Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనువర్తిత సంఖ్యాశాస్త్రము ప్రాబల్యమువలన మానవుని వంశపారంపర్యసమస్యను పరీక్షింప మొదలిడిరి. లండన్ జీవపరిమాణ ప్రయోగశా లలో కె. పియర్సన్ అను శాస్త్రజ్ఞుడు గుణ స్వభావము లందలి పరివర్తనములను, సహపరివర్తన స్వరూపములను చాలవరకు పరిశీలించెను. తరువాత ఫిషర్ మహాళయుడు పరివర్తన విశ్లేషణ విధానమును (Analysis of Variance) కనిపెట్టెను. ఈ విధానమువలన సముదాయములలో ఆంతరముగా గలుగు మార్పులు గమనించుచు, సముదాయ ములకు సముదాయములకు నడుమ నుండు భేదమును పరీక్షించనగును. పూర్వ మీ పరీక్ష కష్టముగా నుండుట వలన జీవశాస్త్రజ్ఞులు జంతు వృక్ష స్వరూప గుణముల యొక్క పరీక్షతోనే తృప్తిపడుచుండిరి. నవీన సంఖ్యాశాస్త్ర విధానము యొక్క ప్రయోజన ములను గుర్తెరుగువానిలో ఉత్పత్తి క్రమశాస్త్రము తన సత్వరాభివృద్ధికి సంఖ్యాశాస్త్రమున కెంతయు ఋణపడి యున్నది. సంఖ్యాశాస్త్రము, ఉత్పత్తి క్రమశాస్త్రము ఈ రెండును ఇరువదియవ శతాబ్దమునకు ప్రత్యేకత నొసంగిన విధానములు. ఈ రెండును ప్రత్యేకదృష్టి గలిగి శాస్త్రీయ య పరిశోధన విధానములలో తమ ప్రాబల్యమును చూపుచున్నవి. ఉత్ప త్తి క్రమశాస్త్రజ్ఞుడు ప్రయోగ ఫలిత ములను సంఖ్యాశాస్త్రమువలన విభజించి, ఉత్పత్తిక్రమము యొక్క భావనలను సంగతమగు చట్టమున నుంచగలిగెను. అందువలన క్రొత్త విషయములు కనుగొనుటకు అవకా శము చిక్కినది. మనుజులలోని రీసస్ (Rhesus) రక్త సముదాయముల యొక్క అనువంశిక సూత్రములను అతి శీఘ్రముగా కనుగొనుటయే ఈ రెండు శాస్త్రముల అన్యోన్య సహాయమునకు నిదర్శనము. ఉత్పత్తి శాస్త్ర విషయ పరీక్షలో సంఖ్యాశాస్త్రము విజయముపొందుటకు గానెట్, ఫిషర్ మొదలగు శాస్త్ర జ్ఞులచే కనుగొనబడిన కొలది రకముల సిద్ధాంతమే (Small Sample Theory) ప్రధాన కారణము. ఈ సిద్ధాంత సహాయమున వివిధాధారముల నుండియు, వేరు వేరు దేశముల నుండియు లభించిన స్వల్ప వివరములను పరీ ఉంచనగును. సంగత భాగములను మేళవించి, మన పరిశీలన విషయజ్ఞానమును వృద్ధిచేసికొనవచ్చును. ఇంతకు ముందు సంఖ్యాశాస్త్రజ్ఞుడు భిన్న ఆధారముల నుండి 194 సేకరింపబడిన సముదాయ వస్తుజ్ఞానము మీదనే ఆధార పడవలసియుండెను. ఆ వృత్తాంతములను సజాతీయమైన రకముగా నెంచలేము. అందున్న సంకీర్ణతను గుర్తెరుగక చేయు నిర్ణయములు సరిగా నుండజాలవు. మొక్కల పెంపకపు విధానమును పరీక్షింతము. ఇందు క్రొత్త మొక్కలను, మంచిఫలమునిచ్చు మొక్కలను ఉత్పత్తిచేయుటయే ఉద్దేశము. ఈ విధానము ననుసరిం చియే అమెరికాదేశము సంకీర్ణ ధాన్యభేదమును (Hybrid corn) పండించగలిగినది. తత్ఫలితముగా వారి జాతీయా దాయము 10% హెచ్చినది. మొక్కల పెంపకమున రెండు విధానములు గలవు. (1) సంకరజాతి పెంపకము, (2) స్వభావ సిద్ధమగు జాతి పెంపకము. ప్రతి రంగము నందును అనేక వ్యత్యాస గుణములు గల జాతులను పోల్చి, మంచి ఫలాదాయము నిచ్చువానిని గ్రహించ వలసిన బాధ్యత కలదు. ఈ ప్రయోజనమునకై ప్రయోగ స్వరూప శాస్త్రము (Design of Experiments) పెంపు చేయబడినది. దీని వలన సాధ్యమైనంత నిర్దుష్టముగా ప్రయోగఫలితములందలి భేదములను ఊహించుటకు వీలగు పరీక్షలను చేయవచ్చును. 5. విద్య, మనశ్శాస్త్రము: జ్ఞానము, అభిరుచి, మనో భావము మున్నగు పదములు మనము సాధారణముగా వాడున వే. కాని వానిని కొలుచుటలో పెక్కు భావ క్లేశములు మనల నెదుర్కొనును. ఈ కొలతల కావశ్యక మేమి? ఒక వ్యక్తి ఫలానా ఉద్యోగమును గాని, వృత్తిని గానీ. ఈవిధముగా నిర్వహించగలడని అంచనా వేయుటకు ఈ కొలతలు కావలసియుండును. ఆ వ్యక్తి సమర్థుడైన శాస్త్రజ్ఞుడగునో, న్యాయవాది యగునో, వైద్యుడగునో, అధికారి యగునో కనుగొనుటకు మనస్తత్వ వేత్తలయిన బినెట్ నైమన్, స్పియర్ మన్, థామ్సన్ మున్నగువారు అనేక పరిశోధనములను చేసియున్నారు. కొన్ని పరీక్షలలో ఒక వ్యక్తి ప్రదర్శించు సామర్థ్యముపై అతని భావి ప్రవృత్తి ఆధారపడియున్నచో, ఆ పరీక్షలు విశ్వసనీయ ములుగను, క్రమబద్ధములుగను ఉండవలయును. రెండు భిన్న కాలములయందు జరుపబడు పరీక్షలో ఒకేవ్యక్తి సంపాదించిన ఫలితములం దెక్కువ భేద ముండకుండినచో తత్ఫలము విశ్వసనీయమైనదిగా గుర్తింతుము. అట్టి పరీక్షా