Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అధికార పరావృత్తి అధికార విభజనము వాదింతురు. ఇట్లు పరిమిత మాత్రమే కోరెననియు విభజనమును మాత్రమే సూచించునదిగా గ్రహించిన యెడల మాంటెస్క్యూ సిద్ధాంతము ఆచరణయోగ్య మును, అభిలషణీయమును అగును. దానివలన ప్రభు త్వోద్యోగులు తమ విధులను శక్తిసామర్థ్యములతో నెర వేర్చుచు, తమ అధికారములను బాధ్యతాసహితముగ చలాయించుటయు ప్రజలు తమ న్యాయ సమ్మతమైన హక్కులను నిరాటంకముగ అనుభ వించుటయు సంభవించును. నేటి రాజ్యములందున్న అధికార విభజనము : పైన సూచించిన పరిమిత మైన అధికార విభజనము ప్రయోజన కారిగనుక నే అట్టి పద్ధతి నేటి రాజ్యములందు, తరతమ భేదములతో అనుసరింపబడుచున్నది. అనగా శాసనసభ, కార్యనిర్వాహకవర్గము, న్యాయస్థానములు ప్రత్యేక ప్రభుత్వ సంస్థలుగ నుండును. అవి సాధారణముగ ప్రత్యేకముగ పనిచేసినను, అవసరమగు నంతవరకు అన్యోన్యముగ గూడ మెలగును. ఒక్కొక్క శాఖ తన ప్రధాన ణ ప్రధాన కార్యముతోబాటు ఇతర కార్యము లను గూడ కొంతవరకు నెరవేర్చును. శాసనసభ ప్రధాన ముగ శాసన నిర్మాణము నొనర్చుచు, కార్యనిర్వాహక వర్గము చేయు పనులపై సమీక్ష, ఆదాయవ్యయముల పై అజమాయిషీ, కొన్ని విషయములందు న్యాయ నిర్ణ యము చేయును. కార్యనిర్వాహకవర్గము తన ముఖ్య విధియగు కార్యనిర్వహణముతోబాటు శాసననిర్మాణ కార్యమును సరిదిద్దుచు, న్యాయమూర్తులను నియమిం చుచు నుండును. ఇక న్యాయస్థానము అందలి న్యాయ మూర్తులు న్యాయనిర్ణయ సందర్భమున న్యాయచట్టము లపై వ్యాఖ్యానించి, న్యాయశాస్త్రమును తీర్చిదిద్దు దురు. శాసనసభ, కార్య నిర్వాహక వర్గముల అధికార పరిమితిని నిర్ణయించును. ఇట్లు ప్రభుత్వ-అధి కారముల మధ్యను, వాటిని నిర్వహించు ప్రభుత్వశాఖల మధ్యను, కల విభజనము పూర్తిగకాక పరిమితముగనే యున్నది. అయితే, శాసనసభ, కార్యనిర్వాహక వర్గముల మధ్యగల విభజనము పార్లమెంటరీ పద్ధతి ననుసరించు ఇంగ్లండు, ఫ్రాన్సు మొదలైన దేశములందు తక్కువగను, ప్రెసి డెంటు పద్ధతి నవలం "ంచు అమెరికా సంయుక్త రాష్ట్రము 168 లందు ఎక్కువగను ఉండును. స్వతంత్ర భారతదేశము ర చాలవరకు ఇంగ్లీషువిధానమునే అవలంబించినది. ము అధికార విభజనము (Division of Powers) : ఇపుడు అధికార విభజనమను పేర అధికారములు రాజ్య నందలి వివిధ ప్రదేశములు (Areas) మధ్యను విభజింప బడుట వర్ణింపబడును. ఇది భౌగోళిక ము (Territorial) X చేయబడు విభజనము. దీనిని అధికార వికేంద్రీకరణము (Decentralisation of Power) అనవచ్చును. వివిధభాగముల మధ్య విభజనము: ప్రదేశముననుసరించి ప్రభుత్వపు అధికారములను విభజించు పద్ధతిని సామా న్యముగను, స్థూలముగను ఇట్లు సూచింపవచ్చును. ప్రభుత్వము నెర వేర్చు విధుల (functions) లో కొన్ని రాజ్యమున కంతకును సమానముగా ప్రాముఖ్యము కలవి. ఉదా : విదేశీ వ్యవహారములు, దేశరక్షణము, రవాణా సౌకర్యములు మొదలైనవి. వీటికి సంబంధిం చిన అధికారములు దేశమున కంతకును ప్రాతినిధ్యము వహించు జాతీయ లేక కేంద్ర ప్రభుత్వమునకు అప్పగింప బడును. కొన్ని వ్యవహారములు దేశమందలి వివిధ భాగములందు లేక ప్రాంతములందు ఒకేవిధముగ గాక వేర్వేరుగ నిర్వహింపబడవలసి యుండును. ఉదా : వ్యవ సాయము, విద్య, వైద్యము, మొదలైనవి. వీటికి సంబంధించిన అధి కారములు రాష్ట్ర ప్రభుత్వములకు ఒసగ బడును. ఈ ప్రభుత్వ భాగములను రాష్ట్రములనియు, రాజ్యములనియు, ఇంకా ఇతర పేర్లతోను పిలుతురు. మరికొన్ని పనులు దేశమున కంతకునుగాక, రాష్ట్రముల కునుగాక, అంతకన్న చిన్నవైన పట్టణములకో, పల్లెలకో సంబంధించినవి. ఉదా : మంచినీటిసరఫరా, మురుగునీటి పారుదల, ప్రాథమిక పాఠశాలలు, ప్రజారోగ్య సౌకర్య ములు. మొదలగునవి. వీటిని నెర వేర్చుటకు తగిన అధికార ములు స్థానిక సంస్థల కొసగబడును. ఇట్లు పాలనాధి కారములు జాతీయ, రాష్ట్రీయ, స్థానిక ప్రభుత్వముల మధ్య ప్రత్యేకింపబడును. పైమూడు ప్రభుత్వ భాగములకు నడుమ మరికొన్ని విభాగములు గూడ నుండవచ్చును. ఉదా : మన దేశమందున్న జిల్లాలు. పై అధికార విభజనము భిన్న రాజ్యములందు భిన్న రీతుల నుండును. వీటిని గురించి వివిధ ప్రభుత్వ వ్యవస్థల