అన్న జీవ పరివర్తన వ్యాధులు
పదార్థములు పూర్తిగా ఉపయోగించలేక కెటోన్ పదార్థములు ఉద్భవించును. అవి మూత్రముగుండా వచ్చును. రోగి అధికముగా మూత్రముపోయుట, దాహము, ఆకలి, బరువు తగ్గుట ఏర్పడును. మూత్రములో గ్లూకోస్ ఉండుటచేత దాని విశిష్ట గురుత్వము (స్పెసిఫిక్ గ్రావిటీ) హెచ్చును. రోగి తా నధికమగు బలహీనతతో నున్నట్లు చెప్పును. ఇందు రాగల క్లిష్ట పరిస్థితులు
- 1. క్షయ కూడ వచ్చుట.
- 2. మధు మేహముచే స్మృతి తప్పుట. నెత్తురులో అధికముగ చక్కెర యుండుటవలన ఇది జరుగును స్మృతి తప్పిన :రోగికి సరియైన చికిత్స జరుగని యెడల చనిపోవును.
- 3. మాంసము కుళ్ళుట రాచపుండు మొదలగు శస్త్రచికిత్స అవసరమగు వ్యాధులు కలుగుట.
- 4. చర్మముపై దురదలు కలుగుట.
- 5. కాలుచేతుల తిమ్మిరులు ఏర్పడుట.
- 6. కంటిలో పువ్వు మొలచుట.
- 7. రెటీనా అను కంటిగ్రుడ్డు లోపలి పొర వాచుట.( రెటినిటిస్)
- 8. మూత్రకోశపు వావు.
ఇన్సులిన్ వ్యాప్తిలోనికి రాక పూర్వము చిన్నతనము నందు మధుమూత్రవ్యాధికి గురియైన వారి సరాసరిజీవితము 5 సం. ల పరిమితి ఉం డెడిది. ఆ రోగి మధుమూత్ర మూర్ఛచేగాని, క్షయ చేగాని చనిపోవుచుండెను. ఇన్ సులిన్ అందుబాటులో నున్న నేడు రోగి క్రమబద్ధముగ ఆహారమును తగినంత మోతాదులో ఇన్సులిన్ ను తీసికొన్నచో అతడు అకాలమరణమునకు గురికావలసినఅవసర మెంతమాత్రమును లేదు. రోగి, ఆహారమును క్రమబద్ధముగ తీసికొనుచు బరువును ఒక ప్రమాణములో కాపాడుకొనుచు తనకు తానే సూదిమందు తీసికొనుట అలవాటు చేసికొనవలెను. ప్రతి రోగియు ఇన్సులిన్ పెద్ద మోతాదుగా తీసికొని ఆ పిమ్మట త్వరపడి భుజించని యెడల శరీరమందలి చక్కెర తగ్గునని గ్రహించవలెను. అతనికి చెమట, వణకు పుట్టును. అతడు బలహీనుడగును. మనస్సు వికలమై సొమ్మసిల్లుట జరుగవచ్చును. ఇనసులిన్ తీసికొనుచున్న మధుమూత్రరోగి తనయొద్ద చక్కెర నుంచుకొని ఆసూచన కానవచ్చిన వెంటనే తినవలెను. ఇన్సులిన్ రెండు రకములు, 1. కరిగెడు రకము. ఇది నాలుగు గంటల సేపు పనిచేయును. రోగికి రోజుకు రెండుమార్లు సూదిమందు లీయవలెను. (2) గ్లోబిన్ ఇన్ సులిన్. ఇది చాల సేపు పని చేయును. రోగికి రోజుకు ఒకసారి సూది మందు ఇచ్చిన సరిపోవును.
ఆయత్నకృత (స్పాంటేనియస్) హైపొగ్లైసీమియా : స్వాదుపిండము యొక్క లాంగర్ హాన్ దీవులనుండి యిన్సులిన్ పుట్టును. అందుండి ఇన్ సులిన్ ఎక్కువగా స్రవించుటవలన గాని, దీవులలో గ్రంథి పుట్టుటవలన గాని యెక్కువ ఇన్సులిన్ తయారగును. పొట్టలో అనిర్దిష్టమైన నొప్పి ఉన్నదనియు, బలహీనముగ నున్న దనియు, భోజనము తర్వాత కొంత శాంతించినదనియు, రోగి మొరపెట్టును. వ్యాధి తీవ్రమైనయెడల రోగికి స్మృతి తప్పుటకూడ సంభవింపవచ్చును. రక్తములోని గ్లూకోసు పరీక్ష చేయుటవలన రోగమును నిర్ణయింపవచ్చును. ఇది 80 మి. గ్రా. లు మొదలు 60 మి. గ్రాముల వరకుండును. ఇందులకు చికిత్స :- (1) తరచుగా ఆహారమిచ్చుట (2) స్వాదుపిండములోని ఆభాగమునుకాని, లేక ఏదేని గ్రంథి కనుపించినచో దానిని కాని శస్త్రచికిత్స మూలమున తీసి వేయుట.
వాన్ గార్కీస్ రోగము : ఈ వ్యాధికిగల కారణమేమో తెలియదు. గ్లైకోజన్ పెద్ద పెద్ద మొత్తములలో ఇంద్రియములందు నిలువయుండును. పిల్లలు పెద్ద పరిమాణముగల హృదయముతో పుట్టుదురు. అట్టి పిల్లలు సాధారణముగ ఒకటి రెండు సంవత్సరములకంటె ఎక్కువ కాలము బ్రతుకరు.
వాతరక్తము (గౌటు) : ఇది యూరిక్ ఆసిడ్ యొక్క అన్న జీవ పరివర్తనమునందు సంభవించు ఒక కల్లోలము. దీనికి గురియగువారు 40 సంవత్సరములకంటె ఎక్కువ వయస్సు కలవారు. వారు చలిలో తిరిగినచో కాలి బొటనవ్రేలి మొదటి కీలునందు తీవ్రమగునొప్పి వాటిల్లును. కీలు వాచును. ఎఱ్ఱబడి ఏమాత్రము చలనము కలిగినను నొప్పిగానుండును. యూరిక్ ఆసిడ్ పెరుగును. కాలము గడచినకొలదియు మూత్రములోను చెవిలోను ఆరికాలి