Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనితల్లి అ అనేకశాసనములు ప్రమాణములు. “బహు సహస్రసువర్ణ దానసంతోషితమహాకవీశ్వరు" డనియు "బ్రహ్మాండదాన, కల్పతరుదాన, గోసహస్రదానవరు" డనియు ఈతనిని ప్రజలు విస్తారముగ కీర్తించియున్నారు. శ్రీశైలకుమా రాచల పంచారామములందు తనగోత్రనామములతో నిత్యనై వేద్యములకు ఇతడు ఏర్పాట్లుచేసెను. "కాశిలో శ్రీ విశ్వేశ్వరునకును, సింహాచలమునందు విష్ణువునకును కైంకర్యార్థమై తుల్యభక్తితో ఇతడు భూదానాదికము లను కావించెను. వీరాన్న వేమనృపతి అని పేరుగాంచిన ఇతడు కుల క్రమాగతులయి రాజనీతినిపుణులైన మంత్రి దండనాథుల సహాయముతో క్రీ. శ. 1884 నుండి 1886 వరకు అఖండ వైభవముతో రాజ్యమేలి యుద్ధమునందు వీర స్వర్గము నలంకరించెను. ఆ పి. య. రె. అనితల్లి : కాకతీయ సామ్రాజ్య పతనానంతరము యవనఫ్లావితమైన ఆంధ్రావనియందు, ఆంధ్రసంస్కృతిని తిరిగి కొంతకాలము విలక్షణముగ నిలువగలిగిన వారిలో రెడ్డిరాజు లొకరు. ఈ రెడ్డిరాజ్యయుగమునందు ఆర్య ధర్మములను పోషించినవారు ప్రభువులగు రెడ్డివీరులే. రెడ్డి వీరుల రాణులు సయితము ధర్మసంస్కృతి సంస్థాపన యందు భాగస్వామినులై పేరొందిరి. వీరిలో పెద్దకోమటి వేమారెడ్డి భార్యయగు సూరాంబయును వేమాంబిక, మల్లాంబ, అనితల్లి అనువారలు పేర్కొనదగినవారు. అని తల్లి అల్లాడ వీరభద్రారెడ్డి రాణి. ఈమె పుణ్య గుణాభి రామ యని కీర్తి కాంచినది. సాహిత్యశౌర్య సంపద్రాశి యగు కాటకు వేమా రెడ్డికిని, కుమారగిరి రెడ్డి సోదరి యగు దొడ్డాంబికకును కూతురు. కాటయవేమునకు రాజ్యము పత్ర్యముగా సంక్రమించినది కాదు. అది భార్యయగు దొడ్డాంబిక మూలమున అరణముగ లభిం చెను. కావున ఆ రాజ్యము అనితల్లికిని ఆమెమూలమున ఆమెభ ర్త యగు అల్లాడ వీరభద్రా రెడ్డికిని సంక్రమించినది. మహాకవి శ్రీనాథ విరచితమగు కాశీఖండమునందు ఈమె సా దిందిరా దేవతగ కీర్తింపబడినది. "అనితల్లి స్వనితామతల్లి నుదయాస్తాద్రీంద్ర సీమావనీ, ఘనసామ్రాజ్య సమర్థనా ప్రతిమ పాఠాదింది రా దేవతన్" 184 సచ్చరిత్ర యగు ఈ అనితల్లి ధర్మానుర క్తయై అనేక ములగు వితరణములను గావించెను. అందు ముఖ్యముగ పేర్కొనదగినది 'కలువచెరువు' అను గ్రామదానము. ఈమె కలువచెరువు అను గ్రామమును పరహిత చార్యుడు అను పరహితపరాయణుడగు వైద్యవ రేణ్యునకు క్రీ. శ. 1345వ సంవత్సరమున శ్రావణ బహుళ అష్టమీదినమున దానముగావించి వైద్యవృత్తిని పోషించెను. ఈ దాన సందర్భమున వ్రాయబడిన శాసన మే నేడు చారిత్రక ముగ ప్రసిద్ధివహించినది. ఈ శాసనము బయలు వెడలు టకు పూర్వము రెడ్డిరాజులందు, మీదుమిక్కిలి రాజ మహేంద్రవర రెడ్డిప్రభువులను గూర్చి కొంత పొరబడుట సంభవించెను. కా ఈ శాసనమువలన రాజమహేంద్రవరమును పాలిం చిన ప్రథమ ప్రభువు అల్లాడ రెడ్డి కా డనియు, వేముడే అనియు తేటపడుచున్నది. కాటయ వేముని యొక్కయు అతని కుమారుడగుకుమారగిరి యొక్కయు మరణానంతరము దేశము "కున్నవతి జలరాశి మగ్నము" కాగా, కాటయవేముని బంధువగు అల్లాడ రెడ్డి రాజ్యము నుద్ధరించి, కాటయవేముని కూతురగు అనితల్లికి పట్టము కట్టినట్లు తెలియుచున్నది. అనితల్లి కలువచేఱు శాసనమువల్లనే ప్రతాపరుద్రుడు విధివశమున బందీకృతుడై ఢిల్లీకి తీసికొనిపోబడక పూర్వమే సోమోద్భవ యగు నర్మదానదియందు స్వచ్ఛంద మరణ మును పొందెనని తెలియుచున్నది. స్వేచ్ఛతో మరణించిన కాకతి ప్రతాపరుద్ర చక్రవర్తి తరువాత త్రిలింగభూమి యవనమయమైన ధనియు, మహాజలమునందు మునిగిన భూమి నుద్ధరించిన ఆదివరాహమూర్తివలె ప్రోలయ నాయకుడు యవనోదస్థమగు భూమిని పై కెత్తి ప్రతిష్ఠించే ననియు తెలియుచున్నది. ఇతనితరువాత ఇతని పినతండ్రి కుమారుడగు కావయనాయకుడు ప్రభుత్వము నెరపినట్లు కానవచ్చును. ఇతని ఆధిపత్యము క్రింద 72 మంది నాయకులు సేవలొనర్చుచుండిరి. ఈ అనితల్లి కలువచేఱు శాసనము, గోదావరిమండల మున నున్న కాకినాడ తాలూకాయందలి ఆర్యావతమను (ఆర్యవటము) గ్రామమునందు లభించినది. ఆది ఆంధ్ర సాహిత్యపరిషత్పత్రిక 4వ సంపుటము యొక్క 88_112