Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనంతపురముజిల్లా గర్భమునందు, గుట్టల పార్శ్వపు లోయలందు, ఊట కాలువలు త్రవ్వుదురు. ఇట్లు ఏ కొలది భాగమో వ్యవ ఏ సాయము చేయుదురు. కొన్ని చిన్న చెరువులు కలవు. కాని పంటలు పండువరకు ఈ చెరువులను నింపవలసియుండును. ఈ చెరువులు కదిరి తాలూకాలో అనేకము లున్నవి. ఈజిల్లాలో కొన్ని నదీప్రవాహపూరితముగల తటాక ములు గలవు. అనంతపూరు తాలూ కాలోని సింగనమాల చెరువునకు తడక లేరు ఆధారము. పెనుగొండ తాలూకా లోని బుక్క పట్టణ చెరువునకును, ధర్మవరము తాలూకా లోని ధర్మవరము చెరువునకును చిత్రావతీనది ఆధారము. పెక్కు చెరువులు పూడిక పడిపోవుచుండును. బావులున్నవి గాని అవి వట్టి పోవుచుండును. నీటిపారుదల సౌకర్యములంతగా లేనందునను, రెండు మాన్సూనులకొనలు తాకెడు భౌగోళిక పరిస్థితిరూప మయిన దురదృష్టమువల్లను, నేల యొక్క నిస్సారపు గుణము జిల్లాయందర్ధభాగమును మించియుండుటచేతను. జిల్లాయంతయు వామపరిస్థితులకు గురియగుచుండును. ఎగువ పెన్నా ప్రాజక్టు, కుముదవతీ ప్రాజక్టు, భైరవాని తిప్ప ప్రాజక్టు నిర్మాణములు ప్రభుత్వమువారు చేపట్టి నందున నీటిపారుదల సౌకర్యములు కొంతవరకు బాగు పడవచ్చును. ఈ జిల్లాలో 2478 చిన్నరకపు నీటి వనరులు కలవు. వీటిక్రింద 91,258.27 య.ల ఆయకట్టు గలదు. 109 పెద్దరకపు నీటి వనరులు కలవు. వీటిక్రింద 52,887.76 య.ల ఆయకట్టుకలదు. వంటలు: వరి, చోళం, కుంబు, కొట్టి ఇవి ముఖ్య మయిన తిండిపంటలు. వరిగె, రాగి. సమై అనునవి స్వల్పముగా పండును. సెనగలు ఎక్కువగా సాగుచేయ బడును. వేరుసెనగ, ప్రత్తి - ఈ రెండును ముఖ్యమయిన వ్యాపారపుపంటలు. మడకసిరా, హిందూపూరు తాలూ కాలలో కొబ్బరితోటలు, పోక తోటలు కలవు. రహదారులు: బళ్ళారి, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలను కలుపుచు ఈ జిల్లాలో రహదారిబాటలు కలవు. రోడ్ల నిడివి 1,880 మైళ్ళు. ఇందు 108 మైళ్ళు జాతీయ రహదారి మార్గములు. 251 మైళ్ళు రాష్ట్రీయ మార్గ ములు, 548 మైళ్ళు జిల్లా పెద్ద బాటలు, 124 మైళ్ళు .176 ఇతర జిల్లా రోడ్లు, 275 మైళ్ళు గ్రామమార్గములు. 61 మైళ్ళు మ్యునిసిపల్ మార్గములు. ఈ రాజమార్గములలో పెక్కుమార్గములు కరవుకాలమందు ప్రజాపోషణార్థము నిర్మితమయినట్టివి. రైలు : ఈ జిల్లాలో 61 మైళ్ల పెద్దలైను రైలు మార్గము కలదు, 191 మైళ్ల చిన్న లైను మార్గము కలదు. కల్యాణదుర్గము తాలూకాలోను, మడకసిరా శాలూకాలోను రైలుమార్గములు లేవు. తపాలా : ఈ జిల్లాలో 14 తంతి తపాలా ఆఫీసులు కలవు. 5సబో పోస్టు ఆఫీసులు కలవు. 207 బ్రాంచి పోస్టాఫీసు లున్నవి. వైద్యము : ఈ జిల్లాలో 8 పెద్ద ఆసుపత్రులు, 11 చిన్న ఆసుపత్రులు కలవు. అనంతపురములోని ఆసుపత్రి అన్నిటి కంటె పెద్దది. ఇచ్చట 100 మంచాలు కలవు. ఈ ఆసు పత్రిలో " ఎక్సురే ” యంత్రము గలదు. కుష్ఠురోగ చికి త్సకు ఏర్పాటు చేయబడినది. " పానీయజలమునకు బావులే ముఖ్యాధారములు. అచ్చటచ్చట చెరువునీరు త్రాగుచుండుటకలదు. అనంత పురములో పరిశుద్ధముచేయబడిన జలము లభించును. 878 మంచినీటి బావులను ప్రభుత్వమువారు త్రవ్వించి నారు. జాతరలు : ఈ జిల్లాలో 37 యాత్రా స్థలములు, . 11 పశువుల సంతలు కలవు. బాలురు, విద్య : ఈ జిల్లాలో 892 సంస్థలు విద్యగరపునవి కలవు. వీటియందు 58,750 మంది 22,208 మంది బాలికలు విద్యనేర్చుచున్నారు. విద్యా సంస్థలలో కళాశాల 1; వృత్తి కళాశాల(ఇంజనీరింగు) 1; బాలుర హైస్కూళ్ళు 19: బాలికల హైస్కూలు 1; ఆంగ్లో – ఇండియన్ స్కూళ్ళు 2; శిక్షణ పాఠశాలలు 8; బాలుర మిడిల్ స్కూళ్ళు 3; బాలికలమిడిల్ స్కూళ్ళు 2; ఎలిమెంటరీ స్కూళ్లు 884; బేసికు స్కూళ్లు 8; వయోజన పాఠశాలలు 24 కలవు. కళాశాలలో 58 గురు బాలి కలుసు, హైస్కూలులో 898 గురు బాలికలును విద్య నభ్యసించుచున్నారు. - కుటీర పరిశ్రమలు : నూలు నేత, నూలు అద్దకము, ఉన్ని వడకుట, నేయుట, పట్టునేత, చావలల్లుట, నూనెగాను