Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మరియు భ్రాంతి మూలకము లగునట్టి కుశంకలను తి దొలగించుకొనలేక “స ఆత్మా తత్త్వమసి" అనుచోట 'అతత్, త్వం, అసి' అని కొందరును, 'తస్మై త్వం, అసి' అని కొందరును, 'తేన, త్వం, అసి' అని అన్యులును, 'తస్య, త్వం, అసి' అని మరికొందరును. ఇట్లు అనేక రీతుల లు ప్తవిభ క్తి కముగ ‘తత్' అనుపదమును సమర్థింప పూను కొనిరి. ఈ యన్ని విధముల చేతను గూడ జీవేశ్వరులకు భేదమే బోధింపబడుచున్నది. తత్త్వమస్యాది వాక్యముల వలన కలిగెడి జీవ పరభేదజ్ఞానము 'నేను బ్రహ్మముకన్న వేరు” అని జీవునకుగల అనాది భేదజ్ఞానమునే బోధించు చున్నది. ఇట్టి సిద్ధజ్ఞానమునే "తత్వమసి" అను మహా వాక్యము బోధించుచో, ఈ మహావాక్యము అనువాద రూపమే యగునుకాని ఉపదేశము కాజాలదు. ఉపదేశ మనగా అజ్ఞాతార్థ జ్ఞాపకము (కావున ఇట్టి విపరీ తార్ధములు జెప్పి లోకమును మోసపుచ్చువారలు ఉపేడ్యులు) కనుకనే "తత్త్వ మస్యాది వాక్యోర్థ సమ్యర్ధి జన్మ మాత్రతః। అవిద్యా సహ కార్యేణ నాసీద స్తి భవిష్యతి” అను నార్యోక్తి తత్త్వమస్యాది వాక్యములవలన గలిగిన అఖండార్థ విషయక మగు సమ్యక్ జ్ఞానమువలన అవిద్య, తన కార్యములతో గూడ నివర్తించుచు కాలత్రయము నందుగూడ లేదను టను నిరూపించును. తత్త్వమస్యాది వాక్యజన్యజ్ఞానముళ జన్య మగుట చేత శాబ్దమే యగును. ఇట్టి శాబ్దము జీవునియందు నిగూఢ మగు భేద ప్రత్యక్షము నెటుల తొలగించుననినచో, సమా ధాన మిది. సన్నికృష్ట స్థలమున 'దశమ స్త్వమసి' అను శబ్దమువలన గూడ ప్రత్యక్షము గలుగునటుల “తత్త్వ మస్యాది" వాక్యములవలన అపరోవ్యజ్ఞానము గలిగి, అజ్ఞానమువలన జనించెడి నిఖిల వ్యావహారిక బంధక జ్ఞానమును తొలగించును. ఆత్మ, “త త్త్వమసి" అను మహావాక్యజన్యమగు ప్రత్యక్ష విషయమగుచో అద్వైతులు జగత్తు మిథ్యయనుటయందు ప్రయోగించిన దృశ్యత్వ మను హేతువు బ్రహ్మమునందు కూడ నుండుటచే ఈ బ్రహ్మము గూడ మిథ్యయని యో లేక దృశ్యత్వ హేతు వ్యభిచారి యనియో అనక తప్పదని శంకింపజనదు. 159 అద్వైతము తత్త్వమస్యాది వాక్యజన్య వృత్తి విషయత్వము, బ్రహ్మమునందుండినను, వృత్తి ప్రతిఫలిత చైతన్య విషయ త్వము బ్రహ్మమునందు లేదు. జగన్మిథ్యాత్వమును సంపా దించుటకు ప్రయోగింపబడిన దృక్యత్వ మను హేతువునకు అర్థము వృత్తి ప్రతిఫలిత చైతన్య విషయత్వము. అట్టి దృశ్యత్వము బ్రహ్మమునందు లేనందున బ్రహ్మమునకు మిథ్యాత్వము ప్రాప్తింపదు. దృశ్యత్వహేతువు వ్యభి చారియుగాదు. మరియు దృశ్యత్వమనగ సప్రకారకజ్ఞాన విషయత్వము, “తత్త్వమసి" అను వాక్యమువలన కలిగెడి జ్ఞానము చిద్విషయక మగు నిర్వికల్పకము. సప్రకారకము కానేరదు. కానీ తత్త్వమస్యాది వాక్యముల వలన కలిగెడి నిర్వికల్పక ప్రత్యక్షవిషయత్వము బ్రహ్మమునందుండినను సప్రకారకజ్ఞాన విషయత్వరూపమగు దృశ్యత్వము బ్రహ్మమునందు లేదు గావున జగన్మిథ్యాత్వము సాధించు కు ప్రయోగింపబడిన దృశ్యత్వము వ్యభిచారి కానేరదు. లోకమున ఘటాదులకు కారణమగు కులాలాదిచేతను లకు నిమి త్త కారణత్వమే కాని ఉపాదాన కారణత్వము లేదు. అట్లే జగత్తునకు కారణమగు బ్రహ్మము కూడ జగత్తునకు నిమి త్త కారణమే కాని, ఉపాదాన కారణము కానేరదు. అట్లు ఉపాదాన కారణము గూడ బ్రహ్మమే యగుచో కుండలాదుల కుపాదానమగు సువర్ణమంతయు కుండలములుగ పరిణమించినటుల బ్రహ్మమంతయు జగ ద్రూపముగ పరిణమించి జగత్తుకంటే వేరుగ బ్రహ్మము లేకపోవలసివచ్చును. కొంత బ్రహ్మమే జగద్రూపముగ పరిణమించినచో, బ్రహ్మసావయవము కావలసివచ్చును. బ్రహ్మమునకు సావయవత్వము అంగీకరించినచో, బ్రహ్మ మునకు నిరవయవత్వమును బోధించు శ్రుతులు అప్రమా ణము కావలసివచ్చునని శంకింపజనదు. ఈ విషయమునే వ్యాసభగవానులు "కృత్స్న ప్రసక్తి ర్నిరవయత్వ కోపోవా" అను సూత్రముచే ఆశంకించి 'తదనన్యత్వమారంభణ శబ్దాదిభ్యః' అను సూత్రముచేత తగు సమాధానమును జెప్పిరి. ఉపాదాన కారణము 'పరిణామి' ఉపాదానమనియు, 'వివర ఉపాదానమనియు రెండు విధములు. అందు జగత్తునకు పరిణామ్యుపా దానము అవిద్య, వివర్తిపాదానము బ్రహ్మము. వివర్తో