Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ్యవహరించుచుండిరో అట్లే వ్యవహరించినచో లక్షణము నిర్దుష్టముగ నుండునని వాక్రుచ్చిరి. ఋఙ్మంత్రములు బహుళముగనున్న వేద భాగమునకు ఋగ్వేదమనియు, యజుర్మంత్రి బాహుర్యముగల వేద భాగమునకు యజుర్వేదమనియు, గానయుక్త మంత్రి బహుళమగు వేద భాగమునకు సామవేదమనియు, నీవిధ ముగ తతన్మంత్ర బాహుళ్యముచే మూడు వేదములకు పైనామము లేర్పడెను. యజ్ఞములయందు హోత, అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ అనువారు నలుగురు ప్రధాన ఋత్విక్కులు కలరు. వారిలో హోత చేయవలసిన కర్మభాగము ఋ గ్వేదమంత్రములచేతను, అధ్వర్యుడు చేయవలసిన కర్మభాగము యజుర్మంత్రములచేతను, ఉద్గాత చేయ వలసిన కర్మభాగము సామవేద మంత్రములచేతను, బ్రహ్మకృత్య మంతయు అథర్వవేద మంత్రములచేతను నిర్వహింపబడ వలయును. ప్రజాపతి సోమయాగము చేయ నుద్యుక్తుడై వేదములను గూర్చి “ఓవేద పురుషులారా ! మీలో ఏవేదమును చదివిన వానిని యజ్ఞ మునందలి నలుగురు ప్రధానులయిన ఋత్విక్కులలో ఏ ఋత్వి క్కుగ వరింపవలయు"నని అడిగెను. ఆ ప్రశ్నమునకు "మాలో ఋగ్వేద విదుని హోతగను, యజుర్వేద విదుని అధ్వర్యునిగను, సామవేద విదుని ఉద్గాతగను, ఆథర్వాంగిరో విదుని బ్రహ్మగను వరింపు"మని వేదములు ప్రజాపతికి బదులు చెప్పెను——— అని గోపథ బ్రాహ్మణము యొక్క పూర్వభాగమునందలి ! “అథహ ప్రజాపతి స్సోమేన యత్యమాణో దేవాను వాచ ! కంవో హోతారం వృణీయాం । క మధ్వర్యుం క ముద్గాతారం। కం బ్రహ్మాణం | ఇతి" త ఊచుః | ఋగ్విద మేషహోతారం వృణీష్వః యజుర్విద మధ్వర్యుం | సామ విద ముద్గాతారం ! అథర్వాంగిరో విదం బ్రహ్మాణం ! తథా హాస్య యజ్ఞ శ్చతుష్పాత్ప్రతి తిష్ఠతి" అను ప్రశ్నోత్తర ములచే విదితమగుచున్నది. దీనిచే అథర్వ వేదవిదున కే యజ్ఞ మునందు బ్రహ్మత్వ మొనర్చు నధి కారము సిద్ధించు చున్నది. విష్ణుపురాణము, మత్స్యపురాణము, మార్కం డేయపురాణము, మున్నగు పురాణములందు పౌరోహిత్య మునకు గూడ అథర్వవేదవేత్తయే అర్హుడని చెప్పబడినది. 163 అథర్వ వేదము పైరీతిగా యజ్ఞమునందు బ్రహ్మగా నుండవలసిన వాడు అధర్వ వేదజ్ఞుడుగ నుండవలయునను నియమము పుట్టిన తరువాత అథర్వవేదమునకు " బ్రహ్మ వేదము" అను నామమేర్పడెను. “చత్వారో వా ఇమేవేదా బుగ్వేదో యజుర్వేద స్సామవేదో బ్రహ్మ వేదః" (గో. బ్రా, 2.16 ) అను శ్రుతి అథర్వవేదమును “బ్రహ్మ వేద” మనుటయందు ప్రమాణమగుచున్నది. ఈ వేదిమునకు సాధారణముగ అథర్వవేదమని పేరు గలిగియున్నను మొదట దీనికి అథ ర్వాంగిరసమను నామముండెను. - ఇక పూర్వము ప్రజాపతి సృష్టికొరకు తపస్సు చేయు చుండగా అతని రోమకూపములలో నుండి చెమట పుట్టెను. ఆ స్వేదోదకమునందు తన ప్రతిబింబమును చూచుచున్న ఆ ప్రజాపతికి రేతస్సు చలించెను. అట్టి రేతస్సుతోగూడిన జలములు రెండు భాగము లయ్యెను. ఒక భాగమునుండి భృగు మహర్షి పుట్టెను. అతడు ప్రజాపతిని జూడగోరు చుండగా, ఆకాశవాణి "అథార్వా గేనం ఏతా స్వే వాప్స్వ నిచ్ఛ” (గో. బ్రా. 1_4) —“నీకు ఉత్పాదకుడగు ప్రజాపతిని ఈ ఉదకములందే అభిముఖముగ అన్వే షింపుము"——అని పలికెను. ఇట్టి అశరీరవాక్కు యొక్క ఆదియందు ‘అథార్వాక్ ' అని యుండుటచే, ఈ భృగువునకు 'అథర్వా' అను రెండవ పేరుకూడ - లభించెను. రేతస్సుతోగూడిన రెండవభాగములో నున్న జలముచే ఆవృతు డగుటచే (ఆవృతత్వాత్ వరుణః) వరుణ శబ్ద వాచ్యుడై తపస్సు చేయ దొడగిన బ్రహ్మ యొక్క సర్వాంగ ముల నుండియు రసము స్రవించెను. అట్టి అంగరసము నుండి అంగిరశ్శబ్దవాచ్యు డగు మహర్షి పుట్టెను. ఇట్లు తనచే సృజింపబడిన అథర్వ - అంగిరో మహర్షుల కథ ముఖముగ ప్రజాపతి తపస్సు చేయగా అతని తపః ప్రభా వముచే ఏకర్చుడు ద్వ్యర్చుడు మున్నగు మంత్ర ద్రష్ట లగు మహర్షులు ఇరువదిమంది ఉత్పన్నులైరి.. పిదప ఈ ఇరువదిమంది తపస్సు చేయుచుండగా వారివలన నిస్సృత ములై బ్రహ్మచే చూడబడిన మంత్రముల యొక్క సంఘమే అథర్వాంగిరళ్ళబ్దవాచ్య మగు అథర్వవేద మయ్యెను. అనగా బ్రహ్మ చూచుచుండగా ఘోర తపోనిష్ఠలోనున్న ఇరువదిమంది అథర్వాంగిరో మహర్షులనుండి వెలువడిన మం తసంఘమున కే అథర్వవేద మనియు, అథర్వాంగిరస్సు -