Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అట్టి పూర్తి లెక్కల సంపాదనమున కలుగు వ్యయ ప్రయాసలను కాలక్షయమును ఓర్చినను, సరియైన ప రి శీ ల న ము లేకున్న అవి విశ్వసనీయములు కాక పోవచ్చును. అంతేగాక పెక్కు సమయములలో కొద్ది వ్యవధిలోనే అంచనాలు కావలసియుండును. కావున పూర్ణ పరిశీలనమునకును సేకరించిన విషయముల క్రోడీ కరణమునకును కాలము చాలదు. సముదాయము నందలి ఎల్ల అంశములను పరిశీలింపకుండనే స్థాలీపులాక సిద్ధాంతముచే విశ్వసనీయమైన నిర్ణయమునకు రాగ లమని రుజువుచేయబడినది. అధిక వ్యయముతో సముదాయమును సమగ్రముగా పరిశీలించి సేకరించిన విషయములకంటె పొలములు, ఇండ్లు మొదలగు స్వల్ప సంఖ్యాకములై న భాగముల పరిశీలనముచే గ్రహింపబడిన విషయములే మేలై నవని గమనించబడినది. క్రోడీకరణ ముగూడ సమర్థతతో చేయనగును. మన ప్రభుత్వము యొక్క జాతీయరకముల పరిశీలన సంఘమును (National Sample Survey) ఇచట తప్పక పేర్కొనవలయును. అది సంఖ్యాశాస్త్ర సంస్థ (Indian Statistical Institute) వారి ఉపదేశానుసారము నడప బడుచున్నది. ప్రతి నాలుగు నెలల కాలములో రమారమి వేయి గ్రామములలో కొలది గృహములనుమాత్రమే పరిశీలించి, వివరములను సేకరించుచు మన దేశము యొక్క సాంఘిక ఆర్థిక_వ్యవస్థలపైని జన పరిస్థితులపైని వ్యాఖ్యా నించుటకు పూను సంస్థలలో అదియే మొట్టమొదటిది. ఇట్లు విస్తర వైశాల్యమును, సంగ్రహణ పునఃపున రా వృత్తిని, శీఘ్ర క్రోడీక రణమును' ఏ సమగ్రగణన విధాన మందయినను ఊహింప నలవి కావు. 3. పరిశ్రమలు: సంఖ్యాశాస్త్ర విధానము 'ప్రత్యర ముగా ప్రయోగింపబడు క్షేత్రములలో పరిశ్రమ ఒకటి. పరిశ్రమావశ్యకములను తీర్చుటకే కొన్ని ప్రత్యేక సంఖ్యాశాస్త్ర విధానములు వర్ధిల్లినవి. అట్టి పద్ధతులలో (1) వస్తున్వరూప నియమనమును (Statistical Quality Control or S. Q. C.) విధించుట (2) రకములను పరిశీలించు ప్రణాళికలు (Sampling Inspection Plans) అనునవి. దీనిలో మొదటిదుగు S.O.C. అమెరికా లోని బెల్ టెలిఫోన్ ప్రయోగశాలలో డబ్ల్యు. ఎ. 25 193 అనువర్తిత సంఖ్యాశాస్త్రము షివర్ట్ (W.A. Shewart) అను శాస్త్రజ్ఞునిచే ప్రవేశ పెట్టబడినది. దాని సంభావ్యశక్తుల పరిమితి పరిశోధ నములచే కనుగొనబడినది. పరిశ్రమలలో 20వ శతాబ్ద మున కనుగొనబడిన ప్రముఖ పరిశోధనముగా అది వరి గణింపబడుచున్నది. అది అవిచ్ఛిన్నమైన ఉత్పాదన మున వస్తుగుణములో గల సహజములైన మార్పులను గుర్తించుచు, ఉత్పత్తి సాగుచుండగా గుణపరి మాణములో జరుగు పరివర్తనములను పటరూపమగు విధానము ద్వారమున నిరూపించును. ఉత్పాదనమున అంతరాయము ఎచ్చట నున్నదో కనుగొని సరియగు పద్ధతి నవలంబించుటకు అది సూచనలు చేయును. ప్రస్తుత ఉపకరణములతో పని సాగుచుండగా కలుగు మార్పులను గుర్తించి సవరించు ఈ S. Q.C. విధానమే లేకున్న పరిశ్రమ ప్రచోదకులు పెక్కు సవరణలు చేసి తన్మూలమున విరామకాలమున గలుగు ఉత్పత్తి నష్టము ననుభ వించుటయో, కొద్ది సవరణలే జేసి ఎక్కువగా శాతము చెడు వస్తువుల ఉత్పత్తిచేయుటయో సంభవించి యుండెడిది. మన దేశ పరిశ్రమలలో ఇప్పుడు S.Q.C. ఎక్కువగా వాడబడుచున్నది. మూలధన వ్యయము లేక, ఉత్పత్తిని పెంచు జాతీయ మూలద్రవ్యముగా ఇది పరిగణింప బడుచున్నది. సంఖ్యాశాస్త్రజ్ఞుని స్వరూప చిత్రములో గ్రుడ్డి నమ్మక ముంచుటయే ఈ మూల ద్రవ్యము ! • ఇక రెండవది యగు వస్తు పరిశీలన ప్రణాళికలను మొదట ప్రవేశ పెట్టినవారు డాడ్జ్ (Dodge), రోమింగ్ (Romig) అనువారలు. వీటిని అభివృద్ధికి తెచ్చినవాడు అమెరికా యందలి అబ్రహామ్ వాల్డ్ (Abraham Wald) అనునతడు. ఇది సమకూర్పబడు వస్తువుల పరిశీలన మున కగు వ్యయమును సాధ్యమయినంత తక్కువ జేయును. ఉత్పత్తిచేయబడిన మొత్తము వస్తువుల గుణపరీక్ష కొన్ని వస్తువుల పరీక్ష చేతనే తెలుపబడును. 4. జీవశాస్త్రము: నవీన సంఖ్యాశాస్త్ర విధానములు అనేకములు జీవశాస్త్రమున ప్రయోగించుటకే వెలువడి నవి. రకముల కొలతలలోని మార్పులను గమనించుటకు ఈ శాస్త్రవిధానములుఅవసరమని జీవశాస్త్రజ్ఞులు అభిప్రాయ పడిరి. వారు డార్విన్, గాల్టన్ మహానీయుల భావనా