Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అధికార వర్గము ఎఱ్ఱదారపు విధాన (Red Tapism) మనియు, హేళన చేయుదురు. మొత్తముమీద ఇటువంటి పద్ధతులవలన కాలయాపన, వ్యయప్రయాసలు, అసంతృప్తి, అలజడి పెరుగును. మేది ? అంత మొందించనిచో కర్తవ్యము : అధికారవర్గము వలన కొన్ని ప్రయో జనములును, కొన్ని అనర్థములును కలవని తెలిసికొంటిమి. అయితే ఆ వర్గము విషయమున అవలంబింపదగు విధాన అనర్థములను జూచి శ్రేయోరాజ్యస్థాపనము సులభము గాదు. ప్రయోజన ములను గాంచి దానిని విచ్చలవిడిగ వదలినచో ప్రజా స్వామ్యము సన్నగిల్లును. కావున దానిని అదుపునందుంచ దగును గాని అంత మొందింపరాదు; సంస్కరింపదగును గాని సంహరింపదగదు. అపుడు దానివలన ప్రయోజనము లను పొంది, ప్రమాదములనుండి తప్పించుకొనవచ్చును. సంస్కరించుటెట్లు ? ఉద్యోగులను నియమించునపుడు వారి సామర్థ్యము, శీలము, పరిగిణింపబడవలెను గాని, ఇతర విషయములు ( ఉదాహరణకు జాతి, మత, కుల భేదములు) పాటింపబడరాదు. న్యాయబుద్ధితో నియమింప వలెనుగాని ఆశ్రితపక్షపాతముగాని, బంధువత పాతము గాని పనికిరాదు. నియమించు అధికారము రాజ కీయ ముఠాలకుగాక చట్టబద్ధముగ వర్తించు "పబ్లిక్ సర్విస్ కమిషన్ల " కు అప్పగింపబడవలెను. ఉద్యోగుల నియామకము మాత్రముగాక, వారి ప్రమోషన్లు, సెలవు సౌకర్యములు, క్రమశిక్షణము మొదలైనవి గూడ పై కమిషన్ల పర్య వేక్షణముక్రిందనుండవలెను. మొత్తముమీద ఉద్యోగులు అనుభవించు సౌకర్యములకును, వారుచేయు సేవకును, వీలయినంతవరకు సామ్యముండుట మంచిది. సంతృప్తికరముగ వ్యవహరించు అధికారులకు ఉచిత మైన ప్రోత్సాహమును, అవినీతిపరులకు తగినశీతను ఇచ్చుచుండవలెను. అధికారులు, శాసన సభలు, మంత్రివర్గములు మొద లగు ప్రభుత్వాంగములందుండి పరిపాలనా విధానములను నిర్ణయించు ప్రజాప్రతినిధుల యెడల తగిన వినయవిధేయ తలతో వర్తించుట అవసరము. ప్రజాప్రతినిధులకు సరి యగు సలహాలనిచ్చి, వారి నిర్ణయములను సక్రమముగ అమలుజరువ యత్నింపవలెను. 172 సామాన్య ప్రజలపట్ల అధికారులు స్నేహ సానుభూతు లతో మెలగుట ఆవశ్యకము. తాము ప్రజల సేవకులమని గుర్తింపవలెను. ప్రజలను పీడించువారుగ మారగూడదు. అధికారులు శక్తితోబాటు సౌజన్యమును గూడ ప్రద ర్శించుట యుక్తము. అధికారుల ప్రజానాయకులతోను, ప్రజలతోను, సన్నిహిత మై నట్టియు సక్రమమైనట్టియు సంబంధము కుండుటకుగాను ముఖ్యముగ అవసరమైనది వికేంద్రీకృత వి పరిపాలనము (Decentralised administration). అనుభ వజ్ఞులు తెలిపినట్లు, కేంద్రీకృతపాలనము (Centralised administration) అధికారవర్గ విజృంభణమునకు దోహదమిచ్చును; వి కేంద్రీకృత పాలనము ఆ జాడ్యము నకు విరుగుడుగ పనిచేయును. కొంతవరకు శాసన ఇంతేగాక నేటి పరిస్థితులలో అధికారులు కార్యా చరణమునందు మాత్ర మేగాక నిర్మాణమునందును, న్యాయనిర్ణయమునందును గూడ పాల్గొనుట జరుగుచున్నది. ఇట్టిజోక్యమును సాధ్యమై నంతవరకు పరిమితము చేయుట ప్రజాస్వేచ్ఛకు శ్రేయ స్కరము. ముఖ్యముగ కార్యనిర్వాహక వర్గమునకు చెందిన ఉద్యోగులు చేయు న్యాయనిర్ణయ కార్యములను సందర్భమునుబట్టి న్యాయస్థానములందలి న్యాయాధి కారులు పరిశీలించుచుండుట క్షేమకరము. అధికారులు అన్నిటికన్నను మిన్నయైనది మానసిక మైన మార్పు. అనగా అధికారులందు సోదరమానవుల యెడ ప్రేమ, ప్రజా సేవయం దనుర క్తి, పరోపకారబుద్ధి, స్వార్థ త్యాగము మొదలగు సద్గుణములు పెంపొందవలెను. తమ అధికారమును దుర్వినియోగము చేయక, సద్వి నియోగము చేయుటకై దృఢ సంకల్పముగల్గి, యథా ళ క్తిగ పాటుపడవలెను. ఇట్టి ప్రయత్నమునందు ప్రజా నాయకులును, ప్రజలును గూడ వారికి అనుకూల పరి 'స్థితిని కల్పించి తోడ్పడవలయును. Q సారాంశము : అధికారవర్గ సమస్య రాజకీయ,

సాంఘిక, నైతిక, రంగములకు సంబంధించినది. అధికార వర్గము తమ అగ్ని వంటి శక్తిని అదుపునందుంచుకొనినచో, అది ప్రయోజనకరముగను, అదుపునందు లేకున్నచో, ప్రమాదకరముగను పరిణమించును. దానిని సక్రమముగ