Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్వాప్నిక పదార్థములు జాగ్రత్తునందు గోచరించక పోవుటచే మిథ్య కావచ్చుననిన, అట్లగుచో జాగ్రడవస్థ యందు గోచరించు పదార్థములు స్వప్నమునందు గోచ రించక పోవుటచే నవియు మిథ్యయే యనవలయును. అనగా పరస్పర వ్యభిచారులగుటచే రెండును మిథ్యయే. "స్వప్న కాలమున పదార్థములు సత్యములుగా గోచరించి ప్రబోధావస్థయందు మిథ్య యగునట్లు జాగ్రదావస్థయందు గోచరించు నీ ప్రపంచము అనగా బ్రహ్మ భిన్నమగు ఈ నిఖిల ప్రపంచముకూడ మిథ్య యగుచున్నది. "నేను బ్రహ్మస్వరూపుడను" అను జ్ఞాన నిష్ఠా గరిష్ఠునకు ప్రపంచ భానమే లేనందున నిఖిల ప్రపంచము మిథ్యయే యని యొప్పుకొనవలయును. ఆత్మైక్య సాధనము : ఆత్మతత్త్వమును విచారించుచో ప్రత్యక్షాది ప్రమాణములకు విరోధము వాటిల్లునుగాన ఆత్మైక్యమును జెప్పుటకు వీలుపడదు. ఎట్లనిన : "నేను" అనెడి జ్ఞానము వేరు వేరుగ ప్రతి దేహమునం దును ప్రత్యక్షముగ కన్పట్టుచున్నందున. ఇట్లు "అహం ప్రత్యయ భేదముండు ప్రతి దేహమందున నాత్మ వేరు” అను అనుభవముచే ఆత్మ ప్రతి దేహము నందు వేరగుచున్నది. అట్లు కాక ఆత్మ యొక్కటియే యన్నచో “నేను, వీడు" అను వ్యవహారము లోపించును. అందుచేత ఆత్మలు అనేకములనుటకు బ్రత్యక్షము ప్రమాణము. ఇట్టి ఆత్మ భేదము నొప్పనిచో "నేను, వీడు" వ్యవహారము మరియొక విధమున సిద్ధింపనం దున, అను అర్థాపత్తి ప్రమాణముచే గూడ ఆత్మభేదము సిద్ధించు చున్నది. శరీరములు అనేకములు గావున గవాదులవలె వాటియందుండు ఆత్మ లనేకములు. లేక ప్రతిదేహము నందును “నేను. నేను” అను జ్ఞానము వేరుగ నుండుటచే ఆత్మ ప్రతి శరీరము నందును వేరుగ నుండుము" అను అనుమాన ప్రమాణముచే గూడ ఆత్మ భేదము సిద్ధించు చున్నది. “అదితి, దేవా, గన్ధర్వా, మనుష్యాః, పితరో, ఒ, సురాః" అను శ్రుతి వాక్యమును, “దేవ, దానవ, గంధర్వా, యక్ష, రాక్షస, కిన్న రాః"అను పురాణవచనమును, ఆత్మభేదమునే బోధించుచున్నవి. కావున ఆత్మలు భిన్నములనుటయందు శబ్దము కూడ ప్రమాణము. 155 అద్వైతము ఇన్ని ప్రమాణముల వలన ఆత్మభేదము సిద్ధించుచుం డగా “ అద్వైతము ” అనునది యెట్లు సిద్ధించునను ప్రశ్న ముదయించుచున్నది. మరియు ఆత్మైకత్వమునే అంగీకరించినవో సర్వ దేహములయం దుండు ఆత్మ యొక్కటియే గాన ఒకడు దుఃభించిన నందరు దుఃఖంచుటయు, ఒకడు సుఖించిన నందరు సుఖంచుటయు సంభవించును. అట్లే డేవారి సర్వ దేహముల యందుండు ఆత్మ యొక్కటి గావున, దేవతలు సర్వజ్ఞు అగుటచే మనుష్యులు గూడ సర్వజ్ఞులు కావలసివచ్చును. అట్లగుచో విధినిషేధశాస్త్రములు వ్యర్థములు కావలసివచ్చును. అట్లే ఒకడు బద్ధుడగుచో నందరు బద్దులు ఒకడు ముక్తుడగుచో నందరు ముక్తులు కావలసివచ్చును. కావున ప్రత్యనుమాన శబ్దార్థాపత్తి ప్రమాణ సిద్ధమగు ఆత్మా నేకత్వమును అంగీకరింప వలయును. అట్లు అంగీకరించినచో నద్వైత మెట్లు పొసగు నని శంకింపజనదు. ఒకనికే బాల్యావస్థ యందు “నేను బాలుడను" అను జ్ఞానముండినను, కౌమారావస్థయందు “నేను బాలుడను” అను జ్ఞానముండక, “నేను కుమారుడను" అను జ్ఞాన ముండును. వాని కేయౌవనావస్థయందు “నేను బాలుడను, నేను కుమారుడను" అను జ్ఞానముండక "నేను యువకు డను" అను జ్ఞానముండును. అట్లే వార్ధక్యమునందు "నేను బాలుడను, నేను కుమారుడను, నేను యువకుడను" అను జ్ఞాన ముండక " నేను వృద్ధుడను" అను జ్ఞానమే ఉండును. అట్లగుటచే ఒకనికే ఆ యా యవస్థలయందు నేను బాలు డను, నేను కుమారుడను, నేను యువకుడను, నేను వృద్ధు డను" అనునట్టి జ్ఞాన భేద మున్నను, తానవేశము కాక ఒక డే యగుచుం డెను. కావున “నేను, నేను" అను అహం ప్రత్యయభేదము ఆత్మకు అనేకత్వమును స్థాపింపనేరదు. కనుక నే ప్రత్యక్ష ప్రమాణము వలన ఆత్మకు అనేకత్వము సిద్ధింపదు. మరియు ఆత్మ శైశవాద్యవస్థాభేదముచే ననేక మన్నచో, నౌకనిచే ననుభూతమగుదానిని మరి యొకడు స్మరింపకపోవుట వలన "బాల్యమునందు నేను కందుక ముతో క్రీడించితిని" అని వృద్ధుడు మ్మరింపకపోవును. కావున జ్ఞాన భేదమున్నను జ్ఞాన విషయ అహం ప్రత్యయా