Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనంతపురముజిల్లా పురుషులు 88467; స్త్రీలు 59862; గ్రామవాసులు 105245; పురవాసులు 18104. .

7. కదిరి తాలూకా విస్తీర్ణము 1157 చ. మై; గ్రామములు, 140: పురము 1; జనాభా 219,112; పురుషులు, 118115; స్త్రీలు 105897; గ్రామ వాసులు 198758; పురవాసులు 20354. 8. మడకసిర తాలూకా : విస్తీర్ణము 417 చ. మై; విస్తీర్ణము 417 చ. మై; గ్రామములు 55; పురము 1; జనాభా 120209; పురుషులు 61786; స్త్రీలు 58448; గ్రామవాసులు 118641; పురవాసులు 6568. 8. హిందూపురము తాలూకా : విస్తీర్ణము 480 చ. మై; గ్రామములు 76; పురము 1; జనాభా 158832 ; పురుషులు 79467: స్త్రీలు 78885; గ్రామవాసులు 128894; పురవాసులు 24488; భాషలు: మాట్లాడు ప్రజల సంఖ్య (1) తెలుగు, 10,78,789. (2) కన్నడము 1,82,660. (8) హిందూస్తాని 1.04,580. (4) లంబాడి 19,884. (5) తమిళము 11,004. (6) మరాఠి 7,282. (7) హిందీ 4,810. (8) తులుభాష (9) ఎరుకల భాష 2,828. (10) మలయాళము 2071. (11) ఇతరభాషలు 564. మొత్తము 18,81,558. Q 8,184, ఈజిల్లాలో నై సర్గిక ముగా మూడు విభాగములున్నవని చెప్పవచ్చును. అవియేవనగా: 1. విస్తృతముగా నల్ల రేగడి భూములు గల ఉత్తరమందలి గుత్తి, తాడిపత్రి తాలూకాలు. 2. మధ్యనున్న కల్యాణదుర్గము, ధర్మ వరము, పెనుగొండ, కదిరి తాలూకాలు. ఇవి జల శూన్యములు. చెట్లు లేని విశేష విస్తీర్ణముగల నిస్సా రపు ఎఱ్ఱమట్టి నేలలు. 8. మడక సిర, హిందుపురము తాలూకాలలోని ఎత్తైన సమప్రదేశము. ఇది మైసూరు పీఠభూమితో కలియుచు, జిల్లాలోని ఇతర తాలూకాల కంటే ఎక్కువ ఎత్తు కలిగియున్నది. జిల్లా పశ్చిమ భాగ మందున్న గుత్తి, కల్యాణదుర్గము అను తాలూకాల భాగములు పశ్చిమదిశగా వాలియుండును. గుత్తి, తాడి పత్రి తాలూకాల ఉత్తర భాగములు దక్షిణముఖముగా వాలి పెన్నానదిలోనికి జారును. ఇక జిల్లాలో శేషించిన భాగము దక్షిణమునుండి ఉత్తరమునకు వంగుచుండును. 174 విశాలమైదానములు రాతిగుట్టల మూలకముగా గట్టులు గను, పంక్తులుగను, గుంపులుగను చీలియుండును. సర్వతములు : ముచ్చుకోట గుట్టలు 35 మైళ్ళ నిడివి కలవి. కొన్ని చోట్ల 7 మైళ్ళవరకు వెడల్పుకలిగియున్నవి. ఇవి గు త్తిపట్టణపు ఉత్తరమునుండి తాడిపత్రి తాలూకా చివర దక్షిణపుమూలవరకు వ్యాపించియున్నవి. ఇవి తాడి పత్రి పడమటి కొన నానుకొని, గుత్తి, అనంతపురము తాలూకాలలోని తూర్పు సరిహద్దులను అనుసరించిపోవు చుండును. వీటిని తాడిపత్రి తాలూ కా నైరృతి మూల యందు చిత్రావతీ నది చీల్చును. గుత్తి తాలూకా పశ్చిమమునుండి ఇంకొక గుట్టల వరుస బయలుదేరును. ఇది గుత్తితాలూకా మధ్యనుండి 50 మైళ్ళవరకు దక్షిణముగా సాగి అనంతపురము, ధర్మ వరము తాలూకాలలోనికి పోవును. ఈ గుట్టల వరుసను నాగసముద్రపు గుట్టలందురు. ఈ గుట్టలవరుసలో ఎన్నో విరుగుడులు కలవు. ఇది దక్షిణమునకు పోవుకొలది ఎత్తు. పరిణామము తగ్గుచుండును. మల్లప్పకొండ గుట్టలవరుస ధర్మవరములో ప్రారంభ మయి మైసూరురాష్ట్రములోనికి పోవును. ఇది 8,088 అడుగుల ఎత్తుక లది. ఆ మడకసిరా తాలూకాలో మడకసిరా గుట్టలు తాలూకాను దక్షిణ, ఉత్తర భాగములుగా విడదీయును. దక్కను భూభాగమునకు విలక్షణమయిన విడి విడి గుట్టలు, శిలల గుంపులు కలవు. ఉదా: గుత్తిళైలము, కల్యాణదుర్గము చుట్టునున్న గుంపులును అనంతపురము తాలూకాలో సింగనమాలయు పేర్కొనదగినవి. తాడిపత్రి తాలూకా తూర్పుభాగమున కర్నూలుకు సంబంధించిన ఎఱ్ఱమల గుట్టల వరుస యొక్క నిన్న భాగములు కలవు. హిందూపురము, మడకసిరా అను తాలూకాలలో పుష్కలముగ తృణకాష్ఠ సమృద్ధికలదు. ఇక శేషించిన జిల్లా భాగమంతయు ఊసర క్షేత్రము. కొన్ని తోపులలోను లోయలలోను వ్యవసాయము వెదజల్లబడి యుండును. నదులు : ఈ జిల్లాలో పెన్నానది ముఖ్యమైనది, ఇది మైసూరురాష్ట్రములోని నందిదుర్గమునకు వాయవ్యమున చెన్న కేశవ గుట్టలలో ప్రభవించి, హిందూపురము దక్షిణ