Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అన్నజీవ పరివర్తన వ్యాధులు చును. యూరియా మూత్రములోనికి స్రవించుటనుబట్టి మాంసకృత్తులు ఎంతలో పలికి తీసికొనుచున్నా మో నిర్ణయింపవచ్చును. అత్యవసరమైన పమైన్ ఆసిడ్లు ఏవి యనగా (1) లూసిన్ (2) ట్రిప్టోఫేన్ (8) మిథై యొనిన్ (4) థియొనిన్ (5) ఫినైన్ ఎలనిన్ (B) వాలీన్ (7) లైసీన్ (8) ఆర్జనీన్ (9) హిస్టిడీన్ (10) హైసొ లూసిన్. ఇవి పాలు మొదలగు వస్తువులలో కలవు. ఎదుగుటకై వీటిని తీసికొనుట ఆవశ్యకము. ఆరమాటిక్ అమైనో ఆసిడ్సు కాలేయమునందు ఎథీరియల్ సల్ఫేట్సుగా మారి మూత్రములోనికి స్రవించును. క్రియాటిన్: రక్తములో 10 మి. గ్రా. శాతము కండరములలోను వృషణములలోను ఉండును. ఇదిస్వల్ప పరిమాణములో రక్తములోను మూత్రములోను 2% కలదు. ශුයි శరీర అంతర్గత అన్న జీవపరివర్తనము ద్వారమున వ్యర్థ పదార్థముగా ఏర్పడుచున్నది. యూరిక్ ఆసిడ్: ఇది ఆహారమందలి మాంసకృత్తుల నుండియు, నూక్లియే ధాతువులనుండియు చెడిన పదార్థ ముగా ఏర్పడుచున్నది. రక్తములో ఇది 3 మి. గ్రా. శాతముండును. ఇది మూత్రము ద్వారమున విసర్జింప బడును. క్రొవ్వు యొక్క అన్న జీవ పరివర్తనము: ఆహార మందలి తటస్థమగు క్రొవ్వుపదార్థములపై జీర్ణరసము లోని లెపీసు, స్వాదుపిండములోని లెపీసు పనిచేయును. పైత్యరస లవణములు వాటి సామర్థ్యమును 14 రెట్లు హెచ్చించును. పైత్యరస లవణములు, నీరు, మ్యూసిన్ కలసి క్రొవ్వును నీరు క్రింద మార్చును. క్రొవ్వు గ్లిసరిన్ గాను ఫాటీ అసిడ్సుగాను పూర్తిగా చితుక కొట్టబడును. ఫాటి ఆసిడు, క్రొవ్వు, ఆమ్లములు మున్ముందు మార్పులు పొందునపుడు ముందుగా కలిసి పేగులలోని పాల గొట్టమును చేరుకొనును. వేగుగోడలో ఫాటీ ఆసిడ్లు చైత్యరస ఆమ్లములు విడిపోవును. పైత్యరసము పేగు బైటికివచ్చి మరల పాటీ ఆసిడ్సుతో కలిసి లోపలికి ప్రవేశించును. పేగులోపల ఫాటీ ఆసిడ్సు తటస్థమైన క్రొవ్వుగామారి రక్తమునందు చేరును. అవి రక్తమునందు ఈక్రిందిరూపములతో మండును. (1) తటస్థమగు క్రొవ్వు 200 (2) లెసితిన్ (8) కొలేస్టో రాలు.(180 మి.గ్రా. శాతము) కొలేస్టోరాలు.(180 క్రొవ్వు నిలువయుండు స్ధానములనుండి కాలేయపు ధాతువులు క్రొవ్వును తీసికొని పోవును. కండరములు పిండిపదార్థములను, క్రోవ్వును, శక్తికొరకు ఉపయోగించు కొనును. బొగ్గుపులును వాయువుగను, నీరుగను, మారు టకు చక్కెర తగినంత యుండవలెను. మధుమేహము లేక నిరాహారత మొదలగునవి కలిగినపుడు చక్కెర తగినంత ఉండదు. కావున క్రొవ్వు అసిటోను బాడీస్ ను ఇచ్చును. అది మూత్రములో విసర్జింపబడును. ఇన్సులిను కావలసిన గ్లూకోసును సరఫరాచేసి కిటోసిన్ ను నిర్మూ లించును. ఆల్కాప్ట నూరియా; ఇది పుట్టుకతోవచ్చు వ్యాధి, ఇది అరుదైనది. మూత్రము వారము అగుచో గాలి కొంత సేపు తగులగనే అది నల్లగా నగును. ఇందు హిమో జెంటిసిక్ ఆసిడ్ కలదు. హెమోక్రొమోటిసిస్ ; ఇది శరీరాంగము లన్నిటి యందును అసాధారణ పరిమాణములో ఇనుము నిలువ యుండు వ్యాధి. ఇది ముఖ్యముగా హెమొ నెడరిన్ రూపములో నుండును. అందులకుగల కారణము తెలి యదు. అదికూడ అరుదైన వ్యాధి. మధుమేహము (డయాబిటిస్ మెల్లిటిస్): స్వాదు పిండములోని లాంగరు హన్సు దీవులలోని యిన్సులిను ఉత్పత్తిచేయు 'బి' కణములు తక్కువ అగుటవలన ఈ వ్యాధి వచ్చునని ఇదివరలో నమ్మెడువారు. కాని కుక్క లకు ఆం టేరియర్ పిట్విటరీ ఎక్స్ట్రాక్టు సూది మందుగా ఇచ్చుటవలన వాటికి మధుమేహము కలుగుచున్నది. పిల్లలయందును యౌవనములో నున్న స్త్రీ పురుషులందును ఇది తీవ్ర ఫలితములకు దారితీయును. వృద్ధులం దిది చాల సాధువుగ వచ్చును. పిండిపదార్థముల అన్న జీవ పరివర్త నమునందు కలవరము వాటిల్లును. యిన సుఖిన్ లేని యెడల కాలేయము గ్లూకోసును గ్లైకోజనుగా మార్ప జాలదు. ధాతువులు గ్లూకోసును ఉపయోగింపలేవు. అందువలన రక్తములోని చక్కెర మిక్కుటమగును. అది 180, మి. గ్రా. శాతమును మించును. మూత్రములో చక్కెర కాననగును. గ్లూకోసు లేనియెడల క్రొవ్వు