Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పుటలందు ప్రచురింపబడినది. మహాసాధ్వియగు నీమె సంవత్సరమున దేవబ్రాహ్మణ క్షేత్రముల 1423 3 మీద పన్నును రద్దు కావించెను. ఈ విధముగా నీమె రాణియై, అల్లాడ వీరభద్రా రెడ్డికి దేవియై, దేవబ్రాహ్మణ భక్తయై, సాధుశీలయై, అనేక భూరి దానముల గావించి చిరస్మరణీయ అయ్యెను. పి. య. రె. అనుభవమూలవాదము (Empiricism): ఈ అను భవమూలవాదము పశ్చిమఖండమున 17,18 శతాబ్దము లలో వ్యాప్తి నంది గొప్ప సారస్వతమును సృజించినది. బేకను పండితుడు దీనికి మూలస్థావనాచార్యుడు. తరువాత విఖ్యాతిగాంచిన బెంథామ్, లాకే, హ్యూమ్, జాన్ మిల్, జాన్ స్టూవర్టు మిల్ మున్నగువారు దీనిని బహురూపముల పోషించి, సమర్థించి, ప్రచారముగావించినారు. ఈ వాదము ఉద్భవించుటకు తగిన కారణములు లేకపోలేదు. పూర్వశతాబ్దములలో మతాచార్యప్రోక్తము లైన సిద్ధాంతములను అంధవిశ్వాసముతో స్వీకరించుట ప్రజాసమూహమునకు అభ్యాసమైనది. మతప్రచారకులైన గురువర్గము ఈ యంధవిశ్వాసములనే ప్రోత్సహించి, హేతువాదమునకు ఎట్టి యవ కాళమును లేకుండ చేసిరి. ప్రకృతిశాస్త్రరవికిరణము అప్పుడే విజ్ఞాన ప్రపంచమున ప్రసరించుటకు ఆరంభించి, హేతువాదాంకురములను జనింపజేసెను. నిర్హేతుకముగా ఏదియు విశ్వసింపరాదను ఈ వాదవిధానము అన్ని రంగములలో ప్రవేశించినది. రాజకీయరంగమున ఈవాద ఫలితముగా ప్రజాప్రభుత్వ భావములు · సాంఘిక రంగమున సర్వమానవ సమానత్వ భావములు, మతరంగమున నాస్తిక, నాస్తిక సమ సంశయ వాదములు రేకెత్తినవి. ఈ అనుభవమూలవాదత త్వమునందలి ముఖ్యభావ ములు ఏవనగా, 1. మనస్సు అనునది నిర్గుణమైన ఒక రూపము. దానికి స్వయంప్రకాశకత్వమువలన గలుగు స్వయంనిర్ణయశ క్తి లేదు. మనస్సు స్వయముగా చేయునవి అన్నియును ఊహాజన్యములైన కల్పనములే. వాటికి వా స్తవిక జగత్తులో నుండి తెచ్చుకొనిన ఆధారము లేదు. జగత్తులోనుండి 2. మనకు లభించునవి బాహ్యజగత్తులోని వస్తువులవలన ఇంద్రియములకు గలుగు వేదనములుమాత్ర మే 24 . అనుభవమూ అవాదము (Impressions). ఈ వేవనముల మూలమున వస్తువుల ఆకృతులు మన మనస్సునందు ముద్రితము లగుచున్నవి. ఈ వ్యక్తులను, వస్తువులను గూర్చిన భావములు క్షణ క్షణమునకు జనించి, అంతరించుచున్నవి. ఇవి యొకదాని వెనుక నొకటి కన్పట్టుచున్న వేగాని, వీటి కన్యోన్య సంబంధ మెట్టిదో మనకు తెలియదు. కొన్ని తాటస్థ్యములు కలసి, తిరిగి తిరిగి సంభవించుచుండుటచే, అవి పరస్పర సంబంధ యగుటచేతనే అట్లు తటస్థించుచున్న పని 185 ములుగలవి I యూహించు మానసిక భావమునకు ఆధారము లేదు. లోకములో కొన్ని సందర్భములు తిరిగి తిరిగి ఆదేరీతిగా సంభవించుట కే " సాహచర్యసిద్ధాంత " (Association. ism) మని పేరిడిరి. వస్తువుల బాహ్యాకృతియేగాని, వాటి యాంతరంగిక స్వరూపముగాని, వాటి అన్యోన్య సంబంధ సూత్రముగాని, మన ఇంద్రియములకు వేదనములరూప్ ములో లభించుటలేదు. వీటినిగూర్చి మనస్సు చేయు కల్ప నములు వాస్తవికాధారశూన్యములు. ఈ సిద్ధాంతముననుసరించి, మతసూత్రములన్ని యు మనః కల్పితములైన మానసికాహ్లాదము నొసంగు నిరా ధారభావములే. కాని, నిజప్రపంచమునకు సంబంధించిన వని రుజువుచేయుట కాధారములేదని ఈ అనుభవమూల వాద త త్త్వజ్ఞుల నిశ్చయము. అదేవిధముగా నైతిక సూత్రము (The Moral Law) శాశ్వతమైన పరమప్రమాణము కాదు. ఆయా కాలముల యందు సమాజాభ్యుదయమునకు అవసరములని తోచిన కొన్ని నియమములను నాటి మేధావులు కల్పించి, ఇవి నీతిధర్మము లనిరి. దేశకాల పాత్రములలోని మార్పులను తదాచరణ విధానమును బట్టి నీతిసూత్రావళియు, పరివ ర్తనమందుచు వచ్చెనని చరిత్ర మనకు చెప్పుచున్నది. ఈ కారణముచే ఈ అనుభవమూలవాదులు ప్రయోజన సిద్ధాంతమును (Utilitarianism) సమర్థించిరి విశ్వసించుచున్న మతసిద్ధాంతములు, నీతిసూత్రములు, సామాజిక నియమములు, రాజకీయ శానవాదులు, అన్నియు ఆయా దేశకాల జనావసరములైన కల్పవములే యనియు, వాటికి పరమప్రామాణ్యమును అంటగట్ట జూచుట హేతువిరుద్ధమనియు వీరి వాదమై యున్నది. పరమార్థము లేక పరమసత్యమున్న నుండవచ్చును. కాని మనము