Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అథర్వవేదము అనియు రెండు నానుములచే వ్యవహార మేర్పడెను. ఇట్లు జరువదిమంది మహర్షులవలన నిస్సృణమగుటచే అథర్వవేదము ఇరువది కాండలు కలదయ్యెను. కావుననే ఈ వేదము సర్వశ్రేష్ఠమయ్యెను అని సాయణ భాష్య పిరికవలన విదితమగుచున్నది. మరియు, మరియు, “ఏ తద్వై భూయిష్ఠం బ్రహ్మయద్భృగ్వంగిరసః। యేంగిరసస్సరసః॥ యే థర్వాణస్త ర్భేషజం | యద్భేషజం తదమృతం। యదమృతం తద్భహ్మ" (గో. బ్రా. 8. 4.) అనగా బ్రహ్మజ్ఞులగు మహర్షుల తపోమహిమవలన వారి హృద యములందు సంభూతమయిన దగుటచే ఈ అథర్వ వేదము అన్ని వేదములకంటె శ్రేష్ఠమైనది. దీనియందు అంగీరళ్శబ్దవాచ్యమగు భాగము నారము. అథర్వవాచ్య మగు భాగము భేషజము (చికిత్సకము). ఏది భేషజమో అది అమృతము (అమృతత్వ ప్రాపకము). అమృతమో అది 'బ్రహ్మ స్వరూపము' అను నీ గోపథ బ్రాహ్మణము నందలి వాక్యములవలన అథర్వవేదమునకు అథర్వాంగిరస మను పేరుగాక భృగ్వంగిరస మను పేరు కూడ నున్నట్లు కానవచ్చుచున్నది. ఇట్టి అథర్వవేదమునకు అంగములుగ సర్ప వేదము, పిశాచవేదము, అసుర వేదము, ఇతిహాసవేదము, పురాణ వేదము అనునయిదు ఉపవేదములను బ్రహ్మ సృజించి నట్లు “పంచవేదా న్ని రమిత సర్పవేదం, పిశాచ వేదం, అసురవేదం ఇతిహాస వేదం పురాణవేదం" అను గోపథ బ్రాహ్మణమునందలి (గో. బా. 1-10) శ్రుతి వాక్యము నుడువుచున్నది. అథర్వవేదమునకు పూర్వము పైప్పలాద, తైద, మౌద, శౌనకీయ, జాజల, జలద, బ్రహ్మవద, దేవదర్శ, చారణవైద్య——అను తొమ్మిదిశాఖ లున్నట్లు చరణ వ్యూహాది గ్రంథములవలన తెలియుచున్నది. వీటిలో శానకీయాది నాలుగు శాఖలలో గల అనువాకములకు, సూ క్తములకు, ఋగాదులకు, గోపథ బ్రాహ్మణానుసార ముగ అయిదు సూత్రములచే వినియోగము చెప్పబడినది. ఈ విషయమునే ఉపవర్గాచార్యుల వారు కల్ప సూత్రాధి కరణములో నిట్లు చెప్పియుండిరి. నక్షత్ర కల్పో వై తాన స్తృతీయ స్సంహితా విధిః | తుర్య అంగిరసః కల్ప శ్శాంతి కల్పస్తు పంచమ॥॥ 164 సంహితామంత్రములన్నిటికిని సంపూర్ణమ గళాంతిక, శాష్టిక కర్మలందు వినియోగము చెప్పబడుటచే 'సంహితా విధి' అను పదమునకు కాశిక సూత్రము అని అర్థము. ఇదియేగృహ్యసూత్రము. దీని నవష్టంభముగా చేసికొనియే ఇతర సూత్రములన్నియు నుండుట చే ఈ సూత్రము ప్రధానమైనది. అథర్వవేదమున ప్రతిపాదితములయిన విషయములలో మీద పేర్కొనబడిన సూత్రములలో కాళిక సూత్రము నందు, గ్రామ, నగర, దుర్గ, రాష్ట్రాది లాభ సంపాదకము లయిన కర్మలును; పుత్ర, పశు, ధన, ధాన్య, ప్రజా, ( స్త్రీ - కరి - తురగ - రథ- ఆందోళికాది సర్వసంపత్తులను పొందుటకు సాధనములయిన కర్మలును; జను లైకమత్య మును సంపాదించుకొనుటకు ఉపకరించు కర్మలును; రాజ సంబంధమగు కర్మలును; శాంతిక, పౌష్టిక కర్మలును; గో సమృద్ధి - వృషభ సమృద్ధి సంపాదకములైన కర్మలును; వృషోత్సర్జనాది కర్మలును పేర్కొనబడినవి. వై తానస సూత్రమునందు వేదత్రయ విహితములగు దర్శపూర్ణమా సేష్టి ప్రభృతి యజ్ఞములు, చయనములు, సత్రయాగములు మున్నగు సమస్త క్రతువులందు బ్రహ్మ, బ్రాహ్మణాచ్ఛంసి, ఆగ్నీధ్రుడు, హోత అను నలుగురు ఋత్విక్కుల చే పఠింపదగిన శస్త్రమంత్రములును, (శస్త్రములన యజ్ఞములో ఆరాధింపబడు దేవతలను స్తుతించు మంత్రములు) ప్రవచింపబడినవి. అందుచే ఈ శ్రోతసూత్రమునందలి మంత్రములు కేవలము యజ్ఞాదుల యందే ఉపయోగపడును. - నక్షత్రకల్పమునందు మొదట కృత్తికానక్షత్ర పూజా-హోమాదిక ము, పిదప అమృతాద్యభయాంతము లగు ముప్పది మహాశాంతులు, అనంతరము భయార్తులు కును, రోగగృహీతులకును, బ్రహ్మ వర్చస కాములకును, ప్రజా పశ్వన్న సంపత్ప్రభృతులను కాంక్షించువారికిని - సర్వకామావా ప్తికై సాధనములయిన శాంతులు చెప్పబడి నవి. ఆంగిరసకల్పములో అభిచార (ప్రయోగ) సంబంధ మగు అనగా శత్రువధార్థమై ఉపయోగించు కర్మలు మాత్ర మేవివరింపబడినవి. శాంతికల్పమునందు వై నాయక శాంతి మొదలుకొని ఆదిత్యాది నవగ్రహ శాంత్యాదిక ములు చెప్పబడినవి. మరియు అథర్వవేద పరిశిష్టములలో