృంగార సంకీర్తన ముల యొక్కయు, ఆధ్యాత్మ సంకీర్తనముల యొక్షయు తొలి రాగి రేకునందు కలదు. అట్లు లెక్కించి చూడగా నించుమించుగా నిర్వదిమూడు వేల సంకీర్తనములు మాత్రమే లెక్కకు వచ్చును. దినమునకు ఒక్కటియైనను తక్కువకాకుండుపద్ధతిని అతడు సంకీ ర్తనములను రచించు చుండెనని చెప్పుకొనినచో అతడు ముప్పది రెండు వేల సంకీర్తనములను రచించెననుట సంగతమగు చున్నది. శృంగారాత్మకములుగా ఆతడు రచించిన పద ములకు 'శృంగార సంకీర్తనము' లనియు, వైరాగ్య పర ములుగా ఆతడు రచించిన వాటికి 'ఆధ్యాత్మ సంకీర్తనము' లనియు పేర్లు. ఈతడును ఈతని వంశీయులును రచించిన ఇట్టి సంకీర్తనములు ఈతని కుమాడడగు పెదతిరుమలా