Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆద్వైతము కించిద్ జ్ఞత్వ వైశిష్ట్యములను విడిచి విశేష్యమగు కేవల చిత్తును మాత్ర మే బోధించును. కావున జహచ జహ త్స్వార్ధలక్షణచే "తత్త్వమసి" మొదలగు మహా వాక్య ములు కేవల చిద్విషయకమగు “చిత్" అను నిర్వికల్ప బోధను గలుగ జేయును నిర్వికల్ప బోధస్వరూపము : "నిర్వికల్ప బోధ”యనగా పదార్థమునందు బోధయగు పధర్మముగాని, ఏసంబంధముగాని భాసింపక, కేవల పదార్థ వివయకమగు చున్నది. శబ్దమువలన కలిగెడి బోధ సవికల్పక మే యగును కాని, నిర్వికల్పకము కానేరదు అను తార్కిక నియమము ఉండగా “తత్త్వమసి" అను మహాకావ్యము వలన నిర్వికల్పక బోధ యెట్లు కలుగు"నని శంకింపజనదు. శక్తివాదములో విశేష కాండమున ఆ కాళపద శక్తి నిరూపణ ప్రస్తావమున ఆకాశ పదము వలన శబ్దాశ్రయ త్వేన ఆకాశీబోధ కలుగునని ఉపపాదించి "అస్తువా పదాదపి నిర్వికల్పక బోధః" ఆకాశపదమువలన నిర్వికల్పక బోధ కలుగుగాక అని తార్కికాగ్రేసర చక్రవర్తియగు శ్రీ గదాధర భట్టాచార్యులవారు ప్రతిపాదించిరి. కావున పదమువలన నిర్వికల్పక బోధతార్కిక సమ్మతమేకాని తార్కిక విరుద్ధము కాదు. “తత్త్వమసి" అను వాక్యమునందుగల "తత్, త్వం" అను పదములు జహదజహత్స్వార్థ చేత చిత్తును, చిత్తును బోధించునమనపుడు, ఆ రెండు చిత్తులకు అభేదము చెప్పిన "చిదభిన్నము చిత్తు" అను బోధ కలుగునని చెప్ప వలెను. ఇట్టి బోధ తార్కికాది సర్వమత విరుద్ధము. ఎందువల్లనన శబ్దజవ్య జ్ఞానము సంశయ వారకమగును. సంశయమును దొలగింపని శబ్దజన్య జ్ఞానము ఉండ నేరదని తార్కికులు "విరూపోప స్థితయో రేవ శాబ్దబోధః" భిన్నములగు ధర్మములు పురస్సరముగ శబ్దముల వలన నువస్థితములగు పదార్థముల కే అభేదాన్వయ బోధ సంగీకరించిరి. కనుకనే "నీడోఘటః" అను స్థలమున నీలత్వ, ఘటత్వరూప భిన్నధర్మ పురస్సరముగ నుపస్థిత మగు నీలఘటముల క భేద బోధ కలుగును. "ఘటో ఘటః" అను స్థలమున నేకధర్మమగు ఘటత్వ పురస్సర ముగ నుపస్థితములగు ఘటములకు అభేద బోధ, సంశయ మును నివారింపనందున, కలుగనేరదని వ్యుత్పత్తి వాద 158 మున స్పష్టముగ చెప్పి యుండిరి. కావున "తత్వమసి" అను మహావాక్యమువలన చిత్తునకు చిత్తునకు అభేదబోధ కలుగ నేరదని శంకింప జనదు. "తత్వమసి" అను వాక్యమువలప “చిదభిన్నము చిత్తు" అను బోధ కలుగునని అద్వైతులు చెప్పెయుండ లేదు. “త త్త్వమసి" అను వాక్యమువలన సర్వజ్ఞ త్వోప లక్షిత కించిద్ జ్ఞ త్వోప లక్షిత చిద్విషయక “చిత్" అను బోధ మాత్రము కలుగుననియే అద్వైత సిద్ధాంతము. దీనిని మాత్రము విస్మరింపు తగదు. "భూతలము ఘటము కలది" అను జ్ఞానమును నివ ర్తింప జేయునది "భూతలము ఘటాభావము కలది" ఆను జ్ఞానమే. అనగా తద్వత్తా బుద్ధికి తదభావవత్తా జ్ఞానము (నిశ్చయము) ప్రతిబంధకము (నివర్తకము) అట్లే “నేను బ్రహ్మమును కాను” అని అజ్ఞానికిగల మిథ్యా జ్ఞాన మును బోగొట్టునది "నేను బ్రహ్మమును" అను జ్ఞానమే. తదభావవత్తా జ్ఞానమును ప్రతిబంధించుటకు తద్వత్తా జ్ఞానము సమర్థమగును. “తత్త్వమసి" అను వాక్యము వలన కలిగెడి "చిత్” అను నిర్వికల్ప జ్ఞానము తదభావవాదుల నవగాహింప జాలనందున “నేను బ్రహ్మ మును గాను" అను నజ్ఞానికి నిరూఢమగు జ్ఞానమును తొలగింపలేక “త త్త్వమసి" అను వాక్యోపదేశము నిరర్ధ అనగా కమే యగునని శంకింపరాదు. 'తత్త్వమసి' అను వాక్యమువలన జనించిన జ్ఞానము తదభావవాదుల నవగాహింపక అజ్ఞాన జనితమగు 'నేను బ్రహ్మనుగాను' అను జ్ఞానమును తొలగించుననియే, అద్వైతి చెప్పెను. “తత్త్వమసి' అను మహావాక్య జనిత మగు 'చిత్' అను జ్ఞానము స్వరూపము చేతనే సూర్యుడు తిమిరమును, గారుడమంత్రము సర్పవిషమును దొల గించినటుల, అజ్ఞాన జనితమగు భ్రాంతుల నన్నిటిని తొల గించుననియే అద్వైత సిద్ధాంతము. ఇట్టి నిర్వికల్పకబోధ కలుగజేయుటకే 'తత్త్వమస్యా'ది మహావాక్యములకు అఖండార్థత్వమును అద్వైతులు అంగీకరించియుండిరి. ఈ విషయమునే 3 శ్లో॥ సంసర్గా సంగి సమ్యర్ధి హేతు యాగిరామియం ఉక్తాఒఖండార్థతా యద్వా తత్పాపది శార్థతా॥ అని చెప్పియుండిరి.