Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనుమకొండ మన ఇంద్రియవ్యాపారమునకు దానిపోకడ లెవ్వియు గోచరించుటలేదు. మానసికముగా జేయు ఊహాకల్పన ములు వా స్తవికతకు సంబంధములేని వని వారి నిశ్చయ సిద్ధాంతమై యున్నది. ఈ సిద్ధాంతము బలహీనమైనదని నిరూపించుట కష్టము కాదు. మనస్సు అనునది, నిర్గుణనిష్క్రియాత్మక రూపము గాదు. అది వస్తు సత్యాసత్య స్వరూపములను విచారించి, తెలిసికొను స్వయంప్రతిభగలదని తరు వాత వచ్చిన త త్త్వజ్ఞులు ఉద్ఘాటించియున్నారు. 803. వేం. అనుమకొండ : అనుమడు, కొండడు అను ఆట వికులవలన ఈ గ్రామమునకు 'అనుమకొండ' యు పేరేర్పడెననియు, అనుమడు హనుమకొండను ఏర్పరచె ననియు, కొండడు కొండిపర్తి గట్టెననియు స్థానిక చరిత్ర మున గలదు. ప్రాచీన శాసనములలో అమ్మకొండ, అనుమకుండాపురము, అనుమకొండ అను రూపాంతర ములు గలవు. హనుమంతుడుగల కొండయగుటచే హనుమ కొండయను నామ మేర్పడియుండుననియు, హనుమద్గిరి సంస్కృతరూపము దాని కేర్పడెననియు, ప్రతాపరుద్రీయ మున విద్యానాథుడు దానినే హనుమదచలమని వ్యవహ రించెననియు కొందరి అభిప్రాయము. అనుమకొండ ప్రాచీననగరములలో నొక్కటి. పురబాహ్యమునందు (హంటరురోడ్డు చెంత) రాకాసిగుండ్లు అను అనార్యుల సమాధులు (cairns) కలవు. వాటి విస్తృతినిబట్టి అవి 6000 సంవత్సరములనాటి వని పరిశోధకులు నిర్ణ యించిరి. స్థానిక చరిత్రములలో 14 మంది రాజులు పాలించిన పిమ్మట త్రిభువనమల్లుడు (రెండవ బేతరాజు) రాజయ్యెనని కలదు. అచటినుండి కాకతీయవంళ క్రమము అందు గలదు. అచట పాలించిన 14 మంది రాజులు చరిత్రమున కనుపట్టరు. నందుడు, సోమరాజు, మాధవ వర్మ - వీరి చరిత్ర లెంతవరకు నిజమో! నందుడు నంద - గిరి వెల కొల్పి పాలించెననియు, సోమరాజు కటక వల్లభు నితో పోరాటమున మరణింపగా, గర్భవతిగ నున్న అతని భార్య సిరియాలదేవి అనుమకొండలో మాధవశర్మ ఆశ్రయమున సురక్షితగ నుండి కుమారుని గని ఆ బాలు నకు మాధవవర్మ యని నామకరణము చేసెననియు, 186 మాధవవర్మ పెద్దవాడై పద్మాక్షి దేవి అనుగ్రహమును బడసి, పితృరాజ్యమునంతయు నాక్రమించెననియు స్థానిక చరిత్రలందు కలదు. మాధవవర్మ కొన్ని రాజకుటుంబ ములకు మూలపురుషుడుగ కన్పడుచున్నాడు. Q హనుమ అమోఘవర్షుడను రాష్ట్రకూట రాజు కొండలో తొమ్మిదవ శతాబ్దమున చాళుక్య భీమరుసును ప్రతినిధిగా నుంచెను. మొదటి కాకతి ప్రోలరాజు త్రైలోక్య మల్లుడను కల్యాణి చాళుక్యునిచే పదునొకండవ శతాబ్ద మున అనుమకొండ విషయమునకు అధీశ్వరుడుగ చేయ బడెను. ఈ మొదటి ప్రోలరాజు తండ్రి మహావీరుడై, కాకతి పురాధినాథుడయ్యెను. అతనినే మొదటి బేత రాజుగ వ్యవహరింతురు. మొదటి ప్రోలరాజు కొడుకు రెండవ బేతరాజు. ఇతని కుమారుడు రెండవ ప్రోలరాజు. అనుమకొండలో మూడు కొండలను గలిపి ఎత్తైన మట్టి కట్టబోసి కోట నిర్మింపబడినది. కొండలపై దృఢముగా రాతికోట కట్టబడినది. కొండలపై దిగంబర జైనమూర్తులు కలవు. జైనమత మిచ్చట వ్యాప్తమైనది. పద్మాక్షి యను దేవతయు సిద్ధేశ్వరుడును కోటలోనున్నారు. వీరును జైనదేవతలే. ఇప్పుడు వైదిక దేవతలుగ మారిరి. సిద్ధేశ్వ రాలయము చెంతగల కొండపై అనుమకొండ రాజ ధానిగ నుండి సమస్త సౌభాగ్యముల కాటపట్టుగ నుండెననుచు అతి విస్తృతమైన యొక శాసనము చెక్కుటకు ప్రారం భింపబడి మధ్య ఆపబడినది. చాళుక్యులును, కాకతీయు లును దీనిని రాజధానిగా రూపు రేఖలు దిద్దిరి. జైన మందిరములకు, శివాలయములకు, శివలింగములకు లెక్క లేదు. భూగర్భమున నెన్ని యో దేవళములున్నవి. గోడ లకు పునాదులు తీయునపుడు ఆలయములు, ఇటుక రాళ్ల వరుసలు, విగ్రహములు, కోనేరులు, బావులు కనవచ్చును. విరుగగొట్టబడిన దేవతామూర్తులకు లెక్కయే లేదు. మొదట జైనమతము, తరువాత శైవమతము రాజాద రణమును బడసినవి. ఈ రెండు మతముల సంఘటనము గూడ జరిగిన దిక్కడనే. ఆవిస్తృత కథలు జ్ఞాపకము జేయు చిహ్నములు లిఖితరూపముగ, విగ్రహరూపముగ క్కలు గలవు. అనుమకొండలో బాలసముద్రము, భ ద్ర కాళి చెరువు, సిద్ధసాగరములు పేరు చెందిన తటాకములు. గంగా