Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సందర్భమున విపులముగ తెలిసికొనవచ్చును. కావున అవి ఇచట సూక్ష్మముగ సూచింపబడును. ఒక రకముగను, జాతీయ, రాష్ట్రీయ ప్రభుత్వముల నడుమనుండు అధి కార విభజనము ఫెడరల్ (Federal) వ్యవస్థయందు యూనిటరీ (Unitary) విధానమందు మరొక విధముగను ఉండును. ఫెడరల్ రాజ్యములందు అధికార విభజనము చాల నిష్కర్షగ నుండును. అనగా అది లిఖిత రూపమున నున్నట్టిదియు, సులభముగ మార నట్టిదియునై యున్న రాజ్యాంగ చట్టములో పొందు పరచబడియుండును. ఈ విభజనమునకు భంగము కలుగ కుండ కాపాడుటకును, దానికి సంబంధించిన వివాద ములను పరిష్కరించుటకును, స్వతంత్రమైన, ఉన్నత మైన న్యాయస్థానము స్థాపింపబడును. విభజన ఫలితముగ రాష్ట్ర ప్రభుత్వములకు రాష్ట్రీయ వ్యవహారములను నెర వేర్చుకొనుటలో, సాధారణముగ స్వాతంత్ర్యము ఉండును. ఇట్టి విభజనము కొన్ని తారతమ్యములతో ఆమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా మొదలైన రాజ్యము లలో కాననగును. ఇక యూనిటరీ విధానము ననుసరించు ఇంగ్లండు, ఫ్రాన్సు మొదలగు దేశములలో అధికార విభ జనము ఇంత కట్టుదిట్టముగనుండదు. ప్రాంతము అందున్న పాలనాసంస్థలకుగాని, ప్రభుత్వములకుగాని తమ వ్యవ హారములను పరిష్కరించుకొనుటలో సిద్ధాంతదృష్ట్యా అంత స్వేచ్ఛయుండదు. ప్రాంతీయపాలనము న్యాయ రీత్యా కేంద్రప్రభుత్వపు అదుపు ఆజ్ఞలకు లోనై ఉండును. සුධි ఇపుడు రాష్ట్రీయ, స్థానిక ప్రభుత్వభాగముల మధ్య నుండు అధికార విభజనమును గమనింతము. రాజ్యాంగచట్టమునందుగాక, సాధారణ న్యాయ చట్టము లందు రూపొందింపబడును. స్థానిక సంస్థలు ఫెడరల్ రాజ్యములందు రాష్ట్ర ప్రభుత్వపు అజమాయిషీకిని, యూనిటరీ రాజ్యములందు కేంద్ర ప్రభుత్వపు అజమా యిషీకిని లోబడియుండును. స్థానిక పాలనము నెడల పై ప్రభుత్వము చలాయించు అధికారము యొక్క వరి మితియు, స్థానిక సంస్థలనుభవించు స్వేచ్ఛ యొక్క పరి' మిలియు, వివిధ రాజ్యములందు వివిధముగ నుండును. ఇంగ్లండు, ఫ్రాన్సు దేశములు రెండును యూనిటరీ విధా నము నవలంబించియున్నను, ఇంగ్లండునందు ఫ్రాన్సులో 22 169 అధికార వర్గము కన్న యెక్కువగా స్థానిక పాలనమునందు స్వేచ్ఛగలదు. యథార్థముగ చూచినచో ఇంగ్లండు నందలి స్థానిక స్వపరి పాలనము ఫెడరల్ వ్యవస్థను గల్గియున్న అ మెరికా సంయుక్త రాష్ట్రములలో నున్న దానిలో సరితూగ గలదు. దక్షిణ అమెరికాయందలి కొన్ని ఫెడరల్ రాజ్యములలో కాననగు స్థానిక స్వపరిపాలనము ఇతర ఫెడరల్ రాజ్యము లలో నున్న దానికన్న స్వల్పము. ఇక స్వతంత్ర భారత దేశపు పాలనా విధానమునందు అధికార వి కేంద్రీక రణము ఒక ప్రధానమైన లక్ష్యముగను, లక్షణముగను గూడ నున్నది. నేటి గ్రామపంచాయితీలు ఇందుకు నిదర్శనము. ఉపసంహారము : అధికారము వివిధ ప్రభుత్వశాఖల నడుమ విభజింపబడుటయు, వివిధ ప్రదేశ ప్రభుత్వముల మధ్య వికేంద్రీకరింప బడుటయు, ప్రయోజన కరమనునది నిర్వివాదాంశము. అందువలన ప్రభుత్వ మునకు పటుత్వము (efficiency) ను, ప్రజలకు స్వేచ్ఛ (liberty) యు లభించును. అయితే పై విషయములందు అధికార విభజనము పరిమితముగ నున్నప్పుడే, ఈ ప్రయోజనములు చేకూరును; వివరీతముగ నున్నప్పుడు చేకూరవు. అనగా అధికార విభజనము అత్యధిక మైనచో అరాజకత్వము (Anarchy) ను, అత్యల్పమైనచో నిరం కుళత్వము (Tyranny) ను ఏర్పడును. అతి సర్వత్ర వర్జయేత్' అను ఆర్యోక్తి అధికార విభజనమునకు గూడ వర్తించును. తగు పరిమితిని తెలిసికొని దానిని అవలం బింపదగును. అధికార విభజనము సుపరిపాలనమునకు సాధనము మాత్రమే అని గ్రహించి, దానిని దేశ కాల పాత్రముల కనువుగ సంస్కరించి, అనుసరించుట శ్రేయో చాయకము, ఓ. స. మూ. అధికార వర్గము (Bureaucracy) : మానవులకు గల వాంఛలలో శాంతి సౌభాగ్యములు ముఖ్యమైనవి- వీటిని సమకూర్చుటకు ఏర్పడినది రాజ్యము (State). ఇది కాలక్రమమున విస్తరించినది. అనగా దీనియందలి సభ్యుల సంఖ్య పెరుగుటయు, ఇది ఆక్రమించిన ప్రదేశము విస్త రించుటయు, ఎదుర్కొనవలసిన సమస్యలు, ఏర్పాటు చేయవలసిన సౌకర్యములు ఎక్కు వగుటయు, అందువలన కార్యనిర్వహణభారము వృద్ధియగుటయు జరిగినవి. ఇట్టి