Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అద్వైతము ర్థమగు ఆత్మకు భేదము సిద్ధించనందున ప్రత్యపు ప్రమాత్యము ఉపపన్నమగుచుండ, “నాళ్మైకత్వము నొప్పినచో ణము వలన ఆత్మభేదము సిద్ధించదు. స్థూల సూక్ష్మ కారణదేహములు, జా జాగ్రత్స్వప్న దేహములు వేరైనను, అహం ప్రత్యయార్థమగు ఆత్మకు భేదము లేనందున “శరీరములు భిన్నములు కావున ఆత్మ లనేకములు" అను అనుమాన ప్రమాణము కూడ ఆత్మా నేకత్వమును సాధింపనేరదు. ఎట్లు స్థూల సూక్ష్మ కారణదేహ భేదములచే ఒక్కటి యగు ఆత్మకు భోగములు వేరువేరుగ నుండునో, అట్లే ఆత్మ యొక్కటియే యైనను దేవాదిదేహ భేదముచే ఒక యాత్మకే భోగములు వేరు వేరుగ నుండును. కనుక నే దేవాదిదేహములు భోగాయతనములు గాని, ఆత్మ భేద ద్యోతకములు కావు. ఆ దేహములయందే రూప తేజ స్స్వభావముల భేద మగపడుచున్నది కాని, చేతన భేద మగపడనందున, ఆత్మ విషయకమగు "నేను" అను జ్ఞాన మెప్పుడును ఒక విధముగనే యుండుటచే “అదితిర్దేవా గంధర్వా" అను శ్రుతి శరీరభేద ప్రతిపాదన వరమే కాని ఆత్మ భే భేదమును జెప్పునది కాదు. ఒక శరీరమునందే అవయవ భేదము నాశ్రయించి శిరస్సు, హస్తములు, పాదములు అనెడి వ్యవహార మెట్లు కలుగుచున్నదో, అట్లేయాత్మ యొకటేనను, శరీర భేదము వాశ్రయించి, “ నేను, నీవు, అతడు, దేవతలు, దానవులు" అను వ్యవహారము కలుగుచున్నదే కాని, ఆత్మ భేదము ననుసరించి కానందున " దేవ దానవ గంధర్వాః” అను పురాణ వచనములుకూడ ఆత్మ భేదమును బోధింప నేరవు. ఇట్లే “నీవు, నేను" అను వ్యవహారముళ రీర భేదము నాశ్రయించి ఉపపన్నమగుటచే ఇట్టి వ్యవహారాజన్య 'ధానుపపత్తి' సంభవింప నందున, అత్మలకు అనేకత్వ మును సాధించుటయందు అర్థాపత్తియు ప్రమాణము కానేరదు. పుణ్యపాపముల వలన సుఖదుఃఖములు ప్రాప్తించును. అవి యనేక విధములు. అట్టి పుణ్య పాపములకు కర్మ కారణము. “యత్కర్మకురుతే తదభి సంపద్యతే” “యథా కారీ యథా చారీ తథా భవతి" అను శ్రుతులు "ఆయా కర్మలు ఆయాకర్మ ఫలభోక్తలు న నేక విధము" లనిబోధిం చుటవలన కర్మపై చిత్ర్యముచేతనే సుఖదుఃఖాది వైచి 156 ఒక డుసుఖించుచుండిన నందరు సుఖింపవలయును ఒకడు దుఃఖించిన నందరు దుఃఖింపవలయును" అను నాపత్తి యును సంభవింపదు. అంతటను ఆత్మయే స్వయముగ ఆ యా బుద్ధివృత్తుల ననుసరించి విషయములను తెలిసికొనును. దేహము లు అనేకములుగాన దేహముల యందుండు బుద్ధి వృత్తులు గూడ అనేకములు, దానివలన బుద్ధివృత్తియగు జ్ఞానము కూడ ప్రతి దేహమునందును వేరువేరుగ నుండును. ఆ జ్ఞానము చదురింద్రియమువలె స్వసం బద్ధమగు విషయ మును మాత్రమే భాసింపజేయును. పరిచ్ఛిన్న మగుటచే సర్వ పదార్థ సంబంధము ఆ బుద్ధి వృత్తికి సంభవింపదు. కావున నొకడు సర్వజ్ఞుడైన నందరకు సర్వజ్ఞత్వము ప్రాప్తించదు. ఎట్లనిన శభోత్పత్తి కారణమును, విధువు నగు నా కాళమునకు నంతటను భేర్యాదులతో సంబంధ ముండినను, ఎచట భేరి దండముచే కొట్టబడునో అచటనే శబ్దము పుట్టును కాని భేర్యాదులున్న ప్రతి స్థలమునందు శబ్దము పుట్టుటలేదు. అల్లే ఆత్మ పరిపూర్ణము, ఏకము, అయినను, ఏదేహమునందు బుద్ధివృత్తికి సంబంధముండునో అక్కడనే (ఆ దేహావఛ్ఛేదముగనే) జ్ఞానము కలుగును కాని మరియొక స్థలమున (ఇతర దేహావచ్ఛేదముగ) జ్ఞానము కలుగనేరదు. కనుకనే బుద్ధివృత్తులు అనేకము లగుటచే వ్యాపకములు కానందున "ఆత్మైకత్వ మొప్పి నచో ఒకడు సర్వజ్ఞుడగుచో నందరు సర్వజ్ఞులు కావలెను" అను ఆప త్తియు సంభవింపదు. కనుకనే కించిద్ జ్ఞులకు ప్రవృత్తి నివృత్తి హేతువులు కావున విధి నిషేధ శాస్త్రములకు ఆనర్థక్యము సంభ వింపదు. ప్రాణులకు సర్వజ్ఞత్వము లేదని చెప్పుటచే "తద్యోయో దేవానాంప్రత్యబుధ్యత స ఏవ తద్భవ త్త థర్షీణాం తథా మనుష్యాణాం" అను శ్రుతి ననుస రించి వేదాంత శ్రవణ జన్య జ్ఞానముచేత ప్రత్యభిన్న మగు పరమాత్మను దేవ ఋషి మనుష్యులలో నెవడు తెలిసికొనునో వాడే ముక్తు డగును. అందువలననే ఆత్మ యొక్కటైనను “జ్ఞానా దేవతు కైవల్యం" అను నియమ శ్రవణమున ఆత్మజ్ఞానము చేతనే ముక్తు డగును. కనుక నే "ఆక్ష్మైక్యము నొప్పినచో నొకడు ముక్తుడైనను, బద్ధు