Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కైనను అందరు ముక్తులు కాని, బదులు కాని కావలెను" అను నాప త్తియు సంభవింపడు. ఇదియునుగాక' ఆత్మలు పూర్ణములు, అనేక ములని చెప్పు ఈ పక్షమునందే ఈ దోపము లన్నియు సంగ వించును.

పరపక్షమున దోషములు ఏలన సర్వవ్యాపకములు అనేకములు నగు నాత్మలు పరస్పరము పరస్పర మనో బుద్ధ్యాదులతో అన్ని దేహములయందు కలిసి కొనుటచే నొకడు దుఃఖించిన నందరు దుఃఖించుటయు, ఒకడు సుఖంచిన నందరు సుఖించుటయు, నొకడు బద్ధుడైన నందరు బద్దులగుటయు, నొకడు ముక్తుడైన నందరు ముక్తులగుటయు సంభవించును. మరియు “ఏయే వస్తువు ఇతర వస్తువులకంటె వేరుగనుండునో, ఆయా వస్తువు పరిచ్ఛిన్న మనబడును" అను న్యాయముచేత ఆత్మలు అనేక మైనచో వాటికి నితర భేదము ప్రాప్తించునుగావున ఆత్మ లన్నియు పరిచ్ఛిన్నము లగుటచే వాటికి పూర్ణత్వము పొసగదు. పూర్ణత్వమే యున్నచో ననేకత్వము సమ కూరదు. పరస్పర విరుద్ధములగు నీ రెంటికి నాత్మల యందు సమావేళమును బ్రహ్మకూడ నిర్వహింపజాలడు. కావున ఆత్మైకత్వము అవశ్యాంగీ కార్య మగు చున్నది. ఆకాశవ త్సర్వగతశ్చ నిత్యః, ఏక స్తథా సర్వ భూతాంతరాత్మా | ఏకో దేవ స్చర్వ భూతేషు గూఢం, ఏకస్సన్ బహుధా విచచార ఏక ఏవహి భూతాత్మా,

నిర వేక్ష ఏకఏవ, సాక్షి ఏక స్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం, అశరీరం శరీరే వ్వనవస్థే ష్వవస్థితమ్ | మహా స్తం విభుమాశ్శానం మత్వా ధీరో నశోచతి" ఇత్యాద్యాలైన కత్వ నిత్యత్వ పూర్ణత్వ బోధక శ్రుతుల చేతను, "నిత్య స్సర్వ గతస్థాణుః, నిత్యస్సర్వ గతోప్యాత్మా కూటస్థా దోషవర్జితః | ఏకస్స న్భిద్యతే భ్రాంత్యా మాయయాన స్వరూపతః" ఇత్యాదిస్మృతులచేతను ఘటాదుల యం దున్న ఆకాశమువలె సర్వ శరీరముల యందున్న ఆత్మ పరిపూర్ణు డగుటచేత ఒక్కడే యని నిర్ణయము. ఇట్టి నిర్ణయమే సిద్ధాంతమగుట వలన “పూర్ణములు కాకపోయి నను ఆత్మలు పరిచ్ఛిన్నములు, అనేకములు, చిద్రూప ములు" అను పక్షము గూడ తొలగింపబడెను. 157 ఆద్వైతము మరియు ఆత్మ అంశరహితమగుట వలనను, సర్వప్రకా శకమగుట చేస్తాను, సర్వసాక్షియుట చేను, అందటను అహం ప్రత్యయార్థమగుట చేతను, ఇంకను ఇట్టి అనే!' యుక్తుల చేతను ఆత్మ పరిపూర్ణమని నిశ్చయింపబడు చున్నందునను, ఆత్మ పూర్వోపదర్శిన శ్రుతి స్మృతియు క్తి ప్రామాణ్యము చేతను ఆత్మ ఒక్కటి అనియే సిద్ధాంతము. పరమాత్మ జీవాల్మైకసాధనము : అద్వైతము శ్రుత్యాది ప్రసిద్ధమని తెలిసికొని యుంటిమి. అద్వైతమును బోధించు శ్రుతులు “తత్త్వమని" "అహంబ్రహ్మాస్మి" "అయమాత్మా సర్వానుభూ:" "ఆలై వేదం సర్వం" మొదలగునవి కలవు. అవి అద్వైతమును బోధింప జాలవు. తత్త్వమసి అను వాక్యములో తత్, త్వం, అసి అను మూడు పదములు గలవు. అందు 'తత్" అను పదము సర్వజ్ఞత్వ విశిష్టమగు చిత్తును, 'త్వం' అనుపదము కించిద్ జ్ఞత్వ విశిష్టమగు చిత్తును బోధించును. “విరుధ ధర్మములు కల ఘట, పటముల కైక్యము పొసగునటుల విరుద్ధములగు సర్వజ్ఞశ్వ కించిద్ జ్ఞత్వ రూప ధర్మములు గల పరమాత్మ, జీవాత్మలకు ఐక్య మెన్నడు సంభవము కాదు” అని శంకింపరాదు. తత్త్వమస్యాది వాక్యములు జహరజహల్ల క్షణచే చిద్విషయకమగు “చిత్" అను నిర్వికల్పక ప్రత్యక్షమును బోధించును. జహదజహల్లక్షణ యనగా శబ్దార్థమున కొంత భాగమును విడిచి కొంత భాగమును విడువక శబ్దార్థిక దేశమును బోధించునది. అది యెట్లనిన “త త్త్వమసి" అను స్థలమున "తత్" అను పదమున కర్ణము సర్వజ్ఞత్వ విశిష్ట చిత్తు. "త్వం" అను పదమున కర్ణము కించిద్ జ్ఞత్వ విశిష్ట చిత్తు. "తత్, త్వం" వదములు రెండును సమాన విభ క్తికములగుట చేత ఈ రెండు పదములకు సామానాధికరణ్యము క ల దు. పదములయందుందు సామానాధికరణ్యము ఏకార్ధ బోధకత్వమే. అందుచేత "తత్, త్వం" అను రెండు పదములు ఏకార్థమును బోధింపవలయును. పరస్పర విరుద్ధ ధర్మములుకల “తత్, త్వం" పదార్థములగు సర్వజ్ఞత్వ విశిష్ట, కించిద్ జ్ఞత్వ విశిష్ట చిత్తులకు అభేదము పొసగనందున ఇచట “జహద జహత్స్వార్థ" అను లక్షణా వృత్తిని అంగీకరింప వలయును. అనగా శబ్దార్థిక దేశములగు సర్వజ్ఞత్వ,