Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భాగాంతమున ఈ జిల్లాలో ప్రవేశించి, హిందూపురము, పెనుగొండ, ధర్మవరము అను తావుల పడమటి భాగముల ననుసరించి ఉత్తరముగా ప్రవహించును. తరువాత ఇది అనంతపురము తాలూకా పడమటి సరిహద్దున ప్రవహిం చుచు, తూర్పునకు మరలి, గుత్తి, అనంతపురముల మధ్య నుండి త్రోవ చేసికొని, తాడిపత్రి తాలూకా గుండ పోవును. తరువాత ఇది కడప, నెల్లూరు జిల్లాలగుండ పోయి చివరకు బంగాళాఖాతములో పడును. హిందూపురము తాలూకాలోని ఊటుకూరు దగ్గర ఉపనదియగు జయమంగళి దీనితో కలియును. ఈ జిల్లాలో పేర్కొనదగిన మరొక నది చిత్రావతి. పెన్నానదివలెనే ఇది మైసూరురాష్ట్రములోని నంది దుర్గమునకు ఉత్తరమున నున్న హరిహరేశ్వర గుట్టలో జ. ఇది హిందూపురము తాలూకా తూర్పు ప్రాంతమున అనంతపురము జిల్లాలో ప్రవేశించును, హిందూపురము తాలూకాగుండ ఉత్తరముగా ప్రవ హించి, ఇది పెనుకొండ తాలూకాలోని బుక్కపట్ట ణము చెరువులో పడును. అచ్చటినుండి మిగులు పరీ వాహముగా (Surplus) బయలుదేరి ధర్మవరము తాలూకాగుండ ఉ త్తరముగా ప్రవహించి, ధర్మవరము చెరువులో పడును. తిరిగి మిగులు పరీవాహముగా అచ్చటినుండి బయలు దేరును. తరువాత అది ధర్మవరము తాలూ కాగుండ తాడిపత్రి తాలూ కాద క్షిణపుమూలగుండ ఈశాన్యముగాపోయి ఈ జిల్లాను వదిలి కడప జిల్లాలో జిల్లానువదిలి పెన్నానదిలో కలియును. హిందూపురము తాలూకాలోని కుళాపతి యను నది చిత్రావతీనదికి ఉపనదియై యున్నది. నాగసముద్రము గుట్టలలో దక్షిణ దిశాంత భాగమున తడక లేరు జనించి, అనంతపురము జిల్లాలోని సింగనమాల చెరువులోనికి ప్రవహించి, తరువాత పెన్నానదితో సంగ మించును. పండెమేరు నది అనంతపురము చెరువునకు నీటివసతిని కల్పించును. అచటినుండి మిగులునీరుగా బయలు దేరి తడక లేరుతో కలియును. స్వర్ణముఖీ నది మడకసిరా తాలూకాలోనిది. ఇది మైసూరురాష్ట్రములోని హగరీనదిలో, కలియును. 175 అనంతపురము జిల్లా మద్దిలేరునది కదిరితాలూకాలో ఉత్తరముగా ప్రవ హించుచు చిత్రావతితో కలియును. పాపఘ్నీనది కదిరి తాలూకాలోని మరియొక నది. అడవులు: ఈ జిల్లాలో 698.84 చదరపు మైళ్ళ అరణ్యప్రాంతము కలదు. పెనుకొండ తాలూకాలోని రక్షితారణ్యమున వంటచెరకు, వెదురు మున్నగువాటి ఫలసాయము లభించును. కదిరితాలూకాలోని రక్షితా రణ్యములో ముండ్లచెట్లజాతులు కలవు. హిందూపుర ము తాలూకాలోని రక్షితారణ్యసంపద ఇతర తాలూకాలోని సంపదకంటె మెరుగయినట్టిది. శీతోష్ణము - వర్షపాతము : మార్చి, ఏప్రియల్ మే నెలలు అత్యుష్ణముగా నుండును. నైరృతి మేమవాయు వులు (monsoon) వీచుట సాగగానే జూన్ నుండి డిసెంబరు వరకు ఉష్ణోగ్రత (Temperature) క్రమముగా పడిపోవును. ఎండకాలమునందలి మూడు నెలలు అసౌఖ్య కరమైనట్టివి. నవంబరునుండి జనవరివరకు రాత్రులు ప్రభాత సమయములు మోదావహముగలు నుండును. ఈ జిల్లా మిక్కిలిగ పొడిప్రాంతమయి ఉన్నది. ఆంధ్రరాష్ట్రములో అత్యల్ప వర్షపాతముగల జిల్లా లలో నొకటిగా ఈ జిల్లాయున్నది. ఈ జిల్లాలో సగటున వర్షపాతము 20.12 అంగుళములు. తాలూకాలలోని ఉష్ణోగ్రతయందు ఎక్కువ భేదము లేదు. కాని మడకసిరా, హిందూపురము పెనుగొండ తాలూకాలు మిగుల ఎత్తైన ప్రాంతములగుటచే అవి కొంతవరకు చల్లనివాతావరణమును కలిగియుండును. నేలలు : నల్ల రేగడి, నల్లగరప (black loam), నల్ల యిసుక, ఎఱ్ఱమట్టి, ఎఱ్ఱగరవ (Red loam), ఎఱ్ఱయిసుక భూములు కలవు. నల్లరేగడి ఎక్కువ పంటవండుటలో శ్రేష్ఠమైనది. ఎఱ్ఱయిసుకధూమి అన్నింటికీన్న చెడ్డది. నీటిపారుదల: తాడిపత్రి తాలూకాలోని ఎల్లనూరు చెరువుతప్ప ఈ జిల్లాలో చెప్పుకొనతగిన నీటివనరులు లేవు. ఈ జిల్లాలోని నదులు మంచివానలు పడినప్పుడు మాత్రమే నీటిప్రవాహములు కలిగియుండి సంవత్సరమునం దధిక కాలము ఎండిపోవును. నదులకు ఆనకట్టలు సరిగా కట్ట బడలేదు. తాత్కాలికోపయోగమునకై ఇసుక కట్టలు వాటి కడ్డముగ. వేయుదురు. అడవిబాగులందు, చెరువు