Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అథర్వ వేదము (ii) అర్యమ ! ఈ పడుచు ఇతర స్త్రీల వివాహోత్స వములకు పోయి వివినది. ఇక తప్పక ఇతర స్త్రీలు ఈమె వివాహోత్సవమునకు పోయెవరు. (iii) ధార ఈ భూమిని, ఆకాశమును, సూర్యుని ధరించెను. (స్వస్వస్థానములయందు నిలిపెను.) ధాత ఈ కన్యకకు ఆమె కోరిన వరుని ఇచ్చుగాక. (7) భార్య లభించుటకు మంత్రము: (6 వ కాండము; 82 వ సూక్తము) ఇచ్చటికి వచ్చువాని, వచ్చినవాని, వచ్చుచున్న వాని పేరు స్మరించెదను. ఇంద్రుని, వృత్ర ఘ్నుని, వాసవుని, శతక్రతువును, యాచించెదను. భార్యను కోరుచున్న నాకు ఓ యింద్రుడా! శచీపతీ! నీ యొక్క హిరణ్మయమును, ధనమిచ్చునదియు నగు నీ అంకుళముచే నాకు భార్యనిమ్ము. (8) కారుచున్న రక్తము నాపుటకు (అనువాదము) (i) ప్రవహించుచున్న వియు, రక్తమునకు నివాస భూతములగునవియు నగు ఈ రక్త నాళములు తోడబుట్టిన వాండ్రులేని చెల్లెండ్రవలె హతవర్చసలై ఆగిపోవుగాక. (ii) ఓ అధోభాగవర్తి నియైన రక్తనాళమా! ఆగిపో; ఊర్ధ్వనాళమా! ఆగిపో; అన్నిటికంటే చిన్న నాళమా ఆగిపో; అన్నిటికంటే పెద్ద నాళమా! ఆగిపో. (iii) నూరు ధమనులలో వేయి సిరలలో ఈ నడుమ నున్నవి ఆగిపోయినవి. మిగిలిన నాళము లన్నియు నాగి పోయినవి. ఇట్లే జ్వరము, వరుసజ్వరము, పసరికలు, అజీర్ణము, జలోదరము, కుష్ఠు, గాయములు, క్రిములు పడుట, వళు రోగములు విషప్రయోగము మున్నగువాటిని ని వారించు టకు పఠింపదగిన పెక్కు మంత్రము లిందు కలవు. శ్రేష్ఠహీ వేద స్తపసోధిజాతో, బ్రహ్మజ్ఞానాంహృదయే సంబభూవ. (గో. బ్రా. 1-6). అనురితి గోపథ బ్రాహ్మ ణమున ఈ వేదము యొక్క మహిమ వర్ణిత మైనది. “యస్యరాజ్ఞో జనపదే అథర్వా శాంతిపారగః | నివసత్యపి తద్రాష్ట్రం వర్ధతే నిరుపద్రవం తస్మాద్రాజా విశేషేణ అథర్యాణం జితేంద్రియం | దాన సమ్మాన సత్కారై నిత్యం సమభిపోషయేత్" ఏ రాజు యొక్క జనవదమందు సంపూర్ణముగా శాంతి విధుల నెరిగిన అథర్వవేద పండితుడు నివసించునో, ఆ 166 రాష్ట్రము రోగదారిద్య్రములు మున్నగు నుపద్రవములు లేకుండ వృద్ధినొందును. అందుచేత రాజు విశేష యత్న ముచే యోగ్యుడగు నథర్వవేద పండితుని పురోహితునిగ చేసికొని యాతనిని దాన సమ్మానములచే సంతుష్టుని చేయవలయునని అథర్వవేద పరిశిష్టమున చెప్పబడినది. నీతిశాస్త్రమునందలి "త్రయ్యాంచ దండనీతాం చ కుశలస్స్యా త్పురోహితః | అథర్వ విహితం కర్మ కుర్యా చ్ఛాంతికపౌష్టికం" అను శ్లోకము వలన రాజునొద్ద నున్న పురోహితుడు వేద త్రయమందును, దండనీతియందును కుశలుడై యుండి, రాజ్యమున సంగ్రామాదుల ప్రసక్తి కలిగినప్పుడు, శత్రు పరాభవమును స్వప్రభువు యొక్క విజయాదులును ఘటిల్లు నిమిత్తమై, శాంతిక పౌష్టిక కర్మల నాచరించి రాజ్య రక్షణ మొనర్పవలయునని వచింపబడినది. శ్రీ విద్యారణ్య యతీంద్రులు తన పూర్వాశ్రమమున విజయనగర చక్ర వర్తులకడ అమాత్యుడుగను ధర్మోపదేష్టగను ప్రవర్తిల్లుచు నాలుగు వేదములకును రాజనీతి ననుసరించి భాష్యరచన చేసియున్నారు. ఉ. గ. శా. అధికార పరావృత్తి - అధికార విభజనము : ప్రభుత్వము ప్రజల సౌఖ్యముకొరకు T అనేక కార్య ములను నెరవేర్చవలసి యున్నది. వీటిని నిర్వహించు నపుడు వివిధములైన అధికారములను అది చలాయిం చును. సక్రమముగా సాగుటకు, ఇవి సాధారణముగ రెండు విధములుగ విభజింపబడును. మొదటిది యధి కార ములను, వాటివలన నెర వేరు కార్యముల యొక్క స్వభావమునుబట్టి ప్రభుత్వమందలి వివిధ అంగముల మధ్యను విభజించుట; రెండవది, అధికారములను, అవి వర్తించు ప్రదేశము (Territory) ను బట్టి జాతీయ (National), రాష్ట్రీయ (Provincial), స్థానిక (local) ప్రభుత్వముల నడుమ విభజించుట. మొదటిదానిని అధి కారపరావృత్తి (Separation of Powers) అనియు, రెండవ దానిని అధికార విభజనము (Division of Powers) అనియు అందురు. అయితే ఈ రెంటియందును జరుగునది