Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అధికార వర్గము కార్యనిర్వహణమును సక్రమముగను, సమర్థముగను, సంతృప్తికరముగను సాగించుటకు ప్రత్యేక మైన శక్తి సామర్థ్యములుగల ఉద్యోగి బృందము, అవసరమైనది. ఇదే క్రమముగ అధికారవర్గముగ రూపొందినది. అర్థము : అధికారవర్గము అనగా ప్రభుత్వోద్యోగుల సిబ్బంది. ఇది సాధారణమైన అర్థము. అయితే ఈ పద మునకు నిగూఢ మైనట్టియు, నిందార్హమైనట్టియు అర్థము గూడ గలదు. ఉద్యోగులందు తమకు పాలనమును నిర్వ హించుటలోగల శక్తియుక్తులనుబట్టియు, తద్ద్వారమున అనుభవించు అధికార గౌరవములను బట్టియు, అతి శయము ప్రబలినది. అంతేగాక స్వార్థపరత్వము, సంకు చితదృష్టి, అలసత, అవినీతి మొదలగు అవలక్షణములు గూడ ఏర్పడినవి. ఇవి ఉద్యోగులకు సంభవించిన విపరీత స్థితిని సూచించును. ఈ స్థితిని వర్ణించుటకుగాను Bureaucracy అను పదమును వాడుట మొదలిడిరి. ఇది అధికారవర్గము అను పదమునకుగల అశ్లీలార్ధము. దీనిని బట్టి ఆ వర్గము విపరీత మనస్తత్వముతో వర్తించు ఉద్యో గుల ముఠాయని గ్రహింపవచ్చును. నేటి రాజ్యములలోని ఉద్యోగి బృందమును సివిలు సర్వీసు (Civil Service) అందురు. దీనికి వై దుర్గుణములు ఏర్పడినచో ఇది అక్రమ మైన స్థితికి దిగిన అధికారవర్గము (Bureaucracy) గ భావింపబడును. పుట్టుపూర్వోత్తరములు : అయితే అధికార వర్గము రాజ్యమునందేగాక, విస్తారమైన ఆర్థిక, మత, సంఘము లందును (అనగా ఉత్పత్తి కేంద్రములు, వర్తకుల యొక్కయు, శ్రామికులయొక్కయు, సంఘములు, దేవాలయములు, మఠములు, మతపీఠములు మొదలగు వాటియందును) ఏర్పడియుండును. అయినను అది రాజ్యమునందు ఎక్కువగ ప్రబలినది. కావున రాజ్య పాలనమునందు అధికార వర్గమునకుగల పాత్రకు ఇచట ప్రాముఖ్యమీయబడినది. సాధారణముగ అధికారవర్గపు ప్రభావము వివిధ రాజ్యములందు ప్రత్యక్షముగ కాక ప్రచ్ఛన్న ముగ నుండును. అనగా ఆవర్గము రాజ్యాధినేతలయిన ప్రభువులు క్రిందగాని, ప్రజా నాయకుల మరుగునగాని, దాగి యుండును. యూరవు ఖండమందలి ఫ్రాన్సు దేశము దీనికి పుట్టినిల్లుగ పరిగణింపబడును. ఫ్రాన్సు, ప్రష్యాదేశములను 17, 18 శతాబ్దులలో పాలించిన నిరంకుశ ప్రభువులు తమ పాలనము సౌష్ఠవముగ సాగుటకై ప్రత్యేక అధి కారులను నియమించిరి. వీరు అధికారవర్గముగ పరిణ 19 వ శతాబ్దికి పూర్వము ఇంగ్లండునందు మించిరి. 19వ శతా ఇది యెక్కువగ కానరాదు. తదుపరి అచటగూడ వ్యాపిం చినది. యూరపు రాజ్యములందు ప్రభుపాలనము అంత రించి ప్రజాపాలనము అవతరించిన తరువాతగూడ అధి కారవర్గము స్థిరముగనే ఉన్నది. అది నేటికిని నిలిచి యున్నది. మనదేశములో సయితము వెనుకటి కాలమునగూడ కొద్దిగనో గొప్పగనో ఇదియుండినట్లే తెలియును. బ్రిటిషు వారు పాలించిన కాలమున మనదేశమున ప్రచ్ఛన్న ముగనే గాక చాలవరకు ప్రత్యక్షముగనే ఉద్యోగులు (ముఖ్య ముగ I. C. S. ఉద్యోగులు) పరిపాలనమును సాగించిరి. అప్పటి అధికారవర్గము భారతజాతిని బంధించిన ఇనుప బోను (steel frame) అని వర్ణింపబడినది. అంతకుపూర్వము గూడ అధికారులు కొన్ని సమయములందు అధికార రోగపూరితులై వర్తించుచున్నట్లు వెనుకటి వాఙ్మయ మునందు నిదర్శనములుగలవు. 170 అధికార వర్గమువలన ప్రయోజనములు : అధికార వర్గము వివిధ దేశ కాలములందున్నట్లు ఇదివరకు సూచింప బడినది. ఇపుడు దానివలన వెనుక చేకూరినట్టియు, నేడు నెర వేరుచున్నట్టియు ప్రయోజనములను గమనింతము. 17,18 శతాబ్దులలో ఫ్రాన్సు మొదలగు యూరపు దేశములలో అధికారవర్గము ప్రభుపాలనమును పటిష్ఠ మొనర్చి, ప్రజానీకమునకు శాంతిసౌభాగ్యములను చేకూర్చినది. ఆయా దేశములు క్రమముగ జాతీయైక్య మును, ఆర్థికాభివృద్ధిని పొందగలిగినని. తరువాతి కాల మున పశ్చిమరాజ్యములందు ప్రబలిన ప్రజాప్రభుత్వపు (Democratic State) శ్రేయోరాజ్య (Welfare State) వ్యవస్థలందు గూడ అధికారవర్గము నిర్వహించిన పాత్ర కొన్ని విధముల ప్రశంసాపాత్రమైనదే. ప్రజాశ్రేయస్సు కొరకై శాంతిభద్రతల నిచ్చుటయేగాక, అనేక రకము లైన సౌకర్యములను ప్రభుత్వము ప్రజలకు సమకూర్ప వలసి వచ్చినది. ఈ సౌకర్యములు వ్యవసాయము వాణి