Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ధర మంత్రి ప్రోలరాజు కాలమునందు నగరపాలకుడై, రుద్ర దేవుని కాలమున మంత్రియై ప్రసిద్ధిగడించెను. ఇతడు అనుమకొండలో ప్రసన్న కేశవాలయము, రుద్రేశ్వరాల యము, పున్నేశ్వరాలయము, త్రిమూర్తుల ఆలయములు మొదలగునవి కట్టించెనని శాసనములలో గలదు. కాని ఇపు డవి గుర్తింపరాకుండ నాశనమైనవి. గోసగి ఈశ్వర దేవుడు వేయి స్తంభాలగుడిలో సహస్రలింగ ప్రతిష్ఠ చేసెనట. జగద్దేవుడు సర్వ మాండలిక రాజుల సహాయమున రెండవ ప్రోలరాజు కాలమున అనుమకొండను ముట్టడించి వరా జితుడయ్యెను. రామేశ్వర పండితుడు లకులేశ్వర మతము వాడు. ప్రోలరాజుచే సత్కారములొందిన గురువర్యుడు. హనుమకొండలో సుప్రసిద్ధమగు శివపురము ఆకాలమున నుండెను. రుద్రదేవుడు అనుమకొండలో గట్టించిన వేయి స్తంభముల గుడి మిగుల ప్రశస్తమైనది. మండపము వేరుగను, ఆలయము వేరుగను ఉన్నవి. ఈ రెంటికి మధ్య సజీవముగా నున్నటుల చెక్కబడిన నంది దర్శనీయము. అందలి శిల్ప నైపుణ్యము వర్ణనాతీతము. నందికి అభి ముఖముగా త్రికూటాలయము గలదు. అందు రుద్రేశ్వ రుడు, వాసుదేవుడు, సూర్యదేవుడు ముఖ్య దైవతములు. ద్వారముల పై దేవతామూర్తులను అంతరాళములు తొలిచి సుందరముగా చెక్కించినారు. కాకతీయ శిల్పమునకు పరమావధియగు నీ ద్వారా శిల్ప మద్భుతమైనది. కాకతి రుద్రదేవు డీ యాలయమును లోకోత్తరముగ శా. శ. 1084 చిత్రభాను సంవత్సర మాఘ శుద్ధ పంచమినాడు (క్రీ. శ. 1162) నిర్మింపించెను. ఆలయ నిర్మాణానంతరము ఓరుగల్లును రాజధానిగా చేసికొనెను. ఓరుగల్లు కాకతీయుల రాజధానిగ జేసికొనబడి నప్పటి నుండి అది మహానగరముగా మారినది. అట్లని, నాడు అనుమకొండను చిన్న చూపు జూడ లేదు. రాజ పరి వారము, రాజులు, విద్వాంసులు హనుమకొండ నుండి ఓరుగల్లునకు రాకపోకలు చేయువారు. రెంటికిని అవినా భావ సంబంధముండెడిది. ప్రస్తుత కాలమున అనుమకొండ గొప్ప వ్యాపార స్థలముగ ప్రశస్తవహించినది. లలితకళారాధకులు పలువు రచటగలరు, అనుమకొండ జిల్లా ముఖ్యస్థానము. ఉద్యోగు 187 అనువర్తిత గణితశాస్త్రము లందరు ఇట నుందురు. నైజాము దొరతనమున ఇది తెలంగాణమునకు సుబాయై వరలెను. సుబేదా రిట నుండు వాడు. బి. యే. వరకు గల మొదటితరగతి కళాశాలయు, జల బోధనాభ్యసన కళాశాలయు అనుమకొండలోనే ఉన్నవి. తెలంగాణమున రెండవ గ్రంథాలయమనదగిన రాజరాజ నరేంద్ర గ్రంథాలయము గలదు. ఇది సువర్ణోత్సవము జరుపు వయస్సున నున్నది. భద్రకాళి తటాకము సమృద్ధము. దాని క్రింద వరిపంట విస్తారము. ఆ చెరువు కట్టపై నున్న భద్రకాళీ దేవాలయము ప్రసిద్ధమైనది. ఆమె కాకతీయుల కులదేవత. శిథిలమైన ఈ ప్రశస్తదేవళమును పునః ప్రతిష్ఠచేసి, నగరవాసులు ఆ దేవతను భక్తిశ్రద్ధలతో పూజించుచున్నారు. ముప్పది యిద్దరు మంత్రులలో గణ నీయుడుగా విఠలమంత్రి శాసనము లిందు గలవు. వైష్ణవ మతోద్ధారకుని పేరిట గల శ్రీ రామానుజ దేవాలయము . ప్రశస్తమైనది, దక్షిణ దేశములో నున్నట్లు తీర్చిదిద్ద బడిన రామానుజుల విగ్రహము మిగుల ప్రాచీనమైనది. 'యతి పతీ హనుమద్గిరి రాజమందిరా' అను మకుటముగల శతక రాజ మీయనను గూర్చినదే. ఈ రాష్ట్రమును జూడవచ్చు కళాప్రియులు వేయి స్తంభముల గుడిలోని అద్భుత శిల్ప ములకు ముగ్ధులగుచుందురు. కాకతీయుల కీర్తిచిహ్నమగు నీ దేవళము ఆర్షశాఖవారి కృషి ఫలితముగా ఇప్పుడు దర్శనీయముగా నున్నది. ది. వి. ర. అనువర్తిత గణితశాస్త్రము :- గణితశాస్త్రమును రెండు భాగములుగా విభజింపవచ్చును. (1) శుద్ధ గణి తము, (2) అనువర్తిత గణితము. శుద్ధ గణితమున ఒక సముదాయములోని రాసులు కొన్ని నిర్ణీత నిబంధనలకు లోబడినచో వానినుండి యుత్పన్నమగు ఫలితములను సాధింతుము, అనువర్తిత గణితమున నట్లుగాక ప్రయోగ సాత్యముచే లభ్యమగు ఫలితములను సాధించుటకు ఏ ప్రకృతిసూత్రము అవసరమో కనుగొందుము. మును మొదట శాస్త్ర పద్ధతిని సూర్యచంద్రాదుల చలన పరిశీలించినవాడు గెలీలియో (1584–1842) ఈతనికి ముందే కొందరు శాస్త్రజ్ఞులు సూర్యచంద్రాదుల కొంతవరకును కనుగొన యత్నించిరి. గమనమును కోపర్నికస్ (1473-1648) అను శాస్త్రజ్ఞుడు సూర్య