Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రజతాదులవలె, స్వప్న ప్రపంచమువలె, మిథ్య యెట్లగు ననిన, దృశ్యములగు శుక్తిరజతాదులును స్వప్న ప్రపంచ మును ఎటుల సత్యేతరములో అటులనే యీ ప్రపంచము మిథ్య యగును. కావున దృశ్యమను హేతువు వ్యభిచారి యగుటచే ప్రపంచమునకు సత్యత్వమును స్థాపింపనేరదు. శుక్తియందు రజతభ్రాంతి కలిగిన పిమ్మట “ఇది శుక్తి" అను జ్ఞానము కలిగి అద్దానిచేత రజత భ్రాంతి తొలగును. అచట రజతము లేదు, ప్రపంచమనునది ప్రత్యక్షముగ గాన్పించుటయే కాక వస్తుస్థితిని గూడ జూచుచుండ ప్రపంచము మిథ్యయని యెటుల చెప్ప నొప్పును అను విషయము విచారింప తగినది. భ్రమస్థలమున శుక్తిని జూచిన తోడనే “ఇది శుక్తి” అను జ్ఞానము కలుగలేదు. "ఇది రజతము" అను జ్ఞాన మే కలిగినది. ఈ జ్ఞానము ప్రత్యక్షమా? అనుమితియా ? ఉపమితియా ? శాబ్దమా? అర్థాపత్తియా ? త్తియా? అనుప లబ్ధియా ? అనినచో శుక్తికకు చతురింద్రియమునకు సంయోగము ప్రాప్తించి "ఇది రజతము" అను జ్ఞానము కలిగిన పిమ్మట నేను రజతము నూహించుచుంటిని.” అను నీమొదలగు అనుభవములు (అనువ్యవసాయ ములు) లేకుండుటచేత “ఇది రజతము" అను జ్ఞానము అనుమి త్యాదిక ము కాదు. "ఇది రజతము" అను జ్ఞానము కలిగిన పిమ్మట " నేను రజతమును చూచుచుంటిని" అను అనుభవముండుట చేత “ఇది రజతము” అను జ్ఞానము "ఇది రజతము" అను జ్ఞానము ప్రత్యక్షమేయని అంగీకరింప వలయును. దేశాంతరము నందుండు రజతమునకును చదురింద్రియమునకును సంబంధము ఏర్పడదు గావున "ఇది రజతము" అను జ్ఞానమున దేశాంతరస్థమైన రజతమే భాసించునని చెప్ప నొప్పదు. రజతము లేకున్నను "ఇది రజతము" అను భ్రాంతి కలుగుననిచో, విషయమే లేనితరిఅట్టి జ్ఞానమే కలుగదు. మరియు నేను రజతమును చూచుచుంటిని" అను అనువ్యవసాయము రజతస్థితిని ధ్రువపరచుచున్నది. శావున "ఇది రజతము” అను భ్రాంతిస్థలమున రజత మున్నదని యొప్పుకొని తీరవలెను. కాని ఆరజతమేది యని మాత్రము విచారింప వలయును. దేశాంతరస్థమయిన రజతమునకు చదురింద్రియము నకు సంబంధము పొసగదు కావున దేశాంతరస్థ రజతము 20 153 అద్వైతము "ఇది రజతము" అను భ్రాంతియందు భాసింపనందున "ఇది రజతము" అను భ్రాంతి సమకాలమున నొక రజతము పుట్టి, యా రజతమే “ఇది రజతము" అను జ్ఞానమున భాసించుచున్నదని యొప్పుకొనవలయును. కాని ఇట్టి రజతము పుట్టుటకు కారణ మేమియుండునని మాత్రము విచారింపవలసి యున్నది. చతురింద్రియమునకును, పురోవర్తి వస్తువునకును సంయోగము కలిగిన పిమ్మట “ఇది శుక్తిక” అను జ్ఞానము కలుగలేదు. అనగా శుక్త్య జ్ఞానమే యున్నది. ఇది యిట్లుండ పూర్వమునం దెన్నడో సత్య రజతమును జూచినప్పు డాయనుభవము వలన రజత సంస్కారము జనించియుండెను. ప్రకృతమున చకు రింద్రియమునకును పురోవర్తి వస్తువునకును సంయోగము జనించుతరి పురోవర్తి వస్తుగత చాకచక్యము ప్రత్యక్షమై ఆ ప్రత్యక్షము వలన పూర్వ రజక సంస్కార ముద్భుద్ద మగును. అట్టి ఉద్బుద్ధ సంస్కారముతో బాడీ శుక్త్య జ్ఞానము రజతాకారముగను, రజక జ్ఞానా కారముగను పరిణమించును. ಇಟ್ಟಿ రజతమునే ప్రాతిభాసిక రజత మందురు. కావున "ఇది రజతము" అను జ్ఞానమున థాంచు రజతము శుక్త్య జ్ఞానము వలన వరిణమించి, శుక్తి జ్ఞానము వలన నివర్తించునటుల, ఆశ్మా జ్ఞానము వలన పరిణమించిన యీ నిఖల ప్రపంచము, నాత్మజ్ఞానము నివర్తించునట్టి దగుట చేత శుక్తిరజతమువలె మిథ్యయేయని యొప్పుకొనవలెను. వలన శుక్తిరజత మర్థక్రియాకారి యగుటలేదు. భుజించినట్లు స్వప్న మువచ్చినపుడు స్వప్న మునందు స్వప్న సమ కాలమున భుజించుటయు, దానివలన తృప్తియు కనిపించుచున్నవి. కావున స్వప్నము సత్యమే యగుచుండ స్వప్నమువలె ప్రపంచము మిథ్య అనుట యెట్లు పొసగుననిన సమా ధాన మిట్టిది. వినుము : ఒక డేగ తన శక్తికొలది ఇటు నటు ఎగిరి యెగిరి శ్రమమునుపొంది సాయం కాలమునకు తనగూటి కేగి రెక్క లను ముడుచుకొని యెట్లు విశ్రమించునో, అట్లే ఆత్మయు అంతఃకరణముతో తాదాత్మ్యాధ్యాసను పొంది, అంతః కరణ ధర్మములయిన అహంకార మమ కారాదులను ఆత్మయందారోపించుకొని, “నేను, నాది" అని అహం కార మమకారావిశిష్టమై చదురాదీంద్రియముల