Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అన్నమాచార్యులు - తాళ్లపాక ఆతనిని చూచి ఇంటికి రమ్మని యాతని పెక్కు విధముల బతిమాలెను. కాని భగవద్భక్తి పరాయణుడయిన అన్న మయ్య తొలుత ఆమె వేడికోలునకు అంగీకరింపలేదు. అందుపై ఆతని గురువర్యుడగు నైష్ణవాచార్యుడు ఆతనికి కొన్ని దివ్యోపదేశములు చేసి తల్లి మాట విని ఇంటికి పొమ్మనగా ఆతడు ఎట్టకేలకు అందులకంగీకరించి తన చేరిన తల్లి వెంట ఇంటికి ఏగెను. బహుకాలమునకు ఇల్లు అన్నమయ్యకు అతని తల్లిదండ్రులు వివాహ ప్రయత్న ములు చేసిరి. కాని ఎల్లప్పుడును భగవంతునే చింతించుచు ఇతర ప్రపంచము తెలియని అన్నమయ్యకు పిల్లనిచ్చుటకు ఎవరును ముందుకు రాకపోయిరి. అప్పుడు శ్రీ వేంకటే శ్వరస్వామియే కలలో నగపడి అతనికి పిల్లనీయవలసినదని యుద్బోధింపగా ఇరువురు భ క్తులు తమ పిల్లలు నాతని కిత్తుమని వచ్చిరి. పెద్దల సమక్షమున యథావిధిగా వారి వివాహముహూర్తము జరిగినది. వారిలో మొదటియామె తిరుమలమ్మ. రెండవయామె అక్కలమ్మ. వారిలో తిరుమలమ్మ అనబడు తిమ్మక్క యే 'సుభద్రా కల్యాణ' మను పేర ఒక గేయకావ్యమును " ఆ తరువాత రచించినది. వివాహమయిన పిదప ఆతడు కొంతకాలము స్వగ్రామమగు తాళ్ళపాకయందును, తిరుమలయందును, అహోబిలమునందును నివసించెను. ఆ కాలములో ఆతడు తన యిష్టదైవమగు శ్రీ వేంక టేశ్వరస్వామిపై అనేక శృంగార కీర్తనములను రచించెను. అహోబిలములో ఆదివః” శఠకోపయతీంద్రుని దగ్గర ఆతడు వేదాంతశాస్త్ర మును సంప్రదాయానుసారముగా అధ్యయనము కావిం చెను. అత ఉక్కడ ఉండిన కాలములోనే అతడు వాల్మీకి రామాయణమును తెలుగులో సంకీర్తనాత్మకముగా రచించినట్లు తెలియుచున్నది. అన్నమయ్య పొడుచుండిన సంకీర్తనములు కాలక్రమ మున లోకములో ప్రఖ్యాతి వహించెను. సాళువగుండ నరసింహరాయడను ప్రభువొకడు కర్ణాకర్ణిగా ఆ ప్రఖ్యా తిని విని ఒకనాడు అతని దర్శనమును అపేక్షించి వచ్చెను. అతనిని ప్రార్థించి అతనిచే కొన్ని సంకీర్తనములు పాడించు కొని అతడు అందలి మాధుర్యమునకు ముగ్ధుడయ్యెను. ఆ ప్రభువా కాలమున టంగుటూరు అను గ్రామములో నివసించుచుండెడివాడు. అతడు అన్నమాచార్యుని వేడు 204 కొని ఎట్లో యొప్పించి ఆతనిని తన వెంట టంగుటూరునకు పిలుచుకొనిపోయెను. అక్కడ అతనికి ప్రత్యేకముగా గుడిప్రక్క ఒక భవనమును కట్టించి యిచ్చి, అతనినందు నివసింపజేసెను. "శ్రీకృష్ణుని సహాయముతో డి అర్జును భూమండలము నెల్ల పరిపాలించినట్లు మీ సహాయముతో నేను ఈ భూమండలము నంతటిని ఏక చ్ఛత్రముగా పరిపా లించెదను" అని నరసింగరాయడు అన్నమయ్యతో చెప్పు కొనెను. వారిరువురును టంగుటూరిలో నే కొంత కాలము నివసించియుండిరి. ఇంతలో నరసింగరాయడు విజయనగర రాజ్యమును ఆక్రమించుకొని చక్రవర్తి యయ్యెను. నరసింగరాయడు పోయిన పిదప అన్నమయ్య టంగు టూరును వదలి తిరిగి తిరుమలకు వచ్చి భగవంతునిపై సంకీర్తనములు పాడుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు నరసింగరాయడు తన స్నేహితుడైన అన్నన్నయ్యను తన రాజధానియగు పెనుగొండకు రావించుకొని చక్కని సంకీర్తనములు పాడి తనకు సంతోషమును కలుగ జేయుమని కోరగా అన్నమయ్య కొన్ని సంకీర్తనములు పాడి వినిపించెను. ఆ సంకీర్తనములను విని రాయడు అనంద పరవశుడై ఆతనిని అనేక విధముల సత్కరించెను. పచ్చల కడియాలు మొదలగు ఆభరణములను, చీని చీనాంబరములను ఒసగి రాయ డతనిని ఆదరించెను. ఇట్లు రాయనిచే అఖండ సత్కారములందుచు ఆతడు కొన్నాళ్ళందే ఉండగా, మరి యొక నాడు నరసింగరాయడు అతనిని పిలిపించి శ్రీ వేంక టేశ్వరస్వామివారిపై ఆతడు రచించిన శృంగార సంకీర్తనములు కొన్ని పాడి వినిపింపు మని కోరెను. అన్నమయ్య అతని యానతిమేరకు కొన్ని సంకీర్తనములు పాడి వినిపించెను. అంత రాయడు యుక్తాయుక్త వివేకమును గోలుపోయి వేంకటపతిమీది పదములవంటి పదములను తనమీదను చెప్పవలసినదని ఆతనిని కోరెను. అది విని అతడు నిర్విణ్ణుడే మిక్కిలి ధైర్యముతో "శ్రీ వేంక టేశ్వరస్వామిని నుతించు నాలుకతో నిన్ను నేను మతింపజాలను" అని పలికి ఆతని కోరికను తిరస్కరించెను. రాయని కది కోపకారణ మయ్యెను. అత డాగ్రహ పరవశుడై కన్ను మిన్ను కానక ఈ అతనికి 'మూరురాయరగండ' మను పేరుగల సంకెల