Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వయమును వ్రాసెను. వేదమువై నితడు స్వరలక్షణమను గ్రంథమును రచించెను. ఇట్లన్నంభట్టు హాటక లేఖిని బహుముఖముల బహురంగముల నర్తించెను. M. c. 50. అన్న జీవ పరివర్తన వ్యాధులు :- పిండిపదార్ధ ముల అన్నజీవ పరివర్తనము (కార్పోహైడ్రేట్ మెటా బోలిజం) : లాలా (ఉమ్మి) జలమండలి బైలీన్, స్వాదు పిండపు ద్రవములోని ఎమైకస్, చిన్ని పేగు ద్రవములోని యిన ్వక్టేస్, మాల్టేస్, లాక్టేస్ అనునవి పిండిపదార్థ ములను గ్లూకోసుగా మార్చును. పేగులలోని సూక్ష్మ జీవులు కొంత గ్లూకోసును బొగ్గుపులుసు వాయువు గను, మిథేనుక్రిందను మార్చును. పేగులద్వారమున గ్లూకోసు రక్తములోనికి పేగుల యొక్క వైపొర సహా యముతో పీల్చుకొనబడును. గాలక్టోసు, లీవ్ లోసు, కాలేయమును చేరి, అచట అవి రెండుకు గ్లూకోసుగా మార్పునొందును. గ్లూకోసులో చాల భాగము గ్లైకోజను క్రింద మార్చబడి, కాలేయపు కణములలో నిలువచేయ బడును. కొంత మాత్రము కాలేయముగుండ రక్తప్రవా హములోనికి పోవును. సుమారు 500 గ్రాముల గ్లైకో జను శరీరమునందు నిలువచేయబడి యుండును. అందు 100 గ్రాములు కాలేయములోను, కాలేయములోను, మిగిలినది అస్తి పంజర కండరములందును ఉండును. సాధారణముగ రక్తమునందు 80-120 మిల్లీగ్రాముల చక్కెర యుండును. 50 గ్రాముల గ్లూకోనును ఇచ్చి రక్తము నందలి చక్కెరను ప్రతి అరగంటకు అంచనకట్టిన యెడల అది ఒక గంటలో 130-160 మిల్లీ గ్రాములకు పెరుగును. రెండు, రెండున్నర గంటలలో మామూలు పరిస్థితికి తగ్గిపోవును. దీనినే శర్క రాసహన పరీక్ష(సుగర్ టాలరెన్సు టెస్టు) అందురు. రక్తమందలి చక్కెర 180 మిల్లీగ్రాములకు మించియున్నచో, మూత్రము నందు చక్కెర కానవచ్చును. ధాతువులు వ్యయమగుట మూలమున, రక్తమందలి చక్కెర తగ్గిపోయినయెడల, కాలేయమందలి గ్లైకోజను గ్లూకోసుగా మార్పు చెంది రక్తప్రవాహములోనికి విడుదల చేయబడును. పెక్కు ఆమినో ఆసిడ్లను, బహుళముగ క్రొవ్వును గ్లూకోసుగా మార్పు శక్తి కాలేయమునకు గలదు. 199 అన్నజీవ పరివర్తన వ్యాధులు స్వాదుపిండము నందలి సహజకణములతో సంబంధము లేని లాంగరుహన్సు దీవులలోని బి కణముల నుండి యిన్ సులిను స్రవించును. ఇది యొక హార్ మోను. దీని సంఘటమును గూర్చిన వివరములు C254 H877 O75 అని సాంగర్ అను శాస్త్రజ్ఞునిచే 1955 లో కనుగొన బడెను. దీనివలన ధాతువులలోని గ్లూకోసును వినియో గించుటకు వీలు కలుగును. కాలేయములో, కండర ములలో, గ్లైకోజను నిలువ చేయుటకు అవకాశ ము లభించును. అమినో ఆసిడ్సు, క్రొవ్వు, వ్యయ ము గాకుండ రక్షణము ఏర్పడును. మూత్రములో చక్కెర ఉండిన యెడల దానిని మధు మూత్రవ్యాధి (గ్లైకొసూరియ) అందురు. గ్లైకోజను 2 100. ఘ. సెం.మీ. రక్తములో 180 మిల్లీగ్రాముల కంటె ఎక్కువగా తయారైనయెడల మధుమేహము (డయాబెటిసు. మెల్లిటసు) సంభవించును. కొందరి రక్తములో చక్కెర 180 మిల్లీగ్రాముల కన్న తక్కువ యున్నను మూత్రములో చ క్కెర యుండును. దీనినే మూత్రపిండ సంబంధమైన మధుమూత్ర వ్యాధియందురు. ఇది ఎక్కువ ప్రమాదకరమైన వ్యాధి కాదు. మాంసకృత్తులకుసంబంధించిన అన్న జీవ పరివర్తనము : కడుపు ద్రవములోనున్న పెప్సిను, హైడ్రోక్లోరిక్ ఆసీడు, రేనిన్ స్వాదు పిండములోని ట్రిప్సిను, చిన్న పేగు ద్రవములోని ఎరప్పిను అనునవి మాంసకృత్తులను ఆమీనో ఆసిడ్సుగా మార్పు చేయును. ఇందు నత్రజని (యన్ హెచ్ 2) కలదు. వాటి సంఖ్య 15. ఉదాహరణములు :- ఆలేవిన్, గైసిన్, లూసిస్ మొ. అవి రక్తప్రవాహములోనికి పీల్చు కొనబడి, కాలేయము చేరును. అందు కొన్ని కాలేయము గుండా సాధారణ ప్రవాహములోనికి తీసికొవబడును. ధాతువులు వాటిని గ్రహించి తమయందలి పదార్ధము లను పెంపొందించుకొనుటకును, శరీరము యొక్క తరుగు దలను తిరిగి పూర్తిచేయుటకును ఉపయోగించుకొనును. అదనముగ మన్న యెమైనో ఆసిడ్ కాలేయమందే పూర్తిగా యూరియాగా మార్చబడును. సాధారణముగ రక్తములోని యూరియా ప్రమాణము 20-40 మిల్లీ గ్రాముల శాతముండును. అది మూత్రములోనికి స్రవిం