Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొన్నింటిలో రాజప్రథమాభిషేకము, పురోహితకర్మలు, మహారాజులు ప్రత్యహము చేయదగిన సువర్ణ- ధేను-తిల- భూదానాదులు కోటిహొమము, లక్షహోమము, అయు తి హోమము, గ్రహయుద్ధము, రాహుచార- కేతుచారములు, పటాక ప్రతిష్ఠ, పాశుపరవ్రతము మున్నగు ననేక విషయ ములు ప్రతిపాదింపబడినవి. న ల అథర్వవేదగతములగు కొన్ని విషయములు : ఉదా:- (1) వర్షాగమనమునకును కప్పలరచుటకును సంబంధము. (అ. వే. 4వ కాం. 4-15) లోకమునందు బోదురు కప్పలు నీటియందుండి అరచు నప్పుడు "బోదురుకప్పల రచుచున్నవి కావున వర్షము కురియు"ననెడి వాడుకకు అథర్వవేదము మూలము. ఖ ణ్వ ఖా 3 ఇ ఖై మ ఖా 3 ఇ మధ్యేతదురి"— (అ. వే. 4 కాం-4.15.) అను శ్రుతియందలి 'ఖణ్వభా, ఖై మఖా, తదురి' అను మూడుపదములు మండూకము లలో నొక జాతికి చెందిన ఆడకప్పలకు నామములు. ఆ నామములచే వాటిని సంబోధించి, "ఓ మండూక విశే షములారా! మీ ఘోషము చేత వర్షమును క లుగ జేయుడు. వృష్టి ద్వారమున పోషించు నో మండూకములారా ! మీ ఘోషముచేత వృష్టికి అభిముఖములగు మరుద్గణములు యొక్క మనస్సును స్వాధీనముచేసికొనుడు.” అను మును ఈ శ్రుతి బోధించుచున్నది. దీనిచేత మండూక ఘోషము వృష్టికి కారణమని తెలియుచున్నది. ఇట్టి శ్రుతిసిద్ధమైన పెక్కు విషయములు లోకాచారమున గన్పడుచున్నవి. (2) ‘అను సూర్యముదయ తాం' (అ. వే. 1 కాం. 6-1) అను మంత్రముచేత ఉదకము నభిమంత్రించి, యెఱ్ఱ గోవు యొక్క రోమములతో మిశ్రితములగు వా జల మును త్రాగినచో హృద్రోగము తగ్గునని చెప్పబడినది. (8) సభాజయమును కోరినవాడిట్లు పఠింపవలయును : వ కాండము 12 వ సూక్తము అనువాదము.) (i) ప్రజాపతికి కూతులైన సభయు (విదుషుల సమా జము) సమితియు (సంగ్రామీణసభ) నేక మనస్కలై నన్ను నాకు కానవచ్చిన వాడెల్ల నా కను కూలుడగుగాక – ఓ తండ్రులారా ! సభలో నేను చారు రక్షించుదురుగాత. - వచనములను పలికెదను, 165 ఆథర్వ వేదము (i) ఓ సభా ! నీ పేరు 'నరెష్టా' ! అలంమనీయ, యని ఎరుగుదును. ఈ ననలోని సభాసదుఅందరును శేకీభవింతురుగాక. (iii) ఇందలిసభాసకులయొక వర్చస్సును, విజ్ఞానము, సు నేను తీసికొనుచున్నాను. ఈ సభయందలి యందరిలోను ఇంద్రా! నన్ను భాగ్యవంతుని (జయశీలుని) చేయుము. (iv) ఓ సభాసదులారా! మీ మనస్సు ఇతరత్ర ఆస క్త మై యున్నను ఇచ్చటచ్చట బద్ధమైయున్నను నా వై పునకు త్రిప్పెదను. అది నాయందు రమించుగారి. (4) శత్రుసేనకు మోహమును కలిగించుటకు__ (శ్రీ కాం—1 వ సూక్తము. అనువావము) (i) విద్వాంసుడైన అగ్ని మా శత్రువులమీదికి ఎత్తి పోవునుగాక ; ఎక్కువ హింసకుడయిన కత్రువును కాల్చు గాక. సర్వజ్ఞుడైన అగ్ని మా శత్రువులను చేతులు లేని వారిగ చేయునుగాక. (ii) ఓ మఘవక్షా ! ఇ0| దా ! వృత్రహంతకా ! అగ్నీ ! శత్రు సేనలను మీరు కాల్పుడు. (5) పాపపరిహారార్థమై ప్రాయశ్చిత్తము : 16 వకాం - 113 వ. సూ క్తము) (i) దేవత లీపాపమును త్రిత (దేవతా విశేషము) మీ క [ కడిగిరి. త్రిత ఆపాపమును మానవునిమీద పారవై చికడుగు కొనెను. కావున నన్ను గ్రాహి (పాప దేవత) ఆశించెను. మంత్రములతో దేవరలు దానిని పోగొట్టుదురు గాక. (ii) ఓ పాపమా ! కిరణములందు ప్రవేశింపును. ధూమములోనికి పొమ్ము. మేఘమునందు చొరబడుము మంచులో చేరుము. నదులమీది నురుగులో కలిసిపొమ్ము. ఓ పూష౯| భ్రూణహత్య చేసిన వాని దోషము పోగొట్టుము. (iii) త్రితచే అపమృష్టమైన మానవుని పాపము పండ్రెండుచోట్ల పెట్టబడినది. కావున నిన్ను గ్రాహి పట్టుకొన్న యెడల ఈ దేవతలు మంత్రములతో దానిని పోగొట్టుదురుగాత. . (6) భర్త లభించుటకు స్త్రీ పఠింపదగిన మంత్రము వ. కాండము. 60వ సూక్తము) (i) ఈ కన్యకకు పతినిగోరి, ఈ బ్రహ్మచారికి భార్యను కోరి అర్యమ (ఆదిత్యుడు) విహితస్తవుడై పురోభాగము నకు వచ్చుచున్నాడు.