Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జ్యము, విద్య, వైద్యము, వినోదము, నైతిక-ఆధ్యాత్మిక వికాసము మొదలగువాటికి సంబంధించినవి. ఈ కార్య ములను అభివృద్ధి చేసి వీటిని సామాన్య ప్రజలకు గూడ అందచేసి వారి జీవితమును సౌఖ్యప్రదము చేయవలసి యున్నది. మనదేశమున అమలు జరుగుచున్న పంచవర్ష ప్రణాళికలు ఇందు కేర్పడినవే. ఇటువంటి పథకములను సూచించుటకును, వాటిని ప్రజాప్రతినిధులతో గూడి యున్న ప్రభుత్వము ఆ మోదించిన తర్వాత అమలు జరుపు టకును సమర్థులగు ఉద్యోగులు సహాయ పడుదురు, ప్రభుత్వ కార్యాలయములందు పనిచేయు ఉద్యోగులతో పాటు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, ప్రచా రకులు, మొదలగు నిపుణుల తోడ్పాటు లేనిదే ప్రజాహిత కార్యములు సరిగ నెరవేరవు. ఇది ఇతర దేశములందు వలెనే మన దేశమునందు గూడ ఇపుడు గుర్తింపబడు చున్నది. ఉద్యోగులందరు తమతమ శ క్తిర క్తుల నన్నిటిని వినియోగించి ప్రభుత్వ పథకములు ప్రజా క్షేమమును పెంపొందించునట్లు పాటుబడుదురు. అందుకై తమకుగల ప్రత్యేక మైన పరిజ్ఞానమును, పాలనానుభవమును వినియో గింతురు. కార్యదీక్షను, కార్యదక్షతను ప్రదర్శింతురు. ప్రభుత్వమునకును, ప్రజానీకమునకును, మధ్యవర్తులుగ నుండి ఒకరి సహాయ సానుభూతులను మరొకరికి అంద చేయుదురు. అధికారవర్ధమువలన నష్టములు : అధికారవర్గపు పరిస్థితి విపరీత మైనపుడు దానివలన కొన్ని నష్టములు ఏర్పడును. అందుగమనింపదగినవి ఈ క్రింద పేర్కొనబడినవి : ఉద్యోగులు తమకు లభించిన ప్రత్యేక మైన అధికార శ క్తులను పురస్కరించుకొని అహంభావముతో విర్రవీగు దురు. ప్రజలు మంచి, చెడ్డలు తెలియని మూఢులనియు, తమచే పాలింపబడుటకు మాత్రమే అర్హులనియు వారు భావింతురు. అందువలన సామాన్య జనులను సోదర పౌరులుగ గాక, తమ సేవకులవలెగాని, ఆశ్రితులవలెగాని చూతురు. ప్రజల యెడ ప్రేమనుగాని, దయాదాక్షిణ్య ములను గాని కనబరచరు. అందువలన ప్రజల అభిమాన మును పొందనేరరు. ఇట్లు ప్రజలకును, అధికారులకును మధ్య నుండదగిన సానుభూతి సహకారములకు బదులుగ వైమనస్యము, వైరుధ్యము ప్రబలును. ఇది ప్రజా • 171 అధికార వర్గము ప్రభుత్వమునకు గొడ్డలిపెట్టు. ప్రభువుల నిరంకుశత్వము పోయిన తర్వాత వెలసిన అధికారవర్గ విజృంభణమును ఇంగ్లండు దేశమున "నూతన నిరంకుశత్వ" మనిరి. సామాన్య ప్రజయెడ కనబరచు అలక్ష్యభావము క్రమ ముగ తమకు పైనుండి పరిపాలనా చక్రమును త్రిప్పు ప్రజాప్రతినిధులపట్ల గూడ అధికారులు చూపుట కద్దు. చివరకు ఆవర్గములోని పైతరగతులవారు క్రిందితర గతుల వారినిగూడ పీడింప వెనుకాడరు. ఇట్టి విపరీతస్థితిలో మాన వత్వము నశించి, మాత్స్యన్యాయము ప్రబలును. పరిపాలనానుభవమును సంపాదించుకొనిన ఉద్యో గులకు స్వాతిశయముతోపాటు స్వార్థపరత్వముగూడ ఏర్పడును. పరిపాలనములో ప్రజాక్షేమముకన్న తమ వర్గము యొక్క లాభమునకు ఎక్కువప్రాధాన్యమును ఒసగజూతురు, తమ పదవులను, అధికారములను, ఆదాయ ములను నిలువబెట్టుకొనుటకును, వృద్ధిచేసికొనుటకును. అవినీతి మార్గములనుగూడ అవలంబింప యత్నింతురు. లంచగొండితనము, సమ్మె సన్నాహములు సంబంధించినవి. ఇందుకు సంకుచితదృష్టి వీరి దుర్గుణములలో మరొకటి, ప్రభుత్వ కార్యకలాపములను నెర వేర్చుటలో తమకు తోచిన ట్లేగాని ఇతరులు సూచించినట్లు వర్తించుట వీరికి గిట్టదు. నిష్ప్ర యోజనకరముగ కనబడినను ప్రాతపద్ధతులనే అవలం బింతురుగాని, క్రొత్తపద్ధతులను అనుసరింప యత్నింపరు. ఇందువలన వీరియందు సృజనాత్మకశక్తి సన్నగిల్లును. దేశకాల పాత్రముల కనువుగ మారుట వీరికిమించిన పని. సామాన్య పరిస్థితులందు సరిగ పనిచేయగలరుగాని అసాధారణ పరిస్థితులందు (అనగా యుద్ధములు, కరవులు, కాటకములు చెల రేగినపుడు) ఈ అధి కారులు అసమర్థు లగుదురు. సామాన్య సమయములందు నైతము వీరు కార్యా చరణ సందర్భమున చేయు కాలయాపన సహింపరానిది. ఒకరోజులో పూర్తి చేయదగు పనికి పదిరోజులు తీసికొనుట వీరి అలవాటు, ఇందుమూలముగ కాగితములమీద జరుగు క్రియాకలాపములు పెరుగును. కావుననే ఉద్యోగుల కార్యాచరణ విధానమును దస్త్రాల పెరుగుదల యనియు, ఆశాపాఠమువలె అంతులేకుండా పెరుగు