Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనువర్తిత సంఖ్యాశాస్త్రము భిన్నమైన కొలతలు, భారములుగల అణు స ము దాయములను తలచుకొని, కఱ్ఱనార, రబ్బరు, మాంస కృత్తులు మొదలగు పదార్థముల ధర్మము ల ను వివరించుటకు రసాయన శాస్త్రజ్ఞులు మొదలిడుచున్నారు. రసాయనికపు మార్పులవలన పదార్థములలో కలిగిన ధర్మ వికారములను సముదాయపు పొడవులో పంపకము యొక్క పునః పునరావృత్తిలోని మార్పు రూపముచే వివరించు చున్నారు. సంఖ్యాశాస్త్ర భావములు మెల్లగా నవీన రాసాయనిక సిద్ధాంతములలో చొచ్చుకొని పోవుచున్నవి. అక్షరము తరచుగా 9. సాహిత్యము : సాహిత్యమువంటి విభాగము ల యందు సంఖ్యాశాస్త్రము యొక్క ఉపయోగములు అరుదుగా కాననగును. ఉదా: సాహిత్యములోని పలు రకములలో అక్షరములు పునః పునరావృత్తియొక్క జ్ఞానము రహస్య రచనాశాస్త్రమున ఉపయోగించును. దీనినిబట్టి సాంకేతిక భాష గుర్తింపబడినది. ఆంగ్లేయ సాహి త్యము లో A ఉపయోగింపబడును. అందువలన స్మృతి భాషలో తరచుగా ఉపయోగించు సంకేతము E అని నిరూపింప వచ్చును. అటులనే అక్షరముల యొక్క వివిధ మేళన ముల పునః పునరావృత్తి మరికొన్ని వివరములనిచ్చురు. రహస్యరచనా శాస్త్రమున సంఖ్యాశాస్త్ర పద్ధతులు వృద్ధి చేయబడి రెండవ ప్రపంచ సంగ్రామమున శత్రువుల రహస్యవార్త లను కనుగొనుటకు జయప్రదముగా ఉపయో గింప బడినవి. ఒక రచయిత యొక్క శైలిని గురించి చెప్పుటకు సంఖ్యాశాస్త్ర పద్ధతుల నుపయోగింప ప్రయత్నించిన వాడు జి. యు. యూల్ (G. U. Yule) అనునతడు. ఇందు ఒకరి రచనలలోని వాక్యముల పొడవు, కల్పనలు మొదలగు వివిధ గుణముల యొక్క పునః పునరావృత్తి పరిశీలించబడును. రచయితల శైలిలోగల తారతమ్యము లను కనుగొనుట కీది యొక మంచిపాధనము. ఒక గ్రంథము యొక్క కర్తృత్వము సందిగ్ధమై యున్నప్పుడు దీనినిబట్టి, ప్రాయికముగా గ్రంథకర్తను నిర్ణయించవచ్చును. మన దేశీయుడగు యార్డి అను నతడు బహిరంగ సాథ్యములు లేని షేక్స్పియర్' గ్రంథములు ప్రకాశ పరచిన తేదీలను కనుగొనుటకై సంఖ్యాశాస్త్ర విధానము 196 నుపయోగించి యుండెను. పెక్కు గ్రంథముల విషయ మున తేదీలు విదితములై యున్నవి. కాని Love's Labour Lost, Taming of the Shrew మొగు కొన్నిటి విషయములు తెలియక పోవుటయు, వివాదా స్పదములై యుండుటయు సంభవించెను. రచయితల శైలిలో కొన్ని గుణములు కాలము ననుసరించి మార్పు చెందుచుండును. పై సమస్యను పరిష్కరించుటకు ఇది ఆధారముగా గ్రహింపబడినది. రచయిత శైలిలోని విరామము, ఒత్తిడి (Stress) అను రెండు గుణముల కొలతలు గ్రహింపబడినవి. షేక్స్పియర్ రచించిన అన్ని గ్రంథములయందును కవిశైలికి స్వభావసిద్ధములైన పై రెండు గుణముల కొలతలు తీసికొనబడినవి. తేదీలు తెలిసిన గ్రంథములను మాత్రము పరీక్షించి శైలి స్వరూప మునకును ప్రచురణకాలమునకును గల సంఖ్యాశాస్త్రీయ సంబంధము స్థాపింపబడినది. శైలి స్వరూపమును గుర్తించు అట్టి సంబంధమునుబట్టి తెలియని గ్రంథ ప్రచురణకాలమును ఊహింపవచ్చును. ఈ పద్ధతినిబట్టి షేక్స్పియర్ యొక్క Love's Labour Lost గ్రంథము 1591-92 వసంత ఋతువునందు రచింపబడి నట్లు నిశ్చయింపబడినది. అను 10. సంఖ్యాశాస్త్ర దుర్వినియోగములు: ఒక విధముగా సంఖ్యాశాస్త్రము నిపుణుల యొక్క భాషయని చెప్ప వచ్చును. అనుభవము లేనివారును చక్కగా తెలియని వారును న్యాయాన్యాయ విచారములేని రాజకీయ వేత్తలును ఈ శాస్త్రమును దుర్వినియోగము చేయ వచ్చును. దైనిక సమస్యల పరిష్కరించు ఇతర అను వర్తితశాస్త్రముల వలెనే దీని విషయమున, గూడ ప్రమాదము కలదు. ఫలితములను తప్పుగా గ్రహించి వానిని సరిదిద్దుటకై చేసిన యత్నముల వలన ఒక్కొక్క ప్పుడు శాశ్వత నష్టములు సంభవింపవచ్చును. అనుకొన్న విషయమును ఋజువు చేయుటకై కావలెనని వలసిన విషయములనే సేకరించుట వలనను, చాలని వృత్తాంత ముల వలనను, తారతమ్యము గ్రహించుటకు చాలినంత వస్తువు లేనందు వలనను, తప్పు జాబితాలను సృష్టించుట వలనను, పరిశీలన వివేకము తగినంత లేకపోవుట వలనను దుష్ఫలితములే సంభవించుచుండును.