Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అన్నంభట్టు సించి, పిదప కాశికేగి, అక్కడ వ్యాకరణ శాస్త్రమును శేషవీరేశ్వర పండితుని యొద్ద అభ్యసించి సమస్త విద్యా పారగు డయ్యెననియు నొక ఐతిహ్యముకలదు. కాశీయం దితడు పొందిన యఖండి గౌరవము 'కాళీగమన మాత్రేణ నాన్నంభట్టాయ తేద్విజః' అనుసూక్తి వలన తేట పడుచున్నది. అన్నంభట్టు A కాశినుండి స్వగ్రామమునకు చేరి తర్క మీమాంసాద్య నేక శాస్త్రగ్రంథములను రచించెను. ఇతడొక పాఠశాలను కొండవీటిలో నేర్పరచి విద్యార్ధు తర్క లకు తర్కశాస్త్రమును బోధించుచుండెను. శాస్త్రము నభ్యసించువారు క్రమముగా తర్కసంగ్ర హము, దీపిక, ముక్తావళి, గాదాధరీయము మున్నగు గ్రంథములను చదువవలె నను పరిపాటి అన్నంభట్టే యేర్పరచెననియు, అప్పటినుండియే ఆ పద్ధతి ఆచరణము లోనికి వచ్చెననియు పలువురు విద్వాంసుల విశ్వాసము. ఇట్లు సుప్రసిద్ధి నొందియున్న అన్నంభట్టునకు విజయనగర సామ్రాజ్యాధిపతులలో నొకడగు శ్రీ సదాశివరాయల కాలమున అళియ రామరాజుచే గరికపాడను గ్రామము దానముగా నొసగబడినట్లు శాసనములవలన తెలియు చున్నది. కావున నీతడు క్రీ. శ. 18 వ శతాబ్ది మధ్య ముననుండెనని నిశ్చయింపనగును. గరిక పాడు దానముగ లభించినది మొదలు అన్నంభట్టును తద్వంశ్యులును పారం పర్యముగ ఆ గ్రామమందే స్థిరనివాసమేర్పరచుకొని, గ్రామమునుబట్టి గరికపాటి వారను గృహనామముచే ప్రసిద్ధినొందిరి. నేడు గరికపాటియందును తదితర స్థలము లందును కల గరికపాటివారు తెలగాణ్యులుసు కౌశిక సగోత్రులు నై యున్నారు. వ అన్నంభట్టు పుంభావసరస్వతి యనుట అతిశయో క్తి కానేరదు. అన్నంభట్టు తర్క మీమాంసా వేదాంత వ్యాకరణ శాస్త్రములందు నిష్ణాతుడయి పెక్కు శాస్త్ర గ్రంథముల రచియించెను. ఇతడు తర్కశాస్త్రమున - తర్క సంగ్రహము, తర్క సంగ్రహ దీపిక, తర్క భాషా తత్త్వబోధిని, ఆలోక సిద్ధాంజనము, (ఇది జయదేవుని ఆ లోకమను తత్త్వచింతామణికి వ్యాఖ్య) సుబుద్ధి మనోహరము (ఇది రఘునాథ శిరోమణి కృతమైన దీధితికి వ్యాఖ్య) అను గ్రంథములను వ్రాసెను. 12వ శతాబ్ది వరకు సూత్రగ్రంథములను, పిదప గంగేశోపాధ్యాయ - కృతమైన తత్త్వచింతామణిని ఆధారముగ చేసికొని న్యాయశాస్త్రము వికాసమునొందెను. ఇట్టి భేదమును బట్టియే మొదటిదానికి ప్రాచీన న్యాయమనియు రెండవ దానికి నవీన న్యాయమనియు వ్యవహార మేర్పడెను. తర్క సంగ్రహమున ద్రవ్యాదిసప్తపదార్థముల స్వరూ పము సంగ్రహముగ వివరింపబడినది. తర్క సంగ్రహ దీపిక అనునది తర్క సంగ్రహమునకు అన్నంభట్టుచే వ్రాయబడిన టీకా గ్రంథము. తర్క సంగ్రహ నిర్మితి యందలి వైశిష్ట్య మెద్దియన ప్రాచీనులు ప్రమాణ నిరూపణానంతరము పదార్థ నిరూపణ మొనర్చిరి. ఆరంభమున నున్న ప్రమాణనిరూపణము మిక్కిలి కఠిన మైనదై సుబోధ మగుటలేదు. అందుచేత శాస్త్రోద్దేశము ప్రచారమునకు వచ్చుట కష్టమయ్యెను. అన్నంభట్టు ముందుగనే శాస్త్రమందలి ప్రమేయముల నిరూపించి ఆ ప్రమేయ నిరూపణమునకు ప్రమాణములను సాధన ములుగా గ్రహించెను. అందువలన శాస్త్రోద్దేశము సుబోధ మగుచున్నది. ప్రాచీనులు ప్రాచీన గ్రంథములయం దొక్కొక్క భాగమునకు మాత్రమే ప్రాధాన్య మొసగి దానినే విపులముగ చర్చించిరి. అన్నంభట్టు శాస్త్రప్రమేయ సామగ్రి నెల్ల సమగ్రముగాను క్లుప్తము గాను వివరించెను. తర్క సంగ్రహమందు అన్నంభట్టు క్రమమును మార్చుటచేతను, విషయమును సమగ్రముగా గ్రహించుటచేతను, సుబోధ మొనర్చుటచేతను, ఇది 198. ఆ సేతు హిమాచలము సంతత పఠన పాఠనములందు విశేషోపయోగమును కాంచుచుండుటచేతను దీనికి నవీన న్యాయమున ప్రధానస్థానము లభించియున్నది. మీమాంసా శాస్త్రమున ఇతడు రాణకోజ్జీవిని (ఇది మీమాంసాశాస్త్రమున భట్ట సోమనాథుని రాణక మునకు టీక. దీనికి సుబోధిని, సుధాహరము అనునవి నామాంతరములు) తంత్రవార్తిక టీక అను రెండు గ్రంథములను రచించెను. వేదాంత శాస్త్రమున - మితాక్షర (ఇది బ్రహ్మసూత్రములపై వ్రాయబడిన వృత్తి), తత్త్వ వివేచనము - అను రెండు గ్రంథములను రచియించెను. వ్యాకరణ శాస్త్రమునందు వ్యాకరణ మితాక్షర (ఇది పాణిని అష్టాధ్యాయివై అత్యంత సులభమైన వ్యాఖ్య) భాష్య ప్రదీపోద్ద్యోతనము (ఇది క్లెయటుని ప్రదీపముపై వ్యాఖ్య) అమ గ్రంథ శా