Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆద్వైతము ద్వార మునబయలు వెడలిన అంతఃకరణవృత్తులను తనయం చారోపించుకొని “నేను కర్తను, నేను భోక్తను, నేను సుఖిని, నేను దుఃఖిని" అని అనేకవిధముల క్లేశముల నొంది విశ్రాంతినిగోరి పరుండును. ఆ తరుణమున సర్వేంద్రియములు మనస్సునందు లయించును. అట్టి సమయమున జాగ్రదవస్థయందనుభవముల వలన జనించిన సంస్కారములతో గూడిన అవిద్య యొక్క పరిణామము లగు స్వాప్నిక పదార్థములను జూచును. ఆ సమయము నందు గలిగిన జ్ఞానము ప్రత్యక్షాత్మక మగుటచేత స్మృతి యని యనిపించుకొనదు. ప్రత్యణాత్మక మగుటవలన పదార్థములకు స్థితి నొప్పుకొనవలయును. ఆ స్వప్న పదార్థములగు గజతురగాదులు స్వీయ నివాసమునకు దగని ఈ శరీరమునందే గోచరించుటచేత, సత్యము అనుటకు వీలులేదు. ఐంద్రజాలికుడు ప్రాసాదమును మ్రింగుచున్నట్లు అతని మాయచే కనిపించును. కాని అతని ముఖమున ప్రాసాదమునకు ప్రవేశించు యోగ్యత లేనందున . ప్రాసాద నిగరణమునకు అయోగ్యమగు నతని ముఖమునందు అగుపడు ప్రాసాద నిగరణము మిథ్య యగునట్లు, స్వాప్నిక గజతురగాదులు మిథ్యయే అని యొప్పుకొనవలయును. ఈవిషయమునే శ్రీ గౌడ పాదా చార్యులవారు తమచే రచింపబడిన మాండూక్యోపనిష త్కారి కలయందు వై తథ్య ప్రకరణమున మొట్టమొదటనే "వై తథ్యం సర్వభావానాం స్వప్న ఆహుర్మనీషిణ।। అంతస్థానాత్తు భేదానాం సంవృతశ్వేన హేతునా" అను కారికచే స్పష్టముగ జెప్పిరి. పై గౌడపాద కారిక వలన "ఏ పదార్థము తనకు తగని ప్రదేశమున గోచరించునో ఆ పదార్థము మిథ్య" యని తేలినది. స్వాప్నిక పదార్థము అట్టివి కావు. మరే మనిన జీవుడు దేశాంతరమున కేగి యోగ్యస్థలముల యందుండు గజతురంగాదుల నే జూచును. కావున స్వప్నమునందు . గోచరించు గజతురగాదులు సత్యములే కాని మిథ్య శాషని శంకించి జనదు. ఇట్టి ఆళంకము తొల గించుటకే శ్రీ గౌడపాదాచార్యుల వారు పై నుదహ రించిన కారిక తరువాత, ఘు "అ దీర్ఘ శ్వా చ్చ కాలస్య గత్వా దేశాన్న వళ్యతి” అని కారికను వ్రాసియుండిరి. అనగా ఒకనికి కాశి 154 కేగినటుల స్వప్నము వచ్చినది. కాళి కేగవలెననిన విమా నముచే నేగినను నాలుగు గంటల కాలమైన కావలెను. క్షణకాలమున స్వప్న మునందు కాశీ కేగినటులక నిపించును. ఇంత స్వల్పకాలమున దీర్ఘకాలమునందు ప్రయాణము చేయదగిన కాళికి ఆతడు ప్రయాణముచేయనేరడు కావున స్వాప్నిక పదార్థములు తగని యీ శరీరమునందే గోచ రించునని యొప్పుకొని తీరవలెను. అందుచే స్వాప్నిక పదార్థములు మిథ్యయే యని తేటపడుచున్నది. لتو స్థూలశరీరముతో కాశి కేగుటకు దీర్ఘ కాలము కావలెను కాని లింగదేహముతో కాళికేగుటకు దీర్ఘకాలము అవ సరములేదు. కావున జీవుడు లింగదేహముతో మాత్రము కూడుకొని శీఘ్రకాలమున నే కాశికి బోవచ్చును. అచట పదార్థములను జూడవచ్చును. అందుచే స్వాప్నిక పదార్థ ములు తగు ప్రదేశమున నే గోచరించుటచే సత్యమేయని శంకింపరాదు. అట్టి శంకను తొలగించుటకే శ్రీ గౌడ దాపాచార్యులవారు పై కారిక యొక్క ఉత్తరార్ధమును "ప్రతి బుద్ధళ్ళ పై సర్వస్తస్మినేనే న విద్యతే" అని చెప్పియుండిరి. ఒక పురుషునకు క్షణకాలములోనే కాశి కేగి కాశీ విశ్వనాథునకు అభిషేకము చేయు చున్నట్లు స్వప్నము కలిగెను. వెంటనే ఆతడు మెలకువ గాంచెను. ఇట్టిసమయమున అత డుండవలసిన చోటు తన గృహమా, లేక కాశీవిశ్వనాథుని యాలయమా అనినచో, అతడు తన గృహమున పడకటింటియందు శయ్యపై నున్నట్లు స్వప్నము రాలేదు కావున క్షణమాత్రమున ఇంటికి జేరలేదు. కాశీ విశ్వనాథునకు అభిషేకము జేయు చున్నట్లు స్వప్నములోనుండి మెలకువ గాంచెను. కావున అతడు కాశీవిశ్వనాథుని యాలయములోనే యుండక పడక టింటియందలి శయ్యమీదనే ఉండుటచే స్వప్న మునందు దేశాంతరమునందుండు పదార్థములను జూచుట లేదు. ఇక ఏ మనిన నిద్రాది దోషముతోగూడి, పూర్వానుభవ జనిత సంస్కారసహితమగు అవిద్యవలననే జనించిన స్వాప్నిక పదార్థములను అయోగ్యమగు నీ దేహము నందే జూచును. కావున స్వాప్నిక పదార్థములు మిథ్య యే యని యొప్పుకొనవలయును. అట్లే జాగ్రదావస్థయందు గోచరించు నిఖిల ప్రపంచము మిథ్యయే యని తెలిసి కొనదగును.