Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అథర్వ వేదము లను, పంచభూతములను, ఇంద్రియ నిగ్రహ విధిని, జీవాత్మ పరమాత్మల స్వరూపమును వర్ణించు మంత్రము లును కొన్ని కలవు. ఋగ్వేదమునందు వలెనే అగ్ని, ఇంద్రుడు, ద్యావాభూములు, సవిత, వరుణుడు, దేవతలు ఉషస్సు మున్నగు ఈ వేదమునందును స్తోత్రములను బడసియున్నారు. వీరిని వేరువేరు దేవత లుగా పొగడుటయేకాక సర్వ ప్రపంచమునకును ఏక కర్త ఉన్నట్లైంచబడి, అయ్యాదిమతత్త్వము ఒకప్పుడు సూర్యరూపముగను, (18 వ కాండము) ఒకప్పుడు కాల రూపముగను, (16, 58, 54) ఒకప్పుడు బ్రహ్మచారి రూపముగను, ఇట్లు వేర్వేరు రూపములతో స్తుతింపబడి యున్నది. సృష్టియందలి స్వభావసిద్ధమైన శోభలను వర్ణించు సూక్తములు కొన్ని ఇందు ఉన్నతమైన కవిత్వ స్ఫూర్తికి నిదర్శనములుగా నున్నవి. ఇట్టి వాటిలో పృథ్వీ సూక్త మనునది మిక్కిలి కొనియాడదగినది. ఇందు సర్వాధారభూతమైన వృథ్వి 63 ఋక్కులు గల పెద్ద సూక్తముచే స్తుతింపబడినది. ఆభిచారిక విద్యయే ఈ వేదము యొక్క ముఖ్యలక్షణము. అందుచే నిందు శత్రువుల ఆయురారోగ్యాదులను హరించుటకును, వారిని నాళ మొనర్చుటకును, విరోధికృతములయిన ప్రయోగ ములను త్రిప్పుటకును, విరోధికృతమైన అవకారమునకు ప్రతీకార మొనర్చుటకును, విధింపబడిన మంత్రములు పెక్షులుకలవు. మొత్తముమీద ఇందు సర్వత్ర స్వీయ క్షేమా రోగ్యములను, విరోధిజనుల అనారోగ్య నాశనములను కాంక్షించుచు, చేయు ప్రార్థనలే కాననగును. - సంగ్రహో క్తి చే – అథర్వవేదము, అనంతరకాలమున వెడలిన మంత్రశాస్త్రము, వైద్యశాస్త్రము, జ్యోతిశ్ళా స్త్రము మున్నగువాటికి మార్గదర్శకము. విశేషముగా నిది ఐహిక సుఖములయు, స్వల్పముగా ఆముష్మిక సుఖము లయు బోధకముగా వెలసినదనవచ్చును. ఇందు ఆనాటి వివిధ సాంఘికాచారములు, ముఖ్యముగా బ్రాహ్మణుల శ్రేష్ఠత, వై శిష్ట్యము, ఆనాటిజనులకు మంత్రము మున్నగు వాటిపై గల గొప్ప విశ్వానము ప్రత్యక్షమగుచున్నవి. ఆనాటి రాజులు సమగ్రముగ అథర్వవేద మంత్రప్రభావ మును గుర్తించిన వారై తమ ఆస్థానములందు అథర్వవేద పొరుగులను గౌరవముతో పోషించుచు, అథర్వవేద 162 మంత్రముల యొక్కయు తద్విదుల యొక్కయు సాయ మున విరోధివర్గము యొక్క నాళనాదిక మును సాధించు చుండిరని తెలియుచున్నది. "ప్రత్య జేణానుమిత్యావా ! యస్తూపాయో న బుధ్యతే విదంతి వేదేన అస్మా ద్వేదన్య వేదతా" 9 అనుదానిని బట్టి ప్రత్యణాది ప్రమాణములచే తెలిసికొను టకు శక్యముగాని అర్ధమును బోధించు అక్షరరాశి వేద మనబడుచున్నది. తాపనీయోపనిషత్తునందలి "ఋగ్యజు స్సామాథర్వాణ శ్చత్వారోవేదాః” (నృ. పూ. తా. 1); ముండకోపనిషత్తునందలి “తత్రావరా ఋగ్వేదో యజు ర్వేద స్సామవేదో ఒథర్వవేదః ;" ఇత్యాది వాక్యములచే వేదము ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అను నామములచే నాలుగు విధములుగ విభజింపబడుచున్నది. ఇట్టి వేదములకు అపౌరుషేయత్వ మును పూర్వమీమాంసకులు సిద్ధాంతీకరించిరి. వీటి యందు పఠింపబడుమంత్రములు ఋక్కులు, సామములు, యజస్సులు అను భేదముచే మూడు విధములు. పూర్వమీమాంసాశాస్త్రమునందలి “తచ్చోద కేషు మంత్రాభ్యా" (జై - సూ-2-1-82) "శేషామృక్ యత్రార్థవన పాదవ్యవస్థా" "గీతిషు సామాఖ్యా" "శేషే యజుశ్శబ్దః" జై సూ. 2.1.85) జై . సూ. 2-1-86) (జై. సూ. 2-1-87) ఇత్యాది సూత్రములచే పాదబద్ధములగు మంత్రములు ఋఙ్మంత్రములనియు, గానయుక్తములగు మంత్రములు సామమంత్రములనియు, ఈ రెండింటికంటె భిన్నములగు మంత్రములు యజుర్మంత్రములనియు తత్తద్వేద లక్షణ ములు చెప్పబడినవి. శ్రీ విద్యారణ్య యతీంద్రులు పూర్వమీమాంసా జై మినీయన్యాయమాల అను గ్రంథము నందు "యాజ్ఞి కానాం సమాఖ్యానం లక్షణం దోషవర్జితం" (ఆ. 2.1) అను శ్లోక పాదముచే లోకములో యాజ్ఞికులు ఏమంత్రములను ఋఙ్మంత్రములనియు, వేటిని సామ మంత్రము లనియు, వేటిని యజుర్మంత్రము లనియు