Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ వేదమునకుగల అధర్వవేదము, అధర్వాంగిరో వేదము, భృగ్వంగిరో వేదము, బ్రహ్మవేదము అను నాలుగు నామములలో మొదటి మూడు సంజ్ఞ లును ఆయా ఋషులు ప్రవర్తకులగుటను బట్టియు, కడపటిది యాగములందు ఈ వేదము బ్రహ్మ అను ఋత్విక్కు పఠింపదగిన దగుటనుబట్టియు వచ్చినవి. అథర్వవేదో త్పత్తినిగూర్చి గోపథ బ్రాహ్మణము, విష్ణు పురాణము మున్నగునవి వచించు కథలయందలి ముఖ్యాళయమును బట్టి విచారించినచో, భృగు మహర్షియు నధర్వ మహ ర్షియు అభిన్ను లనియు, అథర్వాంగిరో మహర్షులును వారి వంశీయులును ప్రధానులుగా ఈ వేద మావిర్భవించె ననియు తెలియవచ్చును. అయినను అథర్వ మహర్షి యు అతని సంతతివారును దర్శించిన సూక్తము లిందు అధిక సంఖ్యాకము లుండుటచే దీనికి అథర్వవేద మను సంజ్ఞ లోకమున విశేషముగ ప్రసిద్ధి నొందినది. అథర్వ వేదము ఇతర వేదములవలెనే బ్రాహ్మణము అను రెండు భాగములు కలిగియున్నది. 'చరణ వ్యూహము' నుబట్టి అథర్వ వేదమునందు 12,800 మంత్రములు (ఋక్కులు) ఉన్నట్లు విదితమగుచున్నను, ఇప్పుడు కానవచ్చు శౌనకసంహితననుసరించి, దీనియందు 1789 సూక్తములును దాదాపు 6018 మంత్రములును మాత్రము గలవని తెలియుచున్నది. ఇట్లు సంహితాభాగము కాక అథర్వ వేదమునకు అనుబంధరూపమున విశేషముగ వాఙ్మయము కలదు. అందులో బ్రాహ్మణములు, ఉపనిషత్తులు, సూత్రములు, సర్పవేదము, పిశాచవేదము, అసురవేదము, ఇతిహాస వేదము, పురాణవేదము అను అయిదు ఉపవేదములును, అనుక్రమణికలును వ్యాకరణ జ్యోతిష గ్రంథములును పేర్కొన దగినవి. అథర్వవేదమున కొక్క గోపథ బ్రాహ్మణమే వాడుకలోనున్నది. ముండక, మాండూ క్యాదు లగు ఉపనిషత్తులు 29 మాత్రమే కనబడును. ఉపవర్షాచార్యుడు అథర్వవేదకల్పములు అయిదు అని వచించెనని శ్రీ విద్యారణ్య యతీంద్రుడు తన భాష్యమున నుదాహరించెను. పంచపటలిక, సర్వానుక్రమణిక అను రెండు అనుక్రమణికలు ఈ వేదమునకు గలవు. వీటిలో రెండవ అనుక్రమణికకు బృహదనుక్రమణిక అనునది 21 161 ఆథర్వ వేదము నామాంతరము. అథర్వవేద పరిశిష్టములు 22 వరకును గలవు. అథర్వవేదమునకు సంబంధించిన వ్యాకరణ గ్రంథములలో 'శానకీయ చతురఢ్యాయిక' అను గ్రంథ మొకటి కానవచ్చుచున్నది. దీనికి అర్వణ ప్రాతిశాఖ్య మని పేరు. అథర్వణ జ్యోతిపి గ్రంథ మొకటి కలః”.. - అథర్వణ వేదశాఖలు తొమ్మి దనియు, వచ్చాడా ప్రవర్తకులు తొమ్మిదిమంది అనియు చెప్పు: పాఠము సార్థకము. తొమ్మిది శాఖలలో ముద్రివి అముద్రిత - సంహితాపు స్తకరూపమున గనబడుచున్నవి నక పైప్పలాదక శాఖలు రెండే. ఈ శౌనక పైప్పలాదక శాఖలు – రెండింటియందలి సిందోబద్ధములైన మంత్రము లకు ఉదాత్తానుదాత్తాది స్వర నియమము కలదు. ఈ రెండింటిలో శౌనక శాఖకే భాష్య మేర్పడినది. శౌనక సంహితయందు 20 కాండములు కలవు. అందు ప్రతి కాండము కొన్ని ప్రపాఠకములుగాను, ప్రతి ప్రపాఠక ము కొన్ని అనువాకములుగాను, ప్రత్యనువాకము కొన్ని ములుగాను విభజింపబడినది. _ ఋగ్వేదమువలె ఈ వేదము కేవలము ఛందోమ యము కాక గద్య పద్యాత్మకముగా నున్నది. 15, 18 కాండములు ఐత రేయాది బ్రాహ్మణముల గద్యమును పోలు గద్యముతో నిండియున్నవి. 16 వ కాండమున గల కొన్ని గద్య సూక్తములలో కొంతభాగము ఛందో మయమైనది కూడ కలదు. ఋగ్వేదమునందలి ఛందస్సు కాక పురస్తా దృృహస్పతి, ప్రస్తారపంక్తి, బార్హత గర్భ త్రిష్టుప్పు, విరాడతి జగతి మున్నగు నూతన ఛందస్సులు కూడ కానవచ్చును. లే అథర్వ సంహితయందు ప్రతిపాదింపబడిన విషయ ములు అనంతములు. ఇందు కొన్ని మంత్రములు జ్వరా దులు, గ్రహాదులు, వ్రణములు, కత్తిపోట్లు మున్నగు వాటివలన నేర్పడిన బాధలను తొలగింప సమర్థము లైనవి. కొన్ని మంత్రములు ఆయుస్సు, వర్చస్సు, యశస్సు మున్నగువాటి నభివృద్ధి నొనర్చునవి. కొన్ని మంత్రములు స్త్రీ పురుషు లొండొరులను వశపరచు కొనుట కుద్దేశింప బడినవి. కొన్ని కృషి క ర్మాభివృద్ధికి ఉపకారకములై యున్నవి. వైవాహిక సంప్రదాయము లను, గృహ్య సంస్కారములను, అంత్య సంస్కారము