Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనువర్తిత సంఖ్యాశాస్త్రము ఈ శాస్త్ర మెట్లు వివిధ క్షేత్రములందు అనువర్తి తమై ముఖ్యస్థానము నాక్రమించెనో తెలిసికొనకున్న చో దాని చరిత్ర అసంపూర్ణమగును. " ఈ శాస్త్రము ఇరువదవ శతాబము న కు ప్రత్యేకత నొసగిన మానవాభ్యుదయ విధానమందలి వింత అంశమనియు, ఈ యుగము తన వ్యాపారము అందలి ప్రధాన విషయములకై అనువర్తిత సంఖ్యా శాస్త్రజ్ఞుల వంక కే పరిశ్రమలు అని. భారీ పరిశ్రమలకు అత్యధిక వ్యయము అవసరము ; అవి కొలదిమందికే పనిని కల్పించును. కాని అవి దేశ శ్రేయస్సునకు దేశ పరిశ్రమలు భవిష్యదభివృద్ధి కిని ముఖ్యములు. కుటీర పరిశ్రమలు వీనికంటే భిన్నములు అవి మిత మైన మూలధనముతో అనేకులకు ఉద్యోగములను కల్పించును. కాని వాని ఫలాదాయము తక్కువ. ఉపయోగ్య వస్తు యంత్రాగారములు మధ్యతరగతికి రెండవ పంచవర్ష ప్రణాళికలో అంచనా వేయబడినట్లు పది ఏండ్లలో నిరుద్యోగమును నిర్మూ లించుట, ఇరువది ఏండ్లలో జాతీయాదాయమును ద్విగుణీకరించుట అను లక్ష్యములు సిద్ధింప వలెనన్నచో, పై పరిశ్రమల ప్రతి విభాగమునందును ఒక్కొక్కని నియమించుటకు కావలసిన మూలధనమును, ఆ ధనము నుండి రాబోవు ఆదాయమును తెలిసికొన్నచో, వివిధ రంగములకు కావలసిన మొత్తము పెట్టుబడి ధనమును సులభముగా గణించనగును. పి. సి. మహలనోబిస్ చెందినవి. తిరుగుననియు, ప్ర తి ప్ర ము ఖ ప్రయత్నమునకు వారే సూత్రధారులనియు, అతి ముఖ్య మైన శాస్త్ర ప రిశోధ న ము ల లో ప్రయోగ కార్య క్రమములను లేక పరిశీలన విధానములను ఏర్పరచి నిర్ణయించుటకును, ఫలితములను విభ జించుటకును, నిదర్శనములకు విలువకట్టుటకును, విశదము కాని దానిని స్పష్టీకరింపబడిన దానినుండి వేరుచేయుటకును సమర్థులు ఈ అనువర్తిత సంఖ్యాశాస్త్రజ్ఞులే” యనియు ఈ శాస్త్ర ప్రతిష్ఠాపకులలో ఒక డైన ఫిషర్ అను నాతడు అభిప్రాయ పడుచున్నాడు. మనమిప్పుడు ఈ శాస్త్రమును ఉపయోగించు కొన్ని రంగములను పరిశీలింతము. 1. జాతీయ వ్యవహారములు - సంఖ్యాశాస్త్రము : ప్రజల యొక్క యోగ మసాధన మే దేశము యొక్క లక్ష్యము. సాధారణ మానవుని యొక్క ఆరోగ్యానంద శ్రేయస్సులను వృద్ధిచేయు టెట్లు? దీనికి దేశమునందున్న వివిధ ద్రవ్యములను సమర్థతతో నుపయోగించుకొనుటకు ఒక చక్కని పద్ధతిని ప్రణాళికను ఏర్పరచుట అవసరము. సంఖ్యాశాస్త్రము, పై విధానమును నిర్మించుటకు మార్గము నుపదేశించుచు, దాని ఆచరణమును స్వాధీనము నందుంచుకొనుటకు సాధనముగా నుపయోగించును. వర్త మాన వ్యవహారముల పరిశీలనానంతరమే ప్రణాళిక పరిణామమును చెందును. రెండవ పంచవర్ష ప్రణాళికలో, మన ప్రభుత్వ మాశించునట్లు కు టీ ర ప రిశ్ర మ ల ను ప్రోత్సహించు చెట్లు? సరియైన లెక్కల నమర్చి లక్ష్యములను నిర్ణయించినచో ఈ ప్రశ్నకు సమాధానము సులభ మేయగును. వివిధ మూలధనములను మూడు భాగములుగా విభజించనగును. (1) భారీ పరిశ్రమలు (2) ఉపయోగ్య వస్తు యంత్రాగారములు (8) కుటీర 192 (P. C. Mahalanobis) గారి గణన ప్రకారము ప్రారంభ మున మనము మన దృష్టిని ఎక్కువగా భారీ పరిశ్రమల యందును, కుటీర పరిశ్రమల యందును కేంద్రీకరించి వలసిన వారమగుచున్నాము. లెక్కలు లేకుండా ప్రణా ళికల నేర్పరచుట సక్రమమైన పద్ధతి కాదు. ప్రణాళికా నిర్వహణమునకు వివిధ వ్యాపారములతో సామరస్యముక లుగునట్లును, ఆటంకములు తొలగునట్లును జాగ్రత్త వహింపవలయును. అవసరముల పరిమాణమును మెలకువతో గణించి వివిధ రంగములకు కార్మికులను ఆహారమును, ముడిసరకులను తగిన విధమున సమకూర్ప వలయును. ఆ వేక్షించిన విధమున అభ్యుదయము చేకూర నిచో కారణములను విమర్శించి అవసరమైనచో ప్రణా ళికను మార్చవలయును. 2. స్థాలీపులాక న్యాయమున సమగ్ర విషయమును కనుగొనుట : ఒక ఋతువున ఏదియో యొక పంట పండు భూమి యొక్క వైశాల్యము, ఒక నగరమునగల వివిధ ధాన్యముల మొత్తమురోగసంభవము, నిరుద్యోగ వ్యాప్తి, జనుల సాంఘికాభ్యాసములు, వర్తమాన సమస్యలు మొదలగువాటిని గూర్చి ప్రజాభిప్రాయాదులను నిర్ణ యించుటకు సనుగ్రపరిశీలనము అవసరమని తలచెడివారు.